Take a fresh look at your lifestyle.

కొరోనా నివారణలో .. భ్రమల్లో కేంద్ర ప్రభుత్వం ..

  • పెరుగుతున్న కేసులు ఆందోళనకరం ..ప్రజలకు తప్పుడు సమాచారం
  • శాస్త్రీయ దృక్పథం లేని పాలకులు
  • ప్రముఖ మెడికల్ జర్నల్ సంపాదకీయం

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి , న్యూ దిల్లీ : ‘ది లాన్సెట్’ ఒక మెడికల్ జర్నల్. ఇది ప్రపంచంలోనే పురాతన మరియు ప్రసిద్ధ జనరల్ మెడికల్ పత్రిక. ఈ పత్రికను 1823 లో థామస్ వక్లే స్థాపించారు. ఈ పత్రిక కధనాలు కోవిద్ కాలంలో చర్చనీయం అవుతున్నాయి. ఈ పత్రిక కోవిద్19 ప్రారంభంలో తన సంపాదకీయంలో భారతదేశం అమలు చేసిన ప్రారంభ లాక్ డౌన్ ను ప్రశంసించింది. మహమ్మారి వ్యాప్తి జరగకుండా దేశాన్ని ముందుకు నడిపించడానికి ప్రజా ఆరోగ్య రంగంలో భారత్ తన పరిశోధన నైపుణ్యాన్ని పెంచుకోవాలి అని సలహా ఇచ్చింది.. ప్రస్తుతం ది లాన్సెట్ మెడికల్ జర్నల్ భారతదేశంలోని కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర విమర్శలతో నిండిన సంపాదకీయం వచ్చింది. “టూ పాజిటివ్ స్పిన్”.. “భారత్ లో కోవిద్ 19 తిరగబెట్టింది” రికార్డ్ స్థాయిలో కొరోనా కేసులు భరత్ లో పెరిగాయి, అని ‘ది లాన్సెట్’ సంపాదకీయంలో పేర్కొంది. . జర్నల్‌ సంపాదకీయం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) పాత్ర గురించి ఆందోళన వ్యక్తం చేసింది. “శాస్త్రీయ ఆధారాలను పక్కకి తప్పించి అనవసర ఆశావాద అంచనాను ప్రదర్శించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వువ్విళ్ళు ఊరుతున్నది అని సంపాదకీయంలో పేర్కొంది.

భారతదేశంలో ప్రస్తుతం కోవిద్ 19 కేసులు బాగా పెరిగాయి అని, ఇది విషాద చాయలు అలుముకున్న వాస్తవం అని, ముఖ్యమైన ప్రజారోగ్య కార్యక్రమాలకు కూడా ఆటంకం కలిగిస్తున్నది అని ‘ది లాన్సెట్’ రాసింది. ప్రభుత్వం అవాస్తవిక వాదనలను కొనసాగించడం.. ప్రతికూల వార్తలను నిజాయితీగా ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వం విఫలమవడం వలన ప్రజలలో మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులలో అనిశ్చితిని ఏర్పడిందని, ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోకుండా ప్రజలను నిరుత్సాహపరుస్తున్నది అని ప్రజారోగ్య సందేశాలను తీవ్రంగా ప్రభుత్వం తీసుకోవటం లేదని ‘ది లాన్సెట్ సంపాదకీయం పేర్కొంది. కోవిడ్ -19 మహమ్మారి నుంచి కాపాడుకునే శక్తి భారత్ ఔషధ రంగానికి ఉందని, ప్రజారోగ్యం, పరిశోధన, వాక్సిన్ తయారీలో భారతదేశానికి నైపుణ్యం ఉంది అని చెబుతూనే భారత్ తన వనరులను ఉపయోగించుకోవటానికి, ఆ దేశ నాయకులు శాస్త్రీయ దృక్పధం లేదని ‘ది లాన్సెట్’ సంపాదకీయం పేర్కొంది. మోడీ ప్రభుత్వం నిపుణుల వ్యాఖ్యానలను పట్టించుకోదని, భారత్ లో విద్యా స్వేచ్ఛను గౌరవించాలి, ఆశావాదాన్ని విడనాడాలి అని ది లాన్సెట్ సంపాదకీయంలో వుంది.

పాత సంపాదకీయంలో మార్చి 25 న భారత్ విధించిన లాక్‌డౌన్‌ను ప్రశంసించినా.. ఇటీవల సంపాదకీయంలో మోడీ ప్రభుత్వ పనితీరుని ‘ది లాన్సెట్’ విమర్శించింది.. భారతదేశంలో డేటా నాణ్యత గురించి కూడా పలు ప్రశ్నలను ది లాన్సెట్ సంపాదకీయంలో లేవనెత్తింది. కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి విడుదల చేయాలని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ప్రకటన వివాదాస్పదంగా ఉందని సంపాదకీయం తూలనాడింది. ది లాన్సెట్ సంపాదకీయం దేశంలోని అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ఐసిఎంఆర్ పాత్రను ప్రశ్నిచింది. హైడ్రాక్సీక్లోరోక్విన్, మలేరియా మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి మందులు మహమ్మారి నివారణకు పనికి వస్తాయి అని ఐసిఎంఆర్ పట్టుబట్టడంపై ది లాన్సెట్ హాస్యాస్పదం అన్నది. “ప్రతికూల వార్తలను దాచటం, అవాస్తవ భరోసాలు ఇవ్వటం అనే పని ఒత్తిడిలో అనేక వృత్తిపరమైన శాస్త్రీయ భారత్ సంస్థలు ఉన్నాయని ‘ది లాన్సెట్’ రాసింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) శాస్త్రీయ ఆధారాల అనుసారం పనిచేయడంలేదు అంటూ రాజకీయంగా ప్రేరేపించబడిన పనితీరు ఐసిఎంఆర్ ప్రదర్శిస్తున్నది అని, అందుకే తప్పుగా అతి ఆశాజనక పరిస్థితి ని ప్రదర్శించేందుకు ప్రకటనలు గుప్పిస్తున్నది అని ‘ది లాన్సెట్’ విమర్శించింది. తగినంత సాక్ష్యాలు లేనప్పటికీ హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో కొరోనాకి చికిత్సకి ICMR మద్దతు ఇచ్చింది. కొరోనావైరస్ సంక్రమణపై డేటా శాస్త్రీయంగా ICMR రూపొందించలేదని ‘ది లాన్సెట్’ సంపాదకీయం పేర్కొంది.

Leave a Reply