Take a fresh look at your lifestyle.

హుస్నాబాద్‌ ‌పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి

మున్సిపల్‌ ‌కార్యవర్గం పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి  : హుస్నాబాద్‌ ‌మున్సిపల్‌ ‌బడ్జెట్‌ ‌సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే  సతీష్‌ ‌కుమార్‌

‌హుస్నాబాద్‌ ‌పట్టణాన్ని సమస్యలు లేని మున్సిపాలిటీగా, సుందరంగా ఆదర్శంగా తీర్చిదిద్ధేందుకు మున్సిపల్‌ ‌కార్యవర్గం అధికారులు కృషి చేయాలని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్‌ ‌కుమార్‌ అన్నారు. హుస్నాబాద్‌ ‌పట్టణం లోని మున్సిపల్‌ ‌కార్యాలయంలో బుధవారం చైర్మన్‌ ఆకుల రజిత అధ్యక్షతన బుధవారం బడ్జెట్‌ ఆమోదానికి సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌మాట్లాడారు. మున్సిపల్‌ ‌కార్యవర్గం, అధికారులు, సిబ్బంది పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రచించాలని సూచించారు. మొదట పట్టణంలో ఉన్న ప్రధాన, ఇతర సమస్యలు గుర్తించాలని, వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేయాలని అన్నారు. రాబోయేది వర్షాకాలం అయినందున రోడ్ల సమస్యలు ఉంటె యుద్ధ ప్రాతిపదికన పూర్తీ చేయాలనీ లేకుంటే వర్షాకాలం ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. లిఇటీవల కరోనా నివారణ చర్యల విషయమై మున్సిపల్‌ ‌కార్యవర్గం, అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు చేసిన సేవలను, నిర్వహించిన సేవ కార్యక్రమాలను ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌ప్రత్యేకంగా ప్రశంసించారు.లి వర్షాకాలంలో దోమల బెడద లేకుండా చూడాలని, అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని , పారిశుధ్యాన్ని సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఇంటి పన్నులు, తైబజార్‌ ‌వేలం, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం దాదాపు 5.40 కోట్లు పూర్తిగా సద్వినియోగం కావాలని, నాణ్యతతో పనులు జరగాలని, గతంలో ప్రారంభించి పెండింగ్‌ ‌లో ఉన్న పనులు పూర్తి చేయాలనీ ఆదేశించారు. పట్టణంలో ప్రతి వీధిలో, ప్రధాన రహదారుల వెంట వర్షాకాలంలో విరివిగా మొక్కలు నాటాలని, వాటిని కాపాడే బాద్యతను, ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, వ్యాపారులకు అప్పగించాలని అన్నారు. పనులను సకాలంలో పూర్తి చేయని గుత్తేదారులకు పనులు అప్పగించవద్దని, పనుల నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొత్తగా ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా నిబంధనల మేరకు జారీ చేయాలనీ, రోడ్ల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరించాల ని అన్నారు. మున్సిపల్‌ ‌మంత్రి కె టీ ఆర్‌, ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు సహకారంతో మరిన్ని నిధులు పట్టణ అభివృద్ధి పనులకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని, ఇందుకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలనీ ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ‌పాలకవర్గాన్ని ఆదేశించారు. హుస్నాబాద్‌ ‌పట్టణంలో తాగు నీటి ఎద్దడి సమస్య మిషన్‌ ‌భగీరథ కార్యక్రమంతో తగ్గిందని, పెండింగ్‌ ‌లో ఉన్న మిషన్‌ ‌భగీరథ పనులు అధికారులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌ ఆదేశించారు. హుస్నాబాద్‌ ‌పట్టణంలో గడచిన ఆరేళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని, వారి అభిప్రాయాలూ పరిగణలోనికి తీసుకొవాలని, అలాగే అధికారులు, పాలకవర్గం సమన్వయం తో పని చేయాలని సూచించారు.

నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే
హుస్నాబాద్‌ ‌పట్టణంలోని జిల్లా పరిషత్‌ ‌బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిరుపేదలకు హుస్నాబాద్‌ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్‌ ‌కుమార్‌ ‌బియ్యం పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రేషన్‌ ‌కార్డు ద్వారా బియ్యం పొందిన వారి నుండి బియ్యం సేకరించి రేషన్‌ ‌కార్డు లేని నిరుపేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నారని, ఇది ఎంతో మందికి ఉపయోగపడుతోంది అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు తెలుపు రంగు రేషన్‌ ‌కార్డు ఉన్న వారికీ రూ. 1500 చొప్పున నగదును అందించడంతో పాటు రెండు సార్లు బియ్యం కూడా అందించిందని తెలిపారు. సి ఎం కేసీఆర్‌ ‌కరోనా సమయంలో నిరుపేదలను ఆడుకుంటున్నారని తెలిపారు. ప్రజలు కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని, కరోనా నియంత్రణ చర్యలపై నిర్లక్ష్యం తగదని సూచించారు.

Leave a Reply