Take a fresh look at your lifestyle.

నగరం ఓ సాగరం

పుట్టి పెరిగిన
ఊరునిడిసి పట్నం పోయినం
రంగు రంగుల ప్రపంచమని
మస్తు పనుంటదని
పస్తులిక ఉండవని
బతుకురంగు మారుద్దని
ఉన్నదంతా ఇడిసి పనిబాట పట్టినం
ఏ పూట కాపూటా పనిజేస్తూ బతికినం
ఉన్నదాంట్లోనే  కడుపు నింపుకున్నం
కరోనాకు చిక్కకుండా జాగ్రత్త పడినం
విశ్వ నగరమని, మెట్రోపాలిటన్‌ ‌సిటీ
భే ఫీకర్గ ఉండొచ్చన్న అయ్యోర్ల మాటలు నమ్మినం
నగరం మారుతుందని
ఊహించనంతగా ఉంటుందన్న వాదన నిజమని
భద్రతగా బతుకుంటదని
నగరాన్ని నమ్మినం
నట్టేట జలంలో తెలుతున్నం….

ఇప్పుడు నగరం
రూపం రాక్షస సాగరం
కుండపోత వానలు
కునుకుతీస్తు కాటికి పోయిన ప్రాణాలు
భవంతులు కూలి
మాంసపు దేహాల్ని తమలో కలుపుకొని
పారుతున్న జలాలు
వృక్షాలు రవాణాకు సెలవు ప్రకటిస్తున్న దృశ్యాలు
ఫ్లెక్సీలు, భారీ ప్రకటన ఫ్రేమ్‌, ఇనుపరేకులు
ఊడి పడి ఉరుముల శబ్దాలకు
కోరస్‌ ‌పడుతున్న సన్నివేశాలు
సచ్చిన తెలువని జాడలు
ఉప్పొంగుతున్న నాలాలు, డ్రైనేజీ పైపులు
తెగిపడిన కరెంట్‌ ‌తీగలు
నగర జీవులకు యమపాషాలై
మృత్యువును ఉచితంగా
ఇస్తున్న పరిస్థితి
ఇంకొందరు జాడకై
ఏడుస్తున్న ఆక్రందనల దుఃఖపు నీరు
ప్రవాహంలో కలిసిపోయిన
కలచివేస్తున్న ఖఠోర వాస్తవాలు
కళ్లకు కడుతున్నయి కన్నీటి వెతలు ఎన్నో..ఎన్నెన్నో

అధికారుల
అత్యవసర ప్రకటనలు
సానుభూతి కుసంస్కారాలు
మేడిపండు ప్యాకేజీలు
ఎండమావి చర్యలు, కార్యాలయాలకు
సెలవులు కాదు కావాల్సింది
నగరాన్ని సాగరంగా మారని
చిత్తశుద్ధి పారిశుద్ధ్య ప్రణాళికలు
క్షేత్రస్థాయి సమస్య మార్గాలని
సూపి, పరిష్కరిస్తే
నగరంలో ఎన్ని జల ఉపద్రవాలు వచ్చిన
కాస్త భద్రంగా బతకగలరు.
నాగరాజు (మద్దెల)…
6301993211.

Leave a Reply