Take a fresh look at your lifestyle.

కొరోనా వైరస్‌ ‌టీకా అభివృద్ధిపై కేంద్రం దృష్టి

  • 80% కోలుకుంటుండగా.. 20% మరణాలు…
  • మే నెలలోగా సుమారు పది లక్షల ఆర్‌టీపీసీఆర్‌ ‌కిట్ల తయారు
  • 19 రాష్ట్రాల్లో వైరస్‌ ‌రెట్టింపు సగటును జాతీయ స్థాయి కన్నా తక్కువ
  • 40 శాతం పడిపోయిన వైరస్‌ ‌వృద్ధి రేటు
  • దేశవ్యాప్తంగా 1007 కొత్త కేసులు నమోదు
  • వివరాలు వెల్లడించిన కేంద్ర కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌

నోవెల్‌ ‌కరోనా వైరస్‌కు టీకా అభివృద్ధి చేయడంపైనే తాము దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. కోవిడ్‌19 ‌వ్యాక్సిన్‌ను వీలైనంత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. శుక్రవారం ఆయన డియాతో మాట్లాడుతూ.. బీసీజీ, కన్వల్‌సెంట్‌ ‌ప్లాస్మా థెరపి, మోనోక్లోనల్‌ ‌యాంటీబాడీస్‌తో వైరస్‌ను జయించే వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు. మే నెలలోగా సుమారు పది లక్షల ఆర్‌టీపీసీఆర్‌ ‌కిట్లను తయారు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సుమారు 19 రాష్టాల్ల్రో వైరస్‌ ‌రెట్టింపు సగటును జాతీయ స్థాయి కన్నా తక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి వైరస్‌ ‌వృద్ధి రేటు సగటున 1.2గా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే మార్చి 13 నుంచి 15 వరకు మాత్రం జాతీయ సగటు 2.1గా ఉన్నదన్నారు. మొత్తంద జాతీయ స్థాయిలో వైరస్‌ ‌వృద్ధి రేటు 40 శాతం పడిపోయినట్లు ఆయన తెలిపారు.

మొత్తం కేసుల్లో 80 శాతం కేసులు కోలుకున్నాయని, మరో 20 శాతం కేసుల్లో మరణాలు సంభవించినట్లు అగర్వాల్‌ ‌చెప్పారు. గత 24 గంటల్లో 23 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 1007 కొత్త కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్‌ ‌కేసుల్లో 80 శాతం పేషెంట్లు కోలుకుంటుండండగా, 20 శాతం మరణాలు చేటుచేసుకుంటున్నాయన లవ్‌ అగర్వాల్‌ ‌తెలిపారు. ప్రతి ఆరు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయని, అయితే కరోనా కట్టడిలో భారత్‌ ‌మెరుగ్గానే ఉందని చెప్పారు. ప్రస్తుతం వాక్సిన్‌ ‌డవలప్‌మెంట్‌పైనే ఆరోగ్య శాఖ పూర్తి దృష్టి సారించినట్టు లవ్‌ అగర్వార్‌ ‌తెలిపారు. అలాగే, మే నాటికి 10 లక్షల ఆర్‌టీపీసీఆర్‌ ‌కిట్లు రెడీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కోవిడ్‌ ‌తీవ్రంగా ఉన్న రాష్టాల్ర జిల్లాలకు 5 లక్షల రాపిడ్‌ ‌యాంటీ బాడీ టెస్టి కిట్లు పంపినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ దేశంలో 13,387 కరోనా కేసులు నమోదు కాగా, 1,079తో రికవరీ రేటు 13.05 శాతంగా ఉందన్నారు. కరోనా పేషెంట్ల కోసం దేశవ్యాప్తంగా 1,919 ఆసుపత్రులు ఉండగా, 1,73,000 పైగా ఐసొలేషన్‌ ‌బెడ్లు, ఐసీయూలో 21,000 బెడ్లు అందుబాటులో ఉన్నట్టు వివరించారు.

టిబికి బిసిజి టీకా:
బీసీజీ టీకాను టీబీ రాకుండా ఉండేందుకు ఇస్తారు. అయితే కోవిడ్‌19 ‌సోకిన వారికి ఈ టీకాలతో పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ టీకాతో .. కోవిడ్‌ ‌పేషెంట్లపై పరీక్షలు చేపడుతున్నది. అయితే ఇదే టీకాను పరీక్షించనున్నట్లు ఐసీఎంఆర్‌ ‌డాక్టర్‌ ‌గంగాఖేద్కర్‌ ‌డియాతో తెలిపారు. వచ్చే వారం నుంచి ఈ వ్యాక్సిన్‌పై స్టడీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఆ అధ్యయనం నుంచి ఎటువంటి కచ్చితమైన ఫలితాలు రాకుంటే, దాన్ని కనీసం హెల్త్ ‌వర్కర్లకు కూడా రికమండ్‌ ‌చేయమన్నారు. కరోనా వైరస్‌ ‌భారత్‌లోకి ప్రవేశించి మూడు నెలలు గడిచినట్లు డాక్టర్‌ ‌గంగాఖేద్కర్‌ ‌తెలిపారు కానీ మన దగ్గర ఆ వైరస్‌ ‌పరివర్తన చెందలేదన్నారు. ఒకవేళ వైరస్‌ ‌ముటేషన్‌ ‌జరిగినా.. ఎటువంటి వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి వచ్చినా అది పనిచేస్తుందని ఆయన తెలిపారు. క్షయవ్యాధి ఎక్కువగా ఉన్న దేశాల్లో ప్రస్తుతం నియోనాటల్‌ ‌బీసీజీ వ్యాక్సిన్‌ ‌వాడుతున్నారు. కానీ కోవిడ్‌ ‌పేషెంట్లకు మాత్రం డబ్ల్యూహెచ్‌వో ఆ వ్యాక్సిన్‌ ‌సూచించలేదు. కోవిడ్‌19 ‌సోకితే.. ఊపిరితిత్తులు దెబ్బతింటున్న కారణంగా.. ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌వో ఆ వ్యాక్సిన్‌ను స్టడీ చేస్తున్నది. అయితే చిన్న పిల్లలకు బీసీజి వ్యాక్సిన్‌ ఇచ్చిన దేశాల్లో కోవిడ్‌19 ‌కేసులు తక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఇప్పుడిప్పుడే ఒక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!