Take a fresh look at your lifestyle.

ఈ ‌సీజన్‌లో చివరి గింజ వరకు కేంద్రం కొంటుంది..!

  • హుజురాబాద్‌’ ‌గోస పార్లమెంట్‌ ‌ను తాకింది
  • ఓటిమితోనే కేసీఆర్‌ ‌రైతులపై కక్ష్య పెంచుకున్నారు.
  • ధాన్యం సేకరణలో ప్రతి పైసా కేంద్ర మే భరిస్తుంది.
  • కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, న్యూ దిల్లీ, నవంబర్‌ 29: ఈ ‌సీజన్‌లో చివరి గింజ వరకు కేంద్రమే కొంటుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ఎంత పండితే, అంత కొంటామన్నారు. టిఆర్‌ఎస్‌ ‌నేతల కోసమో, రాష్ట్ర ప్రభుత్వం కోసమో కాదని, తెలంగాణ రైతుల సంక్షేమం కోసం మొత్తం కొనుగోలు చేస్తామని స్పష్టం చేసారు. అన్ని రకాల బియ్యాన్ని సేకరిస్తామని, ఈ విషయంలో తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. హుజురాబాద్‌ ‌తీర్పు తర్వాత ధాన్యం కొనుగోళ్ల పేరుతో కేంద్రంపై వ్యతిరేకత తెచ్చేలా టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌కుట్ర చేస్తుందని, రైతుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ముందు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి పోకుండా కొనుగోలు చేసే పని రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. కానీ, వచ్చే ఏడాది యాసంగిపై క్లారిటీ అడగడంపై మండిపడ్డారు. ఇన్ని రోజులు చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని కేసీఆర్‌ ‌చెప్పారన్నారు. కానీ, ప్రస్తుత ఆందోళనతో కేంద్రమే ధాన్యం సేకరిసణతో పాటు, సుతిల్‌, ‌హమాలీ, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చె బ్యాంక్‌ ‌రుణాలకు ఇంట్రెస్ట్, ‌కొనుగోలు కేంద్రాల కమిషన్‌ ‌వరకు ప్రతి పైసా కేంద్రమే భరిస్తుందని రైతులకు అర్థమైందన్నారు.

మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో బిజేపి స్టేట్‌ ‌ప్రెసిడెంట్‌, ఎం‌పి బండి సంజయ్‌, ఆదిలాబాద్‌ ఎం‌పి సోయం బాపు రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్‌ ‌లోపల, బయట టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు చేస్తోన్న ఆందోళనపై స్పందించారు. హుజురాబాద్‌ ‌బైపోల్‌ ‌ఫలితాలు వచ్చిన తెల్లారే కల పడ్డట్లు కేసీఆర్‌ ‌ధాన్యం కొనుగోళ్లపై ప్రెస్‌ ‌మీట్‌ ‌పెట్టారని గుర్తు చేశారు. మరి అప్పటి వరకు ధాన్యం విషయం ఏమైందని, ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ ‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుకో లేకపోయిందని, ఇంకా చాలా ప్రొక్యూర్మెంట్‌ ‌జరగాల్సి ఉందన్నారు. రాష్ట్ర రైతులకు అండగా కేంద్రంలో బిజేపి ప్రభుత్వం ఉందన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైస్‌ ‌మిల్స్ ‌కు తీసుకుపోయేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రైతులకు సూచించారు. ఐకేపీ సెంటర్లకు తీసుకెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేయాలన్నారు. చివరి బస్త వరకు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రైతుల పేరుతో టీఆర్‌ఎస్‌ ‌నాయకులు కేంద్రం ఇస్తోన్న ఫుడ్‌ ‌సెక్యూరిటీ బియ్యాన్ని రీ సైకిలింగ్‌ ‌చేసి ఎఫ్‌ ‌సిఐ కి అందించే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో రైతులు అలర్ట్ ‌గా ఉండాలన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సహకారంతో ఇది జరుగుతుందన్నారు.

