Take a fresh look at your lifestyle.

పౌరసత్వచట్ట సవరణ (సీఏఏ) రాజ్యాంగ విరుద్ధం

  • భారతలౌకిక విధానాలకు, రాజ్యాంగస్పూర్తికి విఘాతం
  • ప్రజలను గందరగోళ పరుస్తున్నది
  • దేశంలో తెలంగాణకు కూడా భాగాస్వామ్యం ఉంది
  • వ్యతిరేకిస్తే పాక్‌ ఏజెంట్లు అంటారా?
  • విస్తృత అభిప్రాయంతో ముందుకు సాగాలి
  • చట్టానికి ముందు దేశంలోని పార్టీలతో చర్చించాలి
  • పౌరసత్వ సవరణ చట్టంపై సైద్ధాంతికంగా చర్చించిన సీఎం
  • అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం,ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం
  • కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తూర్పార పట్టిన సిఎం కెసిఆర్‌

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) రాజ్యాంగ విరుద్దమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పష్టంచేశారు. లౌకిక విధానమే స్పూర్తిగా ఏర్పడిన మనరాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు ఈ చట్టం విఘాతం కలిస్తున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించారు.. రాజ్యాంగస్పూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నందున ఈ చట్టాన్ని టీఆర్‌ఎస్‌ ‌వ్యతిరేకిస్తున్నదని సోమవారం శాసనసభలో సీఎం తమ పార్టీ విధానాన్ని ప్రకటించారు.సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలో సభానాయకుడి హోదాలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మనాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని కాంగ్రెస్‌ ‌శాసనసభాపక్షం ఆహ్వానించింది. ఎంఐఎం అంగీకారాన్ని తెలియచేసింది. మజ్లీస్‌, ‌కాంగ్రెస్‌ ‌పక్ష నాయకులు తమ పార్టీల నిశ్చితాభిప్రాయాలను తెలియచేశారు. బీజేపీ పక్షాన రాజాసింగ్‌ ‌బీజేపీ అభిప్రాయాలను వెల్లడించారు. కాగా తీర్మాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ సీఏఏ చట్టం ప్రజలను గందరగోళ పరుస్తున్నదని స్పష్టత లేదని, దేశ ప్రజల్లో అభద్రతా భావం నెలకొన్నదని,…విస్తృత ప్రజాభిప్రాయం మేరకుమాత్రమే దీనిని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తే, భిన్నాభిప్రాయం తెలియచేస్తే పాకిస్తాన్‌ ఏజెంట్లను ముద్రవేస్తున్నారని బీజేపీ విధానాలను తూర్పారపట్టారు.

చట్టాన్ని అమలులోకి తెచ్చేముందు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రజలను గందరగోళపరిచి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), ‌జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ ‌శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. భిన్న స్వరూపం, కాస్మోపాలిటన్‌కల్చర్‌, ‌భిన్న సంస్కతులకు ఆలవాలంగా ఉన్న తెలంగాణ సీఏఏపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.స్పష్టమైన అభిప్రాయంతో సైద్ధాంతికబలంతో సీఏఏ చట్టాన్ని వక్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. జాతీయ పౌరసత్వ చట్టంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి వారి పద్ధతుల్లో నిరసనలు తెలియజేశాయని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. దేశంలో ఇప్పటికే ఏడు రాష్టాల్రు కేరళ, పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌రాజస్తాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ ‌సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తెలంగాణ ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు. ఆందోళనలను సృష్టిస్తున్న సీఏఏని పునఃసక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పీకర్‌ ‌ద్వారా కేంద్రాన్ని కోరారు. సీఏఏను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన సందర్భంగా దేశంలో జరిగిన అల్లర్లలో 50 మంది చనిపోయారని,, కేంద్ర నాయకులు బాధ్యతారహితంగా ఇష్టవచ్చినతీరులో మాట్లాడారని ఆయన విమర్శించారు.

- Advertisement -

ఈ దేశానికి సీఏఏ అవసరం లేదని కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు. సిఎఎసను వ్యతిరేకిస్తే పాకిస్థాన్‌లంటూ చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.. తెలంగాణ అసెంబ్లీ మొత్తంగా దీనిని వ్యతిరేకిస్తోందని, అలాంటప్పుడు తెలంగాణఅసెంబ్లీ పాక్‌ అనుకూలమా అని ప్రశ్నించారు. భారతదేశ సరిహద్దులతో గోడకడతామంటే తాము మద్దతును ఇస్తామని అన్నారు. దేశాలు తమ సరిహద్దులను కాపాడుకుంటామయని, ఒక దేశం లక్షణమని చెప్పారు. అదేవిధంగా పాకిస్తాన్‌లో 370ని ఎత్తేయడాన్ని ఆహ్వానించామని, కశ్మీర్‌ ‌భారతదేశంలో అంతర్భాగమని ఘంటాపథంగా చెప్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాని, రాజ్యాంగవిలువలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోమని చెప్పారు. సీఏఏ అమలు తప్ప దేశంలో వేరే సమస్యే లేదన్నట్టు, ఏదో కొంపలు మునిగినట్టు ఇదొక్కటే సమస్య అన్నట్టు కేంద్రం ప్రవర్తిస్తోందన్నారు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదని 130కోట్ల దేశ ప్రజల సమస్యని అన్నారు. తనకే బర్త్ ‌సర్టిఫికెట్‌ ‌లేదని ఇదివరకే చెప్పానని. తన ఒక్కడి పరిస్థితి ఇలా అంటే దేశంలో అనేక మంది ప్రజలకు ధృవీకరణలు ఉండేఅవకాశం లేదని పేర్కొన్నారు. సంచారజీవులు, వలసకూలీలు, గిరిజనులు, ఎక్కడినుంచి పుట్టినసర్టిఫికెట్‌ ‌తెస్తారని ప్రశ్నించారు. ఓటర్‌ ఐడి, ఆధార్‌, ‌రేషన్‌ ‌కార్డ్ ఏవీ కూడా పని చేయవని అంటున్నారని ఇదేమి అయోమయమని ప్రశ్నించారు.ఓటరు కార్డు చూపెట్టి భారతప్రజలు ప్రధానమంత్రిని ఎన్నుకున్నారని, ఓటరు కార్డు చెల్లనప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏమిటని అడిగారు. ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ చేస్తామంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఈ చట్టం ద్వారా దేశంలోని 50 న్చుఒ 60:శాతం మంది ప్రజలను ఇబ్బంది పెట్టడం అవసరమా? ..ద్వంద్వ వైఖరి ఎందుకని సూటిగా ప్రశ్నించారు. కుల, మత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా కొనసాగుతామని ప్రమాణం చేస్తాం. ముస్లింలను మినహాయించి చట్టం అనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎంఐఎం, మేము కలిసి పనిచేస్తాం..దాంట్లో అనుమానం లేదు. కొన్ని విషయాల్లో మజ్లిస్‌, ‌మా అభిప్రాయాలు ఒకటిగా ఉండొచ్చు. కానీ, విభేదించే అంశాలు చాలా ఉంటాయని చెప్పారు.

తమ అభిప్రాయాలు తమవని..వారి అభిప్రాయాలు వారివేనని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. 370 అధికరణ విషయంలో మొట్టమొదట మేమే మద్దతునిచ్చామని, దేశ సమస్య కావడంతో మద్దతు ఇచ్చామని వివరించారు.. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట దెబ్బతింటున్నదని., సీఏఏవంటి చట్టం దేశానికి శ్రేయస్కరం కాదని, కేంద్రానికి తాము సూచిస్తున్నామని, కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పున:సక్ష చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. నిర్ధిష్టప్రతిపాదనలతో ముందుకు వస్తే మద్దతు ఇచ్చే అంశాలను పరిశీలిస్తామన్నారు. దేశంలో ఓటింగ్‌ ‌విధానంలోనే అధికారాలు వస్తాయని,..కోట్లాది్ప జలు ఓట్లేసి నాయకులను ఎన్నుకున్నారని, అందుకని కోట్లాది భారత ప్రజల అభ్పిప్రాయాలను గౌరవించాల్సిన బాధ్యత పాలకులదని నిశ్చితాభిప్రాయం ప్రకటించారు. ్ర భారతదేశంలో కూడా సరిహద్దు చుట్టూ గోడ కడతారా? దేశ సరిహద్దుల దుగా గోడకడతామంటే మేం సపోర్ట్ ‌చేస్తాం. వీరజవానులు సరిహద్దులో అహోరాత్రులు కాపలాకాస్తున్నందుననే మనం కంటినిండా నిద్రపోగలుగుతున్నామని పేర్కొన్నారు. లౌకిక పునాదుల ద నిర్మితమైన పార్టీ టీఆర్‌ఎస్‌.అని, దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటిపై స్పందిస్తామని చెప్పారు. భారత రాజ్యాంగం కులమతాలకు అతీతంగా ఉంటుంది.

సీఏఏని ఎవరైనా వ్యతిరేకిస్తే వారు దేశ ద్రోహులువుతారా? అని ప్రశ్నిస్తారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఎల్‌కే అద్వానీ ఆధ్వర్యంలో సీఏఏపై 2003లో కమిటీ వేశారని, 12 రాష్టాల్రు ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే కూడా చేశారని గత చరిత్రను సభకు పరిచయం చేశారు. కేవలం.. అప్పట్లోనే ఈ ప్రాజెక్టు విఫలమైంది. బంగ్లాదేశ్‌ ‌నుంచి వచ్చినవారిని కాందిశీకులుగా భారత్‌ ‌గుర్తించింది. పనుల కోసం వలసలు పోయినవారి గతేంకావాలని అడిగారు.. విభజన రాజకీయాలు ఈ దేశానికి అవసరమా? విభజన సమయంలో బంగ్లాదేశ్‌, ‌పాకిస్థాన్‌ ‌నుంచి వచ్చి దేశంలో స్థిరపడ్డారని తెలిపారు. దేశ జీడీపీకి అతి ఎక్కువగాచెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ మొదటివరుసలో ఉన్నదని అందుకని ప్రశ్నించే హక్కు తమకు ఉన్నదని అన్నారు. దేశ నిర్మాణంలో తెలంగాణ భాగస్వామిగా ఉన్నదని,. గోలీమారో వంటి నినాదాలు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు.. సీఏఏ కారణంగా దేశ ప్రతిష్ట మంటగలుస్తోందని విమర్శించారు. లౌకిక, ప్రజాస్వామ్యవాదులు సీఏఏపై తమ తమ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నారని వివరించారు. సీఏఏ చట్టం దేశవ్యాప్తంగా అనుమానాలకు ఆందోళనలకు దారితీసిందని పేర్కొన్నారు.. సీఏఏపై కేంద్రం పునఃసక్షించుకోవాలని సూచించారు.

Leave a Reply