Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ఎన్నికలోక్లలో ముఖ్యమంత్రికి దిమ్మదిరిగే తీర్పు ఇవ్వాలి

నగర అభివృద్ది బిజెపితోనే సాధ్యం

గ్రేటర్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా బిజెపి సత్తా చాటుతుందని ఓబిసి జాతీయ అధ్యక్షుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంఐఎం ‌పార్టీకి కొమ్ము కాస్తున్నారని, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందాన్ని ప్రజలు గుర్తించాలన్నారు.  ముస్లింల సంక్షేమం కోసం ఆలోచించే పార్టీ కేవలం బీజేపీ మాత్రమేనని, ముస్లిం మహిళల సంక్షేమం ఆలోచించే మోదీ త్రిపుల్‌ ‌తలాక్‌ ‌చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉం‌డడం ప్రజలకు శాపమని అన్నారు.
వచ్చే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో నగర ప్రజలంతా ఏకమై ముఖ్యమంత్రికి దిమ్మదిరిగే తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ ‌పార్టీ హయాంలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడంతో హైదరాబాద్‌లో బీసీలకు నష్టం జరిగిందన్నారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు, కొరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశం నిర్వహించాలన్నారు.

Leave a Reply