కొనమని ఎప్పుడూ చెప్పలేదు…
ఈ ఏడాది లో బాయిల్డ్ ‌రైస్‌ ‌గానీ, రా రైస్‌ ‌గానీ కొనమని కేంద్రం ఎక్కడ చెప్పలేదన్నారు. ఉంటే ఉదాహరణ చూపాలన్నారు. హుజురుబాబ్‌ ‌రైతుల తీర్పుకు వరి ధాన్యం సేకరణకు ముడి పెట్టి, ఇంత రబస చేస్తున్నారు అన్నారు. కొడుకును సీఎం చేయాలన్న పుత్ర వాత్సల్యం పేరు తో రైతుల్ని బలి చేయవద్దని హితవు పలికారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దన్నారు. ఈ సీజన్‌ ‌లో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం ప్రకారం బాయిల్డ్ ‌రైస్‌, ‌రా రైస్‌ ‌కొంటామన్నారు. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా, చేసుకున్న అగ్రిమెంట్‌ ‌మర్చిపోతే ఎలా అని నిలదీశారు. బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వమని మీరిచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని, బాయిల్డ్ ‌రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి…
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. తెలంగాణను దేశంలోనే విత్తన భాండాగారం చేస్తానన్న కేసీఆర్‌ అసెంబ్లీ లోపల, బయట చెప్పారన్నారు. కానీ, ప్రస్తుతం వరి వద్దనుకుంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా సమకూర్చలేని దౌర్భగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌నాయకుల ప్రొత్బలంతో రాష్ట్రంలో ఎక్కడ చూసిన నాసిరకం విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయన్నాయని, వీటిని అరికట్టడంలోనూ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కౌలు రైతులకు రైతు బంధు, రుణమాఫీ, కొత్త రుణాలు వంటి ఎలాంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందడం లేదన్నారు. కేసీఆర్‌ ‌కక్ష్య సాధింపుతో లక్షలాది మంది కౌలు రైతులు అప్పులు కట్టలేక, ప్రభుత్వ సహకారం అందక ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి తెలంగాణ లో ఉందన్నారు. ఉమ్మడి ఏపిలో ప్రతి ఏడాది మే లో పంట ప్రణాళిక చేసే సాంప్రదాయం ఉండేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పంటల ప్రణాళిక లేదని, మొత్తం కేసీఆర్‌ ‌ప్రణాళిక మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. అసలు ఏ పంట వేయాలో ప్రభుత్వానికి స్థిరమైన అభిప్రాయం, స్పష్టత లేక రైతుల్ని గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్తున్నారన్నారు. ఒకసారి పత్తి వద్దు మక్క వేయాలని, మరోసారి దొడ్డు బియ్యం వద్దు సన్న బియ్యం వేయాలని ప్రభుత్వం చెబుతుందన్నారు.

హుజుబాబాద్‌ ఓటమి గోస పార్లమెంట్‌ ‌ను తాకింది.
హుజూరాబాద్‌ ఓటమి, సంజయ్‌ ‌పాదయాత్ర తో కేసిఆర్‌ ‌కి నిద్ర పట్టడం లేదని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హుజురాబాద్‌ ‌లో టీఆర్‌ఎస్‌ ఓటమి గోస పార్లమెంట్‌ ‌కు చేరుకుందన్నారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీకి, కేసీఆర్‌ ‌కుటుంబానికి సానుభూతి చూపించడం తప్ప ఏమి చేయలేమన్నారు. ధాన్యం కొనుగోలుకు సబంధించిన ఎలాంటి సమస్యలేదని, కానీ ఈ ఓటమి కారణంగా లేని సమస్యను తెరపైకి తెచ్చారన్నారు. ధాన్యం సేకరణ లో అనేక ఏండ్లుగా కొనసాగిస్తోన్న విధానంలో ఏలాంటి మార్పు లేదని, అదే విధానాన్న కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బాయిల్డ్ ‌రైస్‌ ‌పై రాష్ట్ర ప్రభుత్వంతో నాలుగేండ్లుగా కేంద్ర చర్చలు జరుపుతోందని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి బాయిల్డ్ ‌రైస్‌ ఇవ్వమని రాష్ట్రం అంగీకరించిందన్నారు. కానీ, ఈ విషయంలో రైతుల్ని చైతన్య పరచడంలో, పంట మార్పు, విత్తనాలను సమకూర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పైగా తాము చెబితే రైతులు వినడం లేదని టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ అం‌టుందన్నారు. అసలు ఎక్కడ ఏ రైతు కు చెప్పారో? తెలపాలని కిషన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. బాయిల్డ్ ‌రైస్‌ ‌రాకుండ రైస్‌ ‌మిల్లర్లు తీసుకున్న చర్యలేంటో చెప్పాలన్నారు. ఈ సమస్య ను పూర్తిగా గాలికొదిలేసి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రైతులు తప్పుబట్టేలా టీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌వ్యవహరిస్తుందన్నారు. 2014 లో తెలంగాణ లో ధాన్యం సేకరణకు కోసం రూ. 3, 404 కోట్లు వెచ్చిస్తే, గతేడాది రూ. 26, 641 కోట్లను కేంద్రం ఖర్చు చేసిందన్నారు. దీన్ని బట్టి ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వమో అర్థమవుతుందన్నారు.

టీఆర్‌ఎస్‌ ‌పక్షపాత ప్రభుత్వం…
పంజాబ్‌, ‌తెలంగాణ లో ధాన్యం సేకరణపై కేసీఆర్‌, ‌మంత్రులపై వ్యాఖ్యలపై మండిపడ్డారు. వ్యవసాయ రంగంపై అవగాహన ఉంటే ఇలా మాట్లాడరని అన్నారు. పంజాబ్‌ ‌లో కొంటాం, తెలంగాణ లో కొనమని ఏ ప్రభుత్వమైనా? చెప్పిందా అని నిలదీశారు. పంజాబ్‌ ‌కైనా, తెలంగాణ కైనా, యూపికైనా పాలసీ ఒకటే ఉంటుందన్నారు. కేసీఆర్‌ ‌లాగా గజ్వెల్‌ ‌కు ఒక పాలసీ, పక్కనే ఉన్న దుబ్బాక కు ఒక పాలసీ బిజేపి అవలంభించదన్నారు. టీఆర్‌ఎస్‌ ‌ది పక్షపాతంగా వ్యవహరించే ప్రభుత్వం అన్నారు. రైతుకు పంట నష్టం జరిగేