Take a fresh look at your lifestyle.

కేంద్రం సొమ్ముతో కెసిఆర్‌ ‌సోకు

  • న్ని పథకాలకు కేంద్రం నుంచే డబ్బు..చర్చకు సిద్దమా
  • సాగర్‌ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్‌ ‌సవాల్

‌కేంద్రం చేసిన అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చర్చకు సిద్ధమా అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సవాల్‌ ‌చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ కేంద్రం నిధులతోనే నడుస్తున్నాయని అన్నారు. చివరకు శ్మశాసన వాటిక నిర్మాణం కూడా అని అన్నారు. సాగర్‌ ఉపఎన్నిక నేపథ్యంలో సోమవారం ఆయన నల్గగొండ జిల్లా, గుర్రంపోడులో రోడ్‌ ‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్‌ ‌కంటే కేంద్రం ఇచ్చే వాటానే ఎక్కువని అన్నారు. కేంద్ర వాటాపై తాను చెప్పేవి అబద్ధాలయితే తనపై కేసులు పెట్టాలన్నారు. ప్రజల కోసం బీజేపీ ఆందోళనలు చేస్తుంటే.. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అక్రమ కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. సాగర్‌లో మద్యం, డబ్బుతో టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీలు గెలవాలని చూస్తున్నాయని బండి సంజయ్‌ ‌విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ‌బ్యాచ్‌ ‌దండుపాళ్యం బ్యాచ్‌ అం‌టూ బీజేపీ బండి సంజయ్‌ ‌హాట్‌ ‌కామెంట్లు చేశారు. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రవి కుమార్‌ ‌నాయక్‌ను గెలిపించాలని కోరుతూ గుర్రంపుడు మండలం కొప్పోలులో రోడ్డుషో లో పాల్గొన్న ఆయన.. కోతల రాయుడు  సీఎం కేసీఆర్‌ ‌సాగర్‌కు వొస్తున్నాడు… కుర్చీ వేసుకుని కూర్చొని ఎస్‌ఎల్‌బీసీ పూర్తిచేస్తా అన్నాడు.. ఇప్పటి వరకు పూర్తి చేయలేదని మండిపడ్డారు. టీఆరెస్‌ ‌దొంగలు వొచ్చారు.. దగుల్‌ ‌బాజిగాళ్లు వొచ్చారు.. మద్యం డబ్బుతో మాయమాటలతో మోసం చేసేందుకు వొచ్చారు.. అని ప్రజలను హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు సాగర్‌లో వోటు వేయాలని ప్రశ్నించిన బండి.. అన్ని కేంద్రం ఇస్తే కేసీఆర్‌ ఏమి పీకుతాడు అంటూ వ్యాఖ్యానించారు. కేంద్రం ఇచ్చిన నిధులు లెక్కలు అన్ని తీసుకొని వొచ్చాను. రేషన్‌ ‌బియ్యానికి 29 రూపాయలు కేంద్రం ఇస్తున్నది..రాష్ట్రం ఒక్క రూపాయి ఇస్తున్నది.. వోటు ఎవరికి వేస్తారో ఆలోచించాలన్నారు. కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటు  కేసీఆర్‌ ‌ఫొటోలు పెట్టుకుంటున్నారని విమర్శించారు. నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్‌ ఏమి చేశాడో చెప్పాలని డిమాండ్‌ ‌చేసిన ఆయన..నల్గొండ జిల్లాకు వివిధ పథకాల కింద 1683 కోట్లు ఇచ్చామన్నారు.. ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది..కానీ, కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్‌ ‌చెబుతున్నారని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ ‌కార్డులు ఇవ్వడం లేదన్న ఆయన.. ప్రభుత్వన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. సాగర్‌ ఉపఎన్నికలో జనరల్‌ ‌స్థానంలో ఎస్టీ అభ్యర్థికి టికెట్‌ ఇచ్చామని.. బీజేపీ పేదల పార్టీ అనీ.. కేసీఆర్‌ ‌పేదోళ్ల పొట్ట కొడుతున్నారు.. పేదవాళ్ల రక్తం తాగుతున్నారని విమర్శించారు బండి సంజయ్‌. ‌కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌వాళ్లు వోటుకు 10 వేలు ఇస్తున్నారు… తీసుకోండి.. వోటు మాత్రం బీజేపీకి వేయండని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. పేదవాళ్లను ఆదుకుంటామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే అభ్యర్థి రవినాయక్‌ ‌తదితరులు ఉన్నారు.

Leave a Reply