Take a fresh look at your lifestyle.

ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ‌ముఖర్జీ మృతికి సంతాపంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.సోమవారం నుండి సెప్టెంబర్‌ 6‌వ తేదీ వరకు సంతాప దినాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడు రోజుల పాటు జాతీయ పతాకాలను అవనతం చేయనున్నారు. అంత్యక్రియలు ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనే విషయమై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయాన్ని తర్వాత ప్రకటించనున్నట్టుగా తెలిపారు.

రాష్ట్రపతి భవన్‌ ‌సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అవనతం చేయాలని కేంద్రం ఆదేశించింది.అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది.అనారోగ్యంతో ఈ నెల మొదటివారంలో ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ‌ముఖర్జీ చేరారు. హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ ఆయన సోమవారం సాయంత్రం కన్నుమూసారు.

Leave a Reply