Take a fresh look at your lifestyle.

సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్న కేంద్రం

“ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ (38‌వ అంశం) పై కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టం తెచ్చి రాష్ట్రాల నియంతృత్వంలో ఉన్న విద్యుత్తును  ఎలక్ట్రిసిటీ కంట్రోల్‌ ఎన్ఫోర్మెంట్‌ అధారిటి (ఇ సి ఇ ఎ) ద్వారా తన నియంత్రనలోకి తీసుకొని ప్రయివేట్‌, ‌కార్పొరేట్‌ ‌సంస్థలకు బాటలు వేయనుంది.దీని వల్ల రాష్ట్యాలకు విద్యుత్‌ ‌కొనుగోలు ఒప్పందాలపై ఉన్న నియంత్రణ రద్దై,రాష్ట్యాలు తమ వివిధ వర్గాల అవసరాలకు అనుగుణంగా  ఇస్తున్న గృహ మరియు ఇతర విద్యుత్‌ ‌సబ్సిడీలు ఉండవు,రైతులమోటర్లకు మీటర్లు బిగించి విద్యుత్‌ ‌బిల్లులను ముక్కుపిండి వసూలు చేయవచ్చు.ఉచిత విద్యుత్‌  ఉం‌డకపోవచ్చు.విద్యుత్‌ ‌చార్జీలు పెరగవచ్చు.”

ఈ మధ్య జరుగుతున్న పరిణా మాలను చూస్తే కేంద్రం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ, రాజ్యా ంగం ప్రసా దించిన అధి కారాలను సైతం తన గుప్పిట్లోకి లాగే సుకొని కేంద్రీకృత పాలన వైపు అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. జీ యెస్‌ ‌స్టీతో మొదలైన ఈ అధికారాల కేంద్రీకరణ,ఉమ్మడి జాబితాలో 38వ అంశంగా ఉన్న విద్యుత్‌ ‌తో పాటు రాష్ట్ర జాబితాలో 14వ అంశంగా ఉన్న వ్యవసాయాన్ని కూడా వదలడం లేదు.2017 -18 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైన జీ యెస్‌ ‌స్టీ కథ 2020-21 ఆర్థిక సంవత్సరంనాటికే తిరగబడుతుంది.దేశ ప్రయోజనాల కోసం రాజీపడిన రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా చట్టాల ద్వారా హామీలు ఇచ్చి, రెండు సంవత్సరాలు జీ యెస్‌ ‌స్టీ క్యాంపెన్షషన్‌ ‌సెస్‌ ‌లో మిగులు వస్తే భారత ప్రభుత్వ ఖాతాలో కలుపుకున్న కేంద్రం, 3వ సంవత్సరం ఆర్థిక మందగమనం,4వ సంవత్సరం కరోనాతో సెస్‌ ‌వసూళ్లు తక్కువ ,రాష్ట్యాలకు ఇచ్చే పరిహారం ఎక్కువ అయ్యేసరికి ‘‘యాక్ట్ ఆఫ్‌ ‌గాడ్‌ ‘‘ ‌పేరుతో చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం?2017-18 ఆర్థిక సంవత్సరంలో జీ యెస్‌ ‌స్టీ క్యాంపెన్షషన్‌ ‌సెస్‌ ‌ద్వారా వచ్చిన ఆదాయంలో 6 వేల కోట్లు,2018-19 ఆర్థిక సంవత్సరం లో 41 వేల కోట్లు మొత్తం 47 వేల కోట్లు పార్లమెంట్‌ ‌చేసిన జీ యెస్‌ ‌స్టీ క్యాంపెన్షషన్‌ ‌చట్టానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ ఖాతాలో కలుపుకున్నట్లు ఇటీవలే కాగ్‌ ‌తన నివేదిలలో వెల్లడించింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమనంతో,2020-2021 ఆర్థిక సంవత్సరంలో కరోనాతో క్యాంపెన్షషన్‌ ‌సెస్‌ ‌వసూళ్లు తగ్గేసరికి కేంద్రం ఇచ్చే పరిహారం ఇవ్వకుండా అప్పులు చేసుకోండి అదికూడా ఎఫ్‌ ఆర్‌ ‌బి ఎం కు లోబడే అంటే పార్లమెంట్‌ ‌చట్టం ద్వారా ఇచ్చిన హామీలకు విలువ ఉన్నట్టా? లేనట్టా? కరోనా కష్ట కాలంలో ఆదుకోవాల్సిన కేంద్రం అప్పులు చేసుకోండి అంటే రాష్ట్యాలు తమ గోడును ఎవరితో చెప్పుకోవాలి? భవిష్యత్తులో రాష్ట్యాలు ఇతర ఇంకె అంశాలపైనైనా చేసే చట్టాల్లో కేంద్రాన్ని నమ్ముతాయా? ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ (38‌వ అంశం) పై కేంద్ర ప్రభుత్వం కొత్తచట్టం తెచ్చి రాష్ట్రాల నియంతృత్వంలో ఉన్న విద్యుత్తును ఎలక్ట్రిసిటీ కంట్రోల్‌ ఎన్ఫోర్మెంట్‌ అధారిటి (ఇ సి ఇ ఎ) ద్వారా తన నియంత్రనలోకి తీసుకొని ప్రయివేట్‌, ‌కార్పొరేట్‌ ‌సంస్థలకు బాటలు వేయనుంది.దీని వల్ల రాష్ట్యాలకు విద్యుత్‌ ‌కొనుగోలు ఒప్పందాలపై ఉన్న నియంత్రణ రద్దై,రాష్ట్యాలు తమ వివిధ వర్గాల అవసరాలకు అనుగుణంగా ఇస్తున్న గృహ మరియు ఇతర విద్యుత్‌ ‌సబ్సిడీలు ఉండవు, రైతులమోటర్లకు మీటర్లు బిగించి విద్యుత్‌ ‌బిల్లులను ముక్కుపిండి వసూలు చేయవచ్చు.

