Take a fresh look at your lifestyle.

హైదరాబాద్‌ అభివృద్దికి కేంద్రం పైసా ఇవ్వలేదు

నగర అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి
మత విద్వేషాలతో లబ్దిపొందాలని చూస్తున్న బీజేపీ
వైబ్రంట్‌ ‌హైదరాబాద్‌ ‌కార్యక్రమంలో మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్‌ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నామని, మరోమారు ఈ ఎన్నికల్లో గెలపించి ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు. అలాగే నగరాన్ని విశ్వనగరంగా మార్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. బేంగంపేటలోని మ్యారిగోల్డ్ ‌హోటల్‌లో జరిగిన ‘వైబ్రంట్‌ ‌హైదరాబాద్‌’ ‌కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేషాలతో లబ్దిపొందాలని చూస్తున్నదని కేటీఆర్‌ ఆరోపించారు. బీజేపీ, ఎంఐఎం కూల్చివేస్తామంటున్నాయి కానీ.. నిర్మిస్తామనడం లేదని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కేంద్రం నుంచి ఒక్కపైసా తీసుకురాలేదని విమర్శించారు. గత ఆరేండ్లలో తెలంగాణ రూ.2.72 లక్షల కోట్లు కేంద్రానికి పన్నులు కట్టిందనీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి తిరిగిచ్చింది రూ.1.4 లక్షల కోట్లేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొరోనా సమయంలో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల ప్యాకేజీలో ఇక్కడెవరికీ పైసా రాలేదని విమర్శించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వల్ల 8 క్వార్టర్లు ఆర్థిక వ్యవస్థ నష్టపోయిందన్నారు. ఆరేండ్ల క్రితం హైదరాబాద్‌లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు.

ఉద్యమపార్టీ అధికారంలోకి వొచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు వ్యక్తంచేశారని తెలిపారు. కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హయాంలో కరెంట్‌ ‌కోతలకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. అయితే టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వొచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్‌ ‌సమస్యను తీర్చామన్నారు. తలసరి విద్యుత్‌ ‌వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారు. అత్యధిక విద్యుత్‌ ‌వినియోగం అభివృద్ధికి సూచిక అని వెల్లడించారు. అలాగే నగరంలో తీవ్రంగా ఉన్న మంచి నీటి సమస్యను పరిష్కరించామన్నారు. భాగ్యనగరంలో తాగునీరు, విద్యుత్‌ ‌సమస్యను పరిష్కరించినట్లు మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply