Take a fresh look at your lifestyle.

కొరోనా – మూడో ప్రపంచం ముంగిట సవాల్‌

“లండన్‌లో ఒక పెట్టుబడి పరిశోధన సంస్థ టిఎస్‌ ‌లాంబార్డ్ ‌ప్రకారం భారతదేశం అస్ట్రాజెనెకా సహా బహుళజాతి కంపెనీలకు టీకాలు ఉత్పత్తి చేసే ఔషధ కంపెనీలకు పుట్టినిల్లు. కానీ భారతదేశ జనాభా సంపూర్ణంగా టీకాలు వేయించుకోవడం 2024 కన్నా ముందైతే కాదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దుర్బలంగానే మిగిలిపోనుంది. పేద దేశాల్లో జనబాహుళ్యానికి టీకాలు అందుబాటులోకి రాకపోయినప్పటికీ, తిరిగి సాధారణ స్థితికి చేరుకునే సంపన్న దేశాల నుంచి కొంత చెదరుమదరు ప్రయోజనాలను పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు పొందే అవకాశం ఉంది. అసమానతతో రూపుదిద్దుకున్న ఒక ప్రపంచంలో, అక్రమంతో వృద్ధి ఏకీభవించగలదు.”

‘‌ప్రజాతంత్ర’ ఇంటర్నెట్‌ ‌డెస్క్ : ఎట్టకేలకు మహమ్మారికి రోజులు దగ్గరపడుతున్న వైనం కనిపిస్తున్నది. 1929 నుంచి దాదాపు నాలుగేళ్ళపాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఆర్ధిక మాంద్యం (గ్రేట్‌ ‌డిప్రెషన్‌) ‌తర్వాత అంతర్జాతీయంగా అంతటి ఆర్థిక మహా విపత్తు నుంచి విముక్తి లభిస్తున్నది. కోవిడ్‌ ‌టీకాలు మానవ రక్త ప్రవాహంలోకి ప్రవేశించడంతో కోలుకోవడం వాస్తవరూపం దాల్చింది. కానీ ప్రయోజనపూరిత ఫలాలు మాత్రం సరిసమాన పంపిణీకి సుదూరంగా ఉన్నాయి. ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లోని సంపన్న దేశాలు పరిమితంగా ఉన్న టీకాల నిల్వలను•భారీగా• పోగుచేసుకున్నాయి. వాటి అచంచలమైన మెరుగుపడిన ఆర్థిక స్థితిగతుల కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.• మానవతకు ఆవాసాలుగా పేరెన్నికగన్న అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వంతంగా తయారు చేసుకున్న టీకాల డోసులను కాపాడుకోవడానికి పరిమితమైపోయాయి.

అసమగ్రంగా జరుగుతున్న టీకాల పంపిణీ చూడబోతే ఒక సరికొత్త నిర్వచనానికి నోచుకోనున్న ఆర్థిక వాస్తవికతను అస్తవ్యస్తం చేసేలా ఉంది. చరిత్రలో ఈ దారుణమైన అధ్యాయం నుంచి పురుడు పోసుకుంటున్న ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో మరింత అసమానతలకు రంగస్థలం కానుంది. మహమ్మారి చేతిలో పేద దేశాల కడగండ్లు కొనసాగుతూనే ఉంటాయి. అమెరికా, ఐరోపా, చైనా దేశాల్లో రుణదాతలకు చెల్లించాల్సిన అప్పులు అంతకంతకు పెరిగిపోతుండగా, అప్పటికే హరించుకుపోయి, అంతంతమాత్రంగా మిగిలిపోయిన వనరులను గత్యంతరంలేక వినియోగించుకోవాల్సిన పరిస్థితుల్లోకి సదరు పేద దేశాలు నెట్టివేయబడతాయి.సంపద, విద్యలతో పాటుగా రక్షిత నీరు, విద్యుత్తు, ఇంటర్నెట్‌ ‌లాంటి కీలకమైన అంశాల అందుబాటులో అగాధాన్ని తాకే అంతరాలతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అనాదిగా చిన్నాభిన్నమైపోతూ వస్తున్నది. మహమ్మారి పోతూ పోతూ తన ముగింపును, విధ్వంసమైపోయిన జీవికను అల్పసంఖ్యాక జాతులు, మహిళలు, అల్పాదాయ కుటుంబాలకు అంటకట్టింది. ఆ ముగింపు చీలికలుపీలికలైపోయిన ప్రపంచానికి మరో చీలికను తేనుంది. అది టీకాలు అందుబాటులో ఉన్న దేశాలు, టీకాలు అందుబాటులో లేని దేశాలుగా ప్రపంచ దేశాల మధ్య విభజన రేఖ గీస్తుంది. అదే ఏళ్ళ తరబడి ఊపిరి పోస్తూ ఆర్థిక వ్యవస్థకు ఒక రూపం తెస్తుంది.జెనివాలో వాణిజ్యం , అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సుకు చెందిన ప్రపంచీకరణ, అభివృద్ధి వ్యూహాల విభాగం డైరెక్టర్‌ ‌రిచర్డ్ ‌కొజుల్‌-‌రిట్‌ ‌మాట్లాడుతూ ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాలు మరీ ముఖ్యంగా పేదరికంలో మగ్గుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలు కొంతకాలం పాటు వెలివేతకు గురికావడం ఖాయం’’ అని అన్నారు. ‘‘టీకాలను ఒక భౌగోళిక సరకుగా చూడాల్సిన అవసరం అవగతమవుతున్నప్పటికీ, అవి ఆర్థికంగా పురోగమించిన దేశాల్లోని అతి పెద్ద ఔషధ కంపెనీల నియంత్రణలో మిగిలిపోయాయి’’ అని తెలిపారు.

అంతర్జాతీయ దాతృత్వ సంస్థలు, దాతలు, ధనిక దేశాలు ఒక వాగ్దానం విషయంలో ఒక్కతాటిగా నిలిచాయి. మహమ్మారిపై పోరాటానికి అవసరమైన ఉపకరణాలు అంటే వైద్య బృందాలకు రక్షక కవచాలు, వ్యాధినిర్ధారణ పరీక్షలు, చికిత్స, టీకాలను అన్ని దేశాలకు అందుబాటులోకి తెస్తామని వాగ్దానం చేశాయి. కానీ సరిపడినంత ఆర్ధికవనరులు లేక ఇచ్చినమాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాయి.మరీ ముఖ్యంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ,బిల్‌ అం‌డ్‌ ‌మిలిందా గేట్స్ ‌ఫౌండేషన్‌లు సంయుక్తంగా చేపట్టిన యాక్ట్-‌యాక్సలరేటర్‌ ‌పార్ట్‌నర్‌ ‌షిప్‌, ‌తదితరులు 38 బిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లు లక్ష్యంగా పెట్టుకోగా, ఆయా సంస్థలు పోగు చేసుకున్నది 5 బిలియన్‌ అమెరికన్‌ ‌డాలర్లకు మించలేదు.

టీకాలను అందుబాటులోకి తెచ్చుకున్న సంపన్న దేశాలు ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి నుంచి పుట్టుకొచ్చిన ఆర్థిక విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం బాట పడుతున్నాయి. భారత్‌ ‌మరియు దక్షిణాఫ్రికా నేతృత్వంలోని ఒక అభివృద్ధి చెందుతున్న దేశాల బృందం మేలు రకపు టీకాలను రూపొందించిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా స్వంతంగా టీకాలను తయారు చేసుకోవాలని అనుకుంటున్నాయి. తద్వారా టీకాల సరఫరాలో పెంపుదలను ఆశిస్తున్నాయి. దీనిపై పట్టు సాధించే ఒక ప్రయత్నం అన్నట్టుగా ఆ బృందం ఒక ప్రతిపాదన చేసింది. సదరు ప్రతిపాదనకు లోబడి ప్రపంచ వాణిజ్య సంస్థ ఇంటలెక్చువల్‌ ‌ప్రాపర్టీలపై సంప్రదాయ రక్షణలను తొలగించాలి. అలాగే తమ స్థోమతకు తగిన టీకాలను తయారుచేసుకునేలా పేద దేశాలను అనుమతించాలని ఆ బృందం ప్రతిపాదించింది.

ప్రపంచ వాణిజ్య సంస్థ ఏకాభిప్రాయం పైన నడుస్తుంది. ఔషధ కంపెనీల రాజకీయ పలుకుబడికి తలొగ్గే అమెరికా, బ్రిటన్‌, ‌యూరప్‌ ‌యూనియన్‌ ‌సదరు ప్రతిపాదనను అడ్డుకున్నాయి. తాము పొందిన పేటెంట్‌ ‌రక్షణలు వాటి ద్వారా పొందే లాభాలు ప్రాణాధార ఔషధాలను కనుగొనడంలో కీలకమైనవిగా ఔషధ పరిశ్రమ వాదిస్తున్నది. అయితే పేటెంట్ల రద్దుతో ప్రభుత్వ నిధులతో చేపట్టిన పరిశోధనల ద్వారా పేరొందిన ఔషధాలు మార్కెట్‌లోకి వస్తాయని పేటేంట్ల రద్దును ప్రతిపాదిస్తున్నవారు అంటున్నారు. ఇది విధాన స్ఫూర్తికి తగ్గట్టుగా సామాజిక సరకును అందరికీ అందుబాటులో తీసుకువచ్చే ఒక అత్యవసరాన్ని సృష్టిస్తుందని వారు వాదిస్తున్నారు.

జెనీవాలో ప్రపంచ వాణిజ్య సంస్థ పరిధిలోని దక్షిణాఫిక్రా మిషన్‌కు కౌన్సిలర్‌గా వ్యవహరిస్తున్న ముస్తఖీమ్‌ ‌డి గామా మాట్లాడుతూ ‘‘అసలు నిర్మొహమాటంగా అడగాలంటే.. ‘‘న్రిజానికిది సొమ్ము చేసుకునే సమయమా?’’ అని నిలదీశారు. ‘‘ప్రభుత్వాల చేతుల్లో ఆర్థిక వ్యవస్థల మూసివేత, పరిమితమైపోతున్న స్వేచ్చా స్వాతంత్రాలను మనం చూస్తున్నాం. అయినప్పటికీ, చూడబోతే ఇంటలెక్చువల్‌ ‌ప్రాపర్టీని ఎవరూ ముట్టకూడదన్నట్టున్నది’’ అని అన్నారు. పూణేలోని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇం‌డియాకు చెందిన ఒక ప్రయోగశాలలో కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటి. భారతదేశం టీకాల స్వీయ ఉత్పాదకత ద్వారా వాటి సరఫరాలో పెంపుదలను ఆకాంక్షిస్తున్నది.టీకాలను అందుబాటులోకి తెచ్చుకున్న సంపన్న దేశాలు ప్రజారోగ్య అత్యయిక పరిస్థితి నుంచి పుట్టుకొచ్చిన ఆర్థిక విపత్తు నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం బాట పడుతున్నాయి. వ్యాపారాల మూసివేతకు దారితీసిన ఆంక్షలను ఎత్తివేయవచ్చు. సాధ్యమైనంత త్వరగా అంటే వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌ ‌నాటికి అర్థవంతమైన ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటాయి. ప్రస్తుతానికి అంతా మసకమసగ్గా కనిపిస్తున్నది. అంతర్జాతీయంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరుగాంచిన అమెరికాలో ప్రతిరోజూ నమోదవుతున్న మరణాల సంఖ్య 9/11 (2001 సెప్టెంబర్‌ ‌తొమ్మిదవ తేదీన న్యూయార్క్ ‌నగరంలోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై దాడి) మరణాలకు సరిసమానంగా ఉంది. సాధారణ స్థితికి చేరుకోవడం కనుచూపుమేరలో కూడా కనిపించడంలేదు. నిలకడగా కొనసాగుతున్న వైరస్‌ ‌వ్యాప్తి కారణంగా బ్రిటన్‌, ‌ఫ్రాన్స్ ‌మరియు జర్మనీ లాంటి ఆర్ధిక దిగ్గజ దేశాలు తాజాగా విధించిన లాక్‌ ‌డౌన్‌తో బిక్కుబిక్కుమంటున్నాయి. అయితే ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ ‌ప్రకారం ఈ ఏడాది 4.2 శాతంతో సరిపెట్టుకున్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వచ్చే సంవత్సరం 5.2 శాతానికి విస్తరించేలా కనిపిస్తున్నది.

సదరు భవిష్యవాణి అమెరికాలో 4.2 శాతం వార్షిక వృద్ధిని అలాగే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తూ, ప్రభుత్వ చర్యలతో వైరస్‌ అదుపులోకి వచ్చిన చైనాలో వృద్ధిలో 7.8 శాతం విస్తరణను పరిగణనలోకి తీసుకొని చెప్పబడినది. ఐహెచ్‌ఎస్‌ ‌మార్కిట్‌ ‌ప్రకారం, మరింతగా ప్రబలిపోతున్న వైరస్‌కు తోడు, గడచిన రెండు సంవత్సరాలుగా సంక్షోభానికి ముందు పరిస్థితికి చేరుకొని ఆర్థిక వ్యవస్థతో ఇబ్బందిపడుతున్న యూరప్‌ ‌వెనుకబాటుతనానికి పరిమితమైపోతుంది. కానీ బ్రెక్జిట్‌ అనంతరం తమ వాణిజ్య బంధాన్ని పరిరక్షించుకుంటున్న తీరుగా బ్రిటన్‌, ‌యూరప్‌ ‌యూనియన్‌ ‌మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అయితే ప్రాంతీయ వాణిజ్యంలో రానున్న ఒక మందగమనంపై భయాందోళనలను అది తేలికపరిచింది. ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్ ‌ప్రకారం 2025 నాటికి మహమ్మారి కారణంగా దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆర్థికంగా సంభవించే హాని తాలూకు తీవ్రత సంపన్న దేశాలతో పోల్చినప్పుడు ఆవిర్భవిస్తున్న సోకాల్డ్ ‌మార్కెట్లలో రెండంతలు ఉండవచ్చు. అలాంటి భవిష్యవాణులకు కచ్చితత్వం అంతంతమాత్రమే. ఎందుకంటే.. ఏడాది క్రితం. ఇలాంటి ఒక విపత్కర మహమ్మారి ప్రపంచం మీద పడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. క్షణక్షణానికి మారిపోతూ ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై విరుచుకుపడుతున్నవి లెక్కలేనన్ని.

ఒక వైపు టీకాల ఉత్పాదకత పుష్కలంగా జరుగుతుండగా అంతే స్థాయిలో ఉన్న సవాళ్ళు వాటి సరఫరాను పరిమితం చేస్తున్నాయి. అంతేకాక టీకాల తాలూకు సఫలత, ప్రభావశీలతలు సంపూర్ణంగా అవగతం కాలేదు. మానసికంగా పుట్టుకొచ్చే ప్రశ్నల నుంచే ఆర్థిక స్వస్థత రూపుదిద్దుకుంటుంది. మానవ స్మృతిలో పెను భయోత్పాతం గూడుకట్టుకున్న తర్వాత, వైరస్‌తో సహజీవన సర్వసాధారణమైపోయిన తర్వాత ముందడుగు వేయడంలో ప్రజలు వారి స్వేచ్ఛా, స్వాతంత్రాలను ఏ మేరకు వినియోగించుకోగలరు? గంపగుత్తగా సినిమా హాళ్ళను సందర్శించడం ద్వారా, విమానాల్లో విహరించడం ద్వారా ప్రజలు లాక్‌డౌన్ల నుంచి విముక్తులవుతారా? ప్రజలు ఆశించినంతగా గుమిగూడని పక్షంలో అది ఉద్యోగాలను విస్తారంగా కల్పించే వినోద మరియు ఆతిథ్య పరిశ్రమల వృద్ధిని కట్టడికి దారితీయవచ్చు. ఇ-కామర్స్‌ను కొత్త పుంతలు తొక్కించడంలో మహమ్మారి ముందు వరుసలో నిలిచింది. అసలే బలహీనంగా ఉన్న సంప్రదాయ రిటైలర్లను మరింత బలహీనపరిచింది. నిత్యం షాపింగ్‌ ‌చేయాలని తాపత్రయపడేవారు మాల్స్‌ను తోసిరాజన్న పక్షంలో అది ఉద్యోగాల కల్పనలో వృద్ధిని పరిమితం చేయవచ్చు. అమెజాన్‌ ‌లాంటి ఆన్‌లైన్‌ ‌రిటైలర్లు ఆటోమేషన్‌ ‌దూకుడు మీదున్నారు. వారి బిజినెస్‌ ‌పెరిగిందంటే దానర్థం నాణ్యమైన ఉద్యోగాలు పెరిగాయని కాదు. అనేకమంది ఆర్థికవేత్తల ప్రకారం టీకా పొందిన ప్రజలు.. భయాందోళనలతో దూరమైన సాధారణ నిజ జీవితానికి అవధుల్లేని అనుభవాల కోసం వెంపర్లాడతారు. రెస్టారెంట్లకు పోటెత్తుతారు. క్రీడలు చూడ్డానికి పరుగులు పెడతారు. సెలవులు గడిపే విహార కేంద్రాలకు విరగపడతారు.

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ ఎకనమిక్స్‌లో ఒక అంతర్జాతీయ ఆర్థికవేత్తగా వ్యవహరిస్తున్న బెన్‌ ‌మే మాట్లాడుతూ ‘‘ప్రజల్లో ఉత్సాహం ఉరకలేసిన పక్షంలో, కొన్ని ఆంక్షలను ఎత్తివేసిన సమయంలో ఖర్చు పెట్టడంలో వారు చేసే హంగూ ఆర్బాటాలను మీరు చూస్తారు’’ అని అన్నారు. ‘‘ఇదంతా కూడా సాధారణమైన ప్రవర్తనకు చేరుకోవడంలో ప్రజలు చూపించే వేగం, వైనం మీద ఆధారపడి ఉంటుంది. అది తెలుసుకోవడం చాలా కష్టం’’ అని అన్నారు.కానీ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలు తాము ఒక విభిన్నమైన గ్రహంపైన నివాసిస్తున్నట్టుగా భావిస్తారు. అమెరికా తన ఖాతాలో 1.5 బిలియన్‌ ‌డోసులకు పైగా టీకాలు ఉన్నాయని నమ్మబలుకుతుండగా, తమ పౌరులందరికీ టీకాలు వేసేలా, మరికొన్నింటిని దాచుకునేలా దాదాపు రెండు బిలియన్‌ ‌డోసులను యూరప్‌ ‌యూనియన్‌ ‌తన అధీనం చేసుకుంది. అనేక పేద దేశాలు తమ జనాభాకు సంపూర్ణంగా టీకాలు వేసేందుకు 2024 దాకా వేచి చూడాల్సి ఉంటుంది. తలకు మించిన రుణ బాధలు.. టీకాలకు చెల్లింపులు జరపడంలో అనేక పేద దేశాల సామర్థ్యానికి అడ్డు తగలవచ్చు. రుణ మాఫీ కోసం జి-20 (గ్రూప్‌ ఆఫ్‌ 20) ‌తలపెట్టిన ఒక క్రతువులో పాలుపంచుకోవడంలో ప్రయివేటు రుణదాతులు తగ్గుముఖం పట్టారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి అందించిన సాయం నిరాశాజనకంగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి వద్ద ట్రంప్‌ ‌పాలనా యంత్రాంగం సోకాల్డ్ ‌ప్రత్యేక పున: స్వీకార హక్కులు (స్పెషల్‌ ‌డ్రాయింగ్‌ ‌రైట్స్) అనగా వ్యవస్థకు చెందిన మౌలిక కరెన్సీ విస్తరణను వ్యతిరేకించింది. తద్వారా పేద దేశాలను అదనపు వనరులకు దూరం చేసింది.

ఐక్యరాజ్యసమితికి లోబడిన వాణిజ్య అంగానికి చెందిన కొజుల్‌-‌రిట్‌ ‌మాట్లాడుతూ ‘‘మహమ్మారి పట్ల అంతర్జాతీయ సమాజం స్పందిస్తున్న తీరు అత్యంత దయనీయంగా ఉంది’’ అని అన్నారు. ‘‘మనం టీకాల పంపిణీ దిశగా ముందుకు సాగుతుండగా, మరోసారి అలాంటి పరిస్థితినే(దయనీయ పరిస్థితి) చూడటానికి మనం ముందుకు వెళుతున్నామా అని మేం ఆందోళన చెందుతున్నాం’’ అని అన్నారు. పేద దేశాల్లోని జన సమూహాలు టీకాలను పొందలేకపోయినప్పటికీ సంపన్న దేశాల్లో పరిస్థితి సాధారణ స్థితి చేరుకున్నప్పుడు అది పేద దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతగానో ఉపకరించవచ్చు. ఉదాహరణకు పర్యాటకుల విషయానికి వస్తే వారు తిరిగి టర్కీ చేరుకుంటారు. యాక్ట్-‌యాక్సెలెరేటర్‌ ‌పార్ట్‌నర్‌ ‌షిప్‌కు చెందిన కోవాక్స్ ‌పేద దేశాలు అందుబాటు ధరలకు టీకాలను కొనుగోలు చేయడానికి ఉద్దేశించింది. కానీ అది వాస్తవికతను ఢీకొడుతున్నది. అదెలాగంటే లాభార్జనే ధ్యేయంగా కలిగిన కంపెనీల చేతుల్లో టీకాల ఉత్పాదకత మరియు నియంత్రణ ఉంది. సదరు కంపెనీలు షేర్‌ ‌హోల్డర్లకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్‌లోని కీలే యూనివర్శిటీలో అంతర్జాతీయ చట్టం మరియు సంక్రమిత వ్యాధుల నిపుణులు మార్క్ ఎక్లెస్టన్‌-‌టర్నర్‌ ‌మాట్లాడుతూ ‘‘ప్రపంచంలో అత్యధిక ప్రజలు టీకాల కోసం కోవాక్స్‌పై ఆధారపడి ఉన్న దేశాల్లోనే జీవిస్తున్నారు’’ అని అన్నారు. ‘‘ఇదొక అనూహ్యమైన మార్కెట్‌ ‌వైఫల్యం. అవసరాన్ని బట్టి టీకాలు అందుబాటులోకి రావు. అది చెల్లింపు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కోవాక్స్ ఈ ‌సమస్యను పరిష్కరించలేదు’’ అని అన్నారు. అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలకు దాదాపు రెండు బిలియన్‌ ‌డోసుల టీకాలు సమకూర్చడమే లక్ష్యంగా కోవాక్స్ ‌నేతలు డిసెంబర్‌ 18‌వ తేదీన ఔషధ కంపెనీలతో ఒక ఒప్పందాన్ని ప్రకటించారు. ఇప్పటికీ ఆమోదానికి నోచుకోని వ్యాక్సిన కేండిడేట్లు కేంద్రంగా కుదుర్చుకున్న సదరు ఒడంబడిక పాల్గొనబోతున్న 190 దేశాల్లో ఐదవ వంతు జనాభాకు సరిపడ టీకా డోసులను వచ్చే సంవత్సరాంతానికి సమకూర్చుతుంది.

లండన్‌లో ఒక పెట్టుబడి పరిశోధన సంస్థ టిఎస్‌ ‌లాంబార్డ్ ‌ప్రకారం భారతదేశం అస్ట్రాజెనెకా సహా బహుళజాతి కంపెనీలకు టీకాలు ఉత్పత్తి చేసే ఔషధ కంపెనీలకు పుట్టినిల్లు. కానీ భారతదేశ జనాభా సంపూర్ణంగా టీకాలు వేయించుకోవడం 2024 కన్నా ముందైతే కాదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ దుర్బలంగానే మిగిలిపోనుంది. పేద దేశాల్లో జనబాహుళ్యానికి టీకాలు అందుబాటులోకి రాకపోయినప్పటికీ, తిరిగి సాధారణ స్థితికి చేరుకునే సంపన్న దేశాల నుంచి కొంత చెదరుమదరు ప్రయోజనాలను పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు పొందే అవకాశం ఉంది. అసమానతతో రూపుదిద్దుకున్న ఒక ప్రపంచంలో, అక్రమంతో వృద్ధి ఏకీభవించగలదు. ఉత్తర అమెరికా, యూరప్‌ , ‌తూర్పు ఆసియాలో వినియోగదారుల్లో కొనుగోలు శక్తి పుంజుకొని అది వస్తువుల గిరాకీకి ఒక చోదకంగా మారుతుంది. చిలీ, జాంబియాలో రాగి గనులను పునరుజ్జీవింపజేస్తుంది. బ్రెజిల్‌, అర్జెంటీనాలో సాగుకు నోచుకునే సోయాబిన్స్ ఎగుమతులను పెంచుతుంది. అదే సమయంలో థాయ్‌ల్యాండ్‌, ఇం‌డోనేసియా, టర్కీ దేశాలకు పర్యాటకులు తిరిగి వస్తారు. ఉత్తర అమెరికా, యూరప్‌ , ‌తూర్పు ఆసియాలో వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగినప్పుడు అది వస్తువుల గిరాకీకి ఒక చోదకంగా మారుతుంది. అంతేకాక చిలీలో కొండెల్కే ఇఐ టెనియెంటె రాగి గని లాంటి గనుల పునరుజ్జీవనానికి దోహదపడుతుంది. కానీ కొందరు ఏమని వాదిస్తున్నారంటే, పేద దేశాల్లో మహమ్మారి కారక విధ్వంసాలు మరీ ముఖ్యంగా టీకాలకు అందకుండా చోటు చేసుకున్న విధ్వంసాలు అంతర్జాతీయంగా సంపదను సృష్టించే ఆర్థిక అవకాశాలను కట్టడి చేస్తాయి. ఆర్‌ఎఎం‌డి కార్పొరేషన్‌ ‌తాజా అధ్యయనం ప్రకారం పేద దేశాల అందుబాటులోకి టీకాలు రాని పక్షంలో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఒక సంవత్సరంలో ఉత్పాదన రూపేణా 153 బిలియన్‌ ‌డాలర్లకు పరిమితమైపోతుంది.

లండన్‌ ‌స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ఆరోగ్య పాలసీ నిపుణులుగా వ్యవహరిస్తున్న క్లేర్‌ ‌వెన్‌హమ్‌ ‌మాట్లాడుతూ ‘‘మీరు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవా కార్యకర్తలకు టీకాలు వేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మీరు అంతర్జాతీయ మార్కెట్లను తిరిగి తెరవగలరు’’ అని అన్నారు. ‘‘ప్రపంచంలోని ప్రతి దేశం కూడా, ‘దుర్బలురైన మా ప్రజలందరూ టీకాలు వేయించుకున్నారు,’ అని చెప్పగలిగిన నాడు అప్పుడు మనం త్వరితగతిన అంతర్జాతీయ పెట్టుబడిదారీ వాణిజ్య వ్యవస్థకు తిరిగి చేరుకొనగలము’’ అని తెలిపారు.

Leave a Reply