Take a fresh look at your lifestyle.

కేంద్రానిది ఒక్క రూపాయి లేదు..ఇదిగో రుజువులు

  • అబద్ధాల్లో బీజేపీకి ఆస్కార్‌ అవార్డు  ఇవ్వాలి
  • పెట్రోల్‌, ‌డిజీల్‌పై మూడు రకాల పన్నులతో ప్రజల నడ్డివిరుస్తున్న బీజేపీ
  • పన్నులపై చర్చకు రాష్ట్ర మంత్రిగా నేను సిద్ధం..కేంద్ర మంత్రిగా మీరు వస్తారా
  • కిషన్‌ ‌రెడ్డికి మంత్రి హరీష్‌ ‌రావు సవాల్‌

కేంద్ర మంత్రి  కిషన్‌ ‌రెడ్డి అబద్ధాల పునాదుల మీద ప్రజలను మభ్య పెట్టి వోట్లు పొందాలని చూస్తున్నారని మంత్రి హరీష్‌ ‌రావు ఆరోపించారు. నడిరోడ్డు మీద, పట్టపగలు నగ్నంగా అబద్దాలు ఆడుతూ ఆత్మవంచన చేసుకుంటూ, ప్రజలను వంచించి నాలుగు వోట్లు పొందాలనుకోవడం దివాళా కోరు రాజకీయమని, అందుకు తాని సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో తాము ఏం చేశామో, ఏం చేస్తున్నామో చెప్పాలి కానీ ఇలా అబద్దాలు అడటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఏడు సంవత్సరాలుగా ప్రజలను టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మోసం చేస్తుందని, కేసీఆర్‌ ‌మోసం చేస్తున్నారనడం ఆత్మవంచన చేసుకోవడమేనని హరీష్‌ ‌రావు అన్నారు. ‘ఏడేళ్ల క్రితం మీరు ఏం చెప్పారు.

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వొస్తే నల్లధనం వెనక్కు తెచ్చి 15 లక్షలు అక్కౌంట్లలో వేస్తాం అన్నారు. ఏ అక్కౌంట్లో వేశారో చెప్పండి’ అని హరీష్‌ ‌రావు ప్రశించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి వొస్తే డీజీల్‌, ‌పెట్రోల్‌ ‌ధరలు తగ్గిస్తామన్నారు, ఏమైనా తగ్గింనయా, పెరిగినయా…రెండింతలు పెంచిన ఘనత మీది..ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.. రెండులక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారా? రాష్ట్రానికో ప్రాజెక్టు కడతామన్నారు…ఎక్కడైనా కట్టారా? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం…మద్ధతుధర ఇస్తామన్నారు..ఇచ్చారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డికి, బిజెపి పార్టీకి ప్రశ్నల వర్షం కురిపించారు.

విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ, రైల్వే కోచ్‌ ‌ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలి తెలంగాణలోపెట్టారా…దీని కోసం మాట్లాడరు..పైగా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని పట్టుకోని మోసం చేసామని చెబుతున్నారు ంటూ మండిపడ్డారు. 200 రూ పెన్షన్‌ 2000 ‌రూపాయలు ఇస్తామన్నాం.. ఇవ్వడం లేదా అన్నారు. కేంద్ర మంత్రి అమిత్‌ ‌షానే ఎన్నికల్లో ప్రజలను నమ్మించడానికి ఏవేవో చెప్పాల్సి వొస్తుందని, ఎలక్షన్‌ ‌కా జుమ్లా హై అన్నారు. యూట్యూబ్‌లో చూస్తే అది కనిపిస్తుంది. మేం ఎన్నికల కోసం చెప్తాం తప్ప చేయమని అన్నారని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ  అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో బూటకపు వాగ్థానాలు చేశామని చెప్పారు. ఇవన్నీ యూ ట్యూబ్‌లో  ఉన్నాయని అన్నారు.

ఎన్నికల్లో చెప్పినవి ఏవీ చేయని పార్టీ బీజేపీ పార్టీఅని..అందుకే బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిస్తున్నారని అన్నారు. బెంగాల్‌లో వేల కోట్లు ఖర్చు పెట్టి , పారామిలటరీ దళాలు దింపి, అధికార దుర్వినియోగం చేసి, కేసులు పెట్టి, ఇబ్బందులు పెట్టినా బెంగాల్‌ ‌ప్రజలు తిప్పికొట్టి మమతా బెనర్జీని గెలిపించారని, కేరళ, తమిళనాడులో, నాగార్జునసాగర్‌లో, వరంగల్‌ ‌కార్పోరేష్‌న్‌ ఎన్నికల్లో ఏమైందని ప్రశ్నించారు. పెరుగుతున్న ధరలకు నిరసనగా ప్రజలు ఏ ఎన్నిక వొచ్చినా బీజేపీని చిత్తుచిత్తుగా ఓడిస్తున్నారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈటల  ఏం చేసారని అన్నారు.

