Take a fresh look at your lifestyle.

హైకోర్టు ఉత్తర్వులు : కేంద్రం జోక్యం చేసుకోవాలి

న్యూఢిల్లీ : చట్టం ముందు అందరూ సమానులే అన్న సూత్రాన్ని విస్మరించి న్యాయవ్యవస్థ పక్షపాతంతో వ్యవహరిస్తోందని వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. తాను ఏ జడ్జికి ఉద్దేశాలు ఆపాదించడం లేదని అసాధారణ  పరిస్థితుల్లో మాత్రమే నిషేధం విధిస్తారని వివరించారు. న్యాయ స్థానాలు మీడియా నోరు నొక్కు తున్నాయని, పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మాన్ని కాపాడాల్సిన వారి వారే  పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. తాజా వివాదంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారం పార్లమెంట్‌ ‌వద్ద మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని రాజ్యసభలో ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ ‌హైకోర్టు తాజాగా విధించిన ఉత్తర్వులపై న్యాయపరమైన అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply