Take a fresh look at your lifestyle.

చక్రవడ్డీ మాఫీకి కేంద్రం గ్రీన్‌ ‌సిగ్నల్‌

మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ
రుణ గ్రహీతలకు ఊరట

వడ్డీకి, చక్రవడ్డీకి ఉన్న తేడాను రుణ విక్రేతలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు) రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం పేర్కొంది. ఆ మొత్తాన్ని కేంద్రం రీయింబర్స్ ‌చేస్తుందని తెలిపింది. మార్చి 1 నుంచి ఆగస్టు 31 వరకు ప్రకటించిన మారటోరియం కాలానికి ఈ స్కీమ్‌ ‌వర్తిస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.

మారటోరియం ఉపయోగించుకోని వారికి కూడా ఈ స్కీమ్‌ ‌వర్తిస్తుంది. అక్టోబర్‌ 14‌న ఈ అంశంపై సుప్రీమ్‌ ‌కోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని, సామాన్యుడి దీపావళి కేంద్రం చేతిలో ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను నవంబర్‌ 2‌కు వాయిదా వేసింది.

Leave a Reply