ఉచిత విద్యుత్‌ ఉం‌డకపోవచ్చు.విద్యుత్‌ ‌చార్జీలు పెరగవచ్చు. నేషనల్‌ ‌లో డిస్పాస్‌ ‌సెంటర్‌ ‌ద్వారా క్యాష్‌ ‌మరియు క్యారి పేరుతో క్యాష్‌ ఇస్తేనే కరెంట్‌ ‌లేదంటే కట్‌ అనే విధంగా విద్యుత్తును అంగడి సరుకును చేయనున్నారు.విద్యుత్‌పంపిణీలో ప్రాన్‌ ‌సైజేస్‌ ‌వల్ల విద్యుత్‌ ‌సప్లయ్‌ అనియతరంగంలోకి వెళ్లి నియంత్రణలేక భద్రతాలోపాలవల్ల పెను ప్రమాదాలు జరగవచ్చు.రాష్ట్య జాబితాలో ఉన్న వ్యవసాయం పై చాలా వ్యవసాయ ఆధారిత రాష్ట్యాలు వ్యతిరేకిస్తున్న, రాజ్యసభలో మెజార్టీ లేకపోయినా మూజువాణి ఓటుతో నెగ్గినట్లు ప్రకటించడం ప్రజాస్వామ్యానికి తిలోదకాలు ఇచ్చినట్లు కాదా?వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే సరైన ధర లభించడం గగనం అయితున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ నియంత్రణ లేకుండా వ్యవసాయ ఉత్పత్తి, వ్యాపార,వాణిజ్యానికి అవకాశం ఇస్తూ మధ్యదళారులశని పోయిందని సంబరప డుతు న్నారే గాని గద్ద లను తరిమి రాబందులకు పీఠలు వేస్తున్నారని గ్రహించడం లేదా? సుమారు 86% సన్న,చిన్నా కారు రైతులు ఉన్న దేశంలో ఒకేదేశం-ఒకే మార్కెట్‌ అం‌టే ఎంతమంది రైతులు వందల కిలో మీటర్ల వెళ్లి తమ ఉత్పత్తులను అమ్ముకోగలరు? దీని ద్వారా లాభపడేది బడా కార్పొరేట్లు కాకపోతే ఇంకెవరు? దళారుల వల్ల ఉల్లిపెట్టిన మంటను చూశాం.

అదే ఉల్లి కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్తే ఆ పరిస్థితిని ఊహించగలమా? రవాణా ఖర్చులు రావడం లేదని రోడ్ల పై టమోటాను పారవేసిన సన్న చిన్న కారు రైతులు వందల కిలో మీటర్లు వెళ్లి వారి ఉత్పత్తులు అమ్ముకోగలరా?స్వేచ్ఛ వ్యవసాయమార్కెట్లో సాధారణ రైతులకు రక్షణ ఉంటుందా? బ్రిటిష్‌ ‌వారి కాలంలో వ్యవసా యరంగంలో ఉన్న పరిస్థితి ఈ మూడు చట్టాల వల్ల మళ్లీ పునరావృతం కాదా? కాంట్రాక్‌ ‌వ్యవ సాయానికి లైసెన్సు ఇస్తున్న ఈ చట్టల వల్ల కార్పొరేట్‌ ‌శక్తులు చెప్పిన పంటనే వెయ్యాలి,వారు చెప్పిన రసాయన ఎరువులనే చల్లాలి.వారు చెప్పిన క్రిమిసంహారక మందులే పిచికారి చేయాలి. కాంట్రాక్ట్ ఒప్పందం అయిపోయే నాటికి రైతు భూమి సహజత్వాన్ని కోల్పోయి నిస్సారం అవుతుం ది.సన్న చిన్నకారు రైతుల భూములను,వారి శక్తిని పీల్చిపిప్పిచేసి వదిలేసి ఇతర రైతులతో మరో కాంట్రాక్ట్ ‌కుదుర్చుకుంటారు ఈ కార్పొరేట్‌ ‌శక్తులు. ఈ విధానం ద్వారా సహజ వనరులను,రైతులను దోపిడీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినట్లు కాదా? బీహార్‌ ‌లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల అక్కడి రైతులు అనుభవిస్తున్న కష్టాలు,నష్టాలు చూస్తూ కూడా స్వేచ్ఛ వ్యాపార,వాణిజ్యానికి అవకాశం ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసం? ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల దగ్గర ధాన్యం కొనకపోతే రేషన్‌ ‌షాపుల ద్వారా పేద ప్రజలకు ఆహార ధాన్యాలు ఎలా పంపిణీ చేస్తారు? పార్లమెంట్‌ ‌చేసిన ఆహార భద్రత చట్టాన్ని గాలికి వదిలేసినట్లు కాదా?వ్యయసాయ అంశాలపై కేంద్రం చట్టాలు చేయడం సమాఖ్య స్పూర్తికి విరుద్ధం.ఈ చర్య రాష్ట్యాల హక్కులను హరిస్తుంది.సుదూర స్వప్నంతో రాజ్యాంగ కర్తలు ఏ ఉద్దేశంతో సమైక్య వ్యవస్థను రూపొందించారో, కేంద్ర రాష్ట్యాల మధ్య అధికారాలు పంపిణీ చేశారో,ఆ అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రీకరించుకుంటూ పోతే సమైక్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నట్లు కాదా?.

jurru narayana
జుర్రు నారాయణ యాదవ్‌
‌టి టి యు జిల్లా అధ్యక్షులు
మహబూబ్‌నగర్‌, 9494019270

Leave a Reply