కేంద్రం రైతులను మోసం చేస్తుందని, బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలు తెస్తుందని హరీష్‌ ‌రావు అన్నారు. రాజేందర్‌ ‌తాను చట్టాలకు  వ్యతిరేకంగా పోరాడతానన్నారని, ఆ వీడియోలు కూడా ఉన్నాయని, కానీ ఇవాళ బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ బాగా చేస్తుందని, గొప్ప పార్టీ అంటున్నరని, ఎవరివి అబద్ధాలని, మాట మార్చింది, మాట తప్పింది ఎవరని, ఈటల రాజేందర్‌ ‌కాదా అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజేందర్‌ ‌కొరోనా సమయంలో కేంద్రం మందులు ఇస్తలేదు, వెంటలేటర్ల ఇస్తలేదు, పీపీఎ కిట్లు ఇస్తలేదని, కొ•రోనా విషయంలో  కేంద్రం చెతులేత్తెసిందని, తెలంగాణను చిన్న చూపు చూస్తుందని అన్నరు. ఇప్పుడేమో అదే బీజేపీని అంత గొప్ప పార్టీ లేదంటున్నరని ఎద్దేవా చేశారు. మాట మార్చంది ఎవరు, ధర్మం తప్పింది ఎవరు, నీతి తప్పింది ఎవరని ఈటలను ప్రశించారు.

అబద్దాన్ని కూడా నిజం అన్నంత గట్టిగా బీజేపీ వాళ్లు అందంగా చెబుతారని, ఓ క్యాబినెట్‌ ‌హోదా మంత్రులు కూడా ఈ రకంగా మాట్లాడటం దురదృష్టకరమని, పెట్రోల్‌ ,‌డీజీల్‌ ‌ధరలు పెరగడానికి క్రూడ్‌ ఆయిల్‌ ‌ధరలు పెరగడమే కారణం అని పచ్చిగా అబద్దాలు అడటం దారుణమని హరీష్‌ ‌రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం బేసిక్‌ ఎక్సైజ్‌ ‌డ్యూటీతో పాటు,  రోడ్‌ ‌సెస్‌, ‌సర్‌ ‌ఛార్జి వేస్తుందని, 3రకాల చార్జీలు వేస్తుందని, పెట్రోల్‌ , ‌డీజిల్‌ ‌మీద 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక లీటరు పెట్రోల్‌ ‌పన్ను పది రూపాయల నలభై మూడు పైసలు ఉండగా ఇవాళ రూ. 32.90 వేస్తుందని, ఏడేళ్లలో లీటరు పెట్రోల్‌పై రూ. 22.47 పన్ను పెంచిందని అన్నారు.

బీజీపీ అధికారంలోకి వొచ్చాక లీటరు పెట్రోలుపై పన్ను 10.43 పైసలు అయితే ఇప్పుడు 32.90 రూ, అదే విధంగా డిజీల్‌ ‌పై కేంద్రం 2014 నాడు అధికారంలోకి వొచ్చినప్పుడు  లీటరు డిజీల్‌ ‌పై వేసిన పన్ను   4.52 రూ కాగా  ఇవాళ మూడు రకాల పన్నులు బెసిక్‌ ఎక్సైజ్‌ ‌డ్యూటీ, రోడ్‌ ‌సెస్‌,  ‌సర్‌ ‌ఛార్జ పన్నులు కలిపి 31.80 రు వేస్త్తుందని తాను స్పష్టంగా చుబుతున్నానని ఏడేళ్ల హయాంలో అదనపు పన్నుల భారం 27.28 పైసలు వేశారని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్‌ , ‌డిజీల్‌ ‌మీద 2014-15 ఆర్థిక సంవత్సరంలో 99 వేల 68 కోట్ల ఆదాయం రాగా గత సంవత్సరం 2020-21 లో పెంచిన పన్నుల వల్ల పెట్రోల్‌, ‌డీజీల్‌ ‌మీద వొచ్చిన ఆదాయం 3 లక్షల 72 వేల 970 కోట్లని, ఏడేళ్లలో ప్రజలపై పది లక్షల కోట్ల భారం వేసి ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ ‌ధర పెరిగితే పెట్రోల్‌, ‌డిజీల్‌ ‌ధరలు పెరుగుతుందని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. ఈ భారం వల్ల ఉప్పు, పప్పు, కూరగాయలు, మంచి నూనేల ధర పెరిగిందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కాదా అని హరీష్‌ ‌రావు ప్రశ్నించారు. ప్రజల మీద ప్రేమ ఉంటే ధరలు తగ్గించాలని, ఇంత పచ్చి అబద్దాలు ఆడి తమ స్థాయిని తగ్గించుకోవద్దని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హితవు పలికారు హరీష్‌ ‌రావు.

Leave a Reply