Take a fresh look at your lifestyle.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యాన్ని కొనాల్సిందే

  • కెసిఆర్‌ ‌ధర్నాలు చేయడం డ్రామా అంటూ మండిపడ్డ రేవంత్‌
  • ‌ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో నిలదీస్తామన్న ఉత్తమ్‌
  • ‌టిఆర్‌ఎస్‌కు పోటీగా కాంగ్రెస్‌ ‌భారీ ర్యాలీ
  • హాజరైన పార్టీ నేతలు..టిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపాటు

రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిందేనని కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేసింది. పబ్లిక్‌ ‌గార్డెన్స్ ‌నుంచి వ్యవసాయ కమిషనరేట్‌ ‌వరకు కాంగ్రెస్‌ ‌గురువారం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఓవైపు ధాన్యం కొనుగోళ్ల డిమాండ్‌తో టిఆర్‌ఎస్‌ ఇం‌దిరాపార్క్ ‌వద్ద మహాధార్నా చేపట్టగా ..అదే సమయంలో కాంగ్రెస్‌ ‌ర్యాలీ నిర్వహించింది. వడ్లు కొనుగోలు చేయాల్సిందేనంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ నిరసనకు దిగింది. నాంపల్లి పబ్లిక్‌ ‌గార్డెన్‌ ‌నుంచి వ్యవసాయ కమిషనరేట్‌ ‌వరకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వెంటనే వడ్లను కొనుగోలు చేసి అన్నదాతలకు అండగా నిలవాలని వారు ఈసందర్భంగా డిమాండ్‌ ‌చేశారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ ఒకరి వి•ద ఒకరు తప్పును నెట్టుకుంటూ.. సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. ఈ సందర్భంగా వరి పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు.

ధాన్యం అమ్ముకోవడానికి వారు నానా తంటాలు పడుతున్నారని ఆవేదన చెందారు. మాది కాదు అంటే మాది కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన 13 మద్దతు ధర పంటల్లో వరి కూడా ఉందని తెలిపారు. మద్దతు ధర ప్రకటించడం అంటే ప్రభుత్వం కొనుగోలు చేయడమని అర్థమన్నారు. ఇప్పటి వరకు 11 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు. 4,743 కేంద్రాలను పేరుకు మాత్రమే ఓపెన్‌ ‌చేశారన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 2100 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 116 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. లక్షల క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడుస్తుందన్నారు. కేటీఆర్‌ ‌నియోజక వర్గం సిరిసిల్లలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని…మిల్లర్లు దోపిడీకి తెరలేపారని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సర్కార్‌లు జేఏసీగా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. పండించిన పంటకు గిట్టబాటు ధర కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్‌, ఇం‌దిరాపార్క్ ‌దగ్గర ఏసీలతో ధర్నాలు, దీక్షలు చేస్తారా..? అని ప్రశ్నించారు.

రైతుల పక్షాన పోరాటం చేయాలంటే.. రైతుల కళ్లాల దగ్గరకు వెళ్ళాలన్నారు. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలన్నారు. బీజేపీ నేత బండి సంజయ్‌, ‌కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి మోదీని నిలదీయాలని డిమాండ్‌ ‌చేశారు. 19వ తేదీ నుంచి 23 వరకు ‘కళ్లాల్లోకి కాంగ్రెస్‌’ ఉద్యమం చేస్తుందని ప్రకటించారు. ఈ నెల 23 వరకు కేసీఆర్‌కు సమయం ఇస్తున్నామని, తర్వాత రైతులతో కలిసి ప్రగతిభవన్‌ ‌ముట్టడిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని పార్టీలు జేఏసీగా ఏర్పడినట్లు..ఇప్పుడు టీఆర్‌ఎస్‌, ‌బీజేపీలు జాయింట్‌ ‌యాక్షన్‌ ‌డ్రామా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. డ్రామాలు ఆపి ధాన్యం కొనాలని డిమాండ్‌ ‌చేశారు. ధాన్యం కొనకపోతే కల్లాల నుంచి ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. వడ్లు కొనకపోతే ఆమరణ దీక్ష చేస్తామని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హెచ్చరించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనకపోతే..పార్లమెంట్‌ని స్తంభింపచేస్తాం అని ఆయన అన్నారు. రాష్ట్రంలోని రైతు సమస్యలే కాంగ్రెస్‌ ‌పార్టీకి ప్రధానమని ఆయన తేల్చిచెప్పారు. రైతు సమస్యలపైనే తమ కార్యాచరణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ధాన్యాన్ని కొనాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ చేపట్టిన రైతు నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేస్తున్న దీక్ష దొంగ దీక్ష అని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రైతాంగం నష్ట పోతుందనుకుంటే రాష్ట్రమే వడ్లు కొనాలన్నారు. పరిష్కార మార్గం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. కేంద్రం వడ్లు కొనకుండా నల్ల చట్టాలు అమలు చేస్తున్నపుడు ఏం చేశారని ప్రశ్నించారు. దమ్ముంటే ఢిల్లీలో దీక్షలు చేయాలని సవాల్‌ ‌విసిరారు. ఢిల్లీలో దోస్తీ..గల్లీలో కుస్తీలా ఉంది కేసీఆర్‌ ‌పరిస్థితి అని అన్నారు. ఏడేళ్లుగా బీజేపీతో ఏడు అడుగులు నడిచారని సీతక్క వ్యాఖ్యలు చేశారు. ధాన్యం కుప్పలపై రైతులు పడుకొని అట్లనే చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో.. రైతులు పరేషాన్‌ అవుతున్నారని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను 6 వేల వరకు తెరుస్తామన్న కేసీఆర్‌ ‌ప్రభుత్వం..సగం కూడా ఓపెన్‌ ‌చేయలేదన్నారు. ధర్నా చౌక్‌ ‌దగ్గర కేసీఆర్‌ ‌ధర్నా చేయడం సిగ్గు చేటన్నారు. పాలన చేయరాకుంటే.. ఇంటికి పోవాలన్నారు. వాన కాలం పంట కొనవు.. యాసంగిలో ఏ పంట వేయాలో చెప్పడం లేదని కేసీఆర్‌ను ప్రశ్నించారు. ముందు పంటలు కొను..ధర్నాలు తర్వాత చెయ్‌ అని అన్నారు.

ధాన్యం కుప్పలపై రైతులు పడుకొని అట్లనే చనిపోతున్నారని, అకాల వర్షాలతో రైతులు పరేషాన్‌ అవుతున్నారని ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ అన్నారు. అయినా సరే రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సరైన చర్యలు లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా చౌక్‌ ‌వద్ద సీఎం కేసీఆర్‌ ‌ధర్నా చేయడం సిగ్గు చేటని ఆయన చెప్పారు. ధర్నాలు చేయడం తర్వాత గానీ ముందు రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌కు పాలన చేయడం రాకుంటే సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి పోవాలని సూచించారు. వానాకాలం పంట కొనుగోలు చేయక, యాసంగిలో ఏ పంట వేయాలో చెప్పక రైతులను గోస పెడుతున్నారంటూ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ ‌నాయకులు. కార్యక్రమంలో ఇంకా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లురవి హాజరయ్యారు.

Leave a Reply