Take a fresh look at your lifestyle.

పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దం

  • అసెంబ్లీలో సి ఎ ఎ వ్యతిరేకంగా తీర్మానం
  • కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తూర్పార పట్టిన సిఎం కెసిఆర్‌

‌పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్దమని, అది దేశ లైకికి విధానాలకు భంగంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టంపై స్పష్టత లేదని, దేశ ప్రజల్లో అభద్రతా భావం నెలకొందని….విస్తృత ప్రజాభిప్రాయం మేరకుమాత్రమే దీనిని అమలు చేయాల్సి ఉందన్నారు. దానికన్నాముందు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఇకపోతే రాక్షసానందం పొందుతూ పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని కేంద్రానికి స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జనాభా పట్టిక(ఎన్‌పీఆర్‌), ‌జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్‌ ‌శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు. భిన్న స్వరూపం, వందల ఏళ్ల కాస్మోపాలిటిన్‌ ‌కల్చర్‌, ‌భిన్న సంస్కతులకు ఆలవాలంగా ఉన్న తెలంగాణ సీఏఏపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

జాతీయ పౌరసత్వ చట్టంపై గత కొద్ది రోజులుగా అనేక వర్గాలు వారి వారి పద్ధతుల్లో నిరసనలు తెలియజేశాయని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. సీఏఏపై పార్లమెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెప్పామని అన్నారు. దేశంలో ఇప్పటికే ఏడు రాష్టాల్రు కేరళ, పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌, ‌రాజస్తాన్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ ‌సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తమది ఎనిమిదో రాష్ట్రమని సీఎం తెలిపారు. ఆందోళనలను సృష్టిస్తున్న సీఏఏని పునఃసక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పీకర్‌ ‌ద్వారా కేంద్రాన్ని కోరారు. సీఏఏను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకొని పూర్తిగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడి ఢిల్లీ పర్యటన సందర్భంగా దేశంలోనే అనేకమంది చనిపోయారని, కేంద్ర నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆయన విమర్శించారు. ఈ దేశానికి సీఏఏ అవసరం లేదని కేసీఆర్‌ ‌తేల్చిచెప్పారు.

Tags: Citizenship Amendment Act (CAA), National Population Table (NPR), CM KCR against National Citizen Chart (NRC)

Leave a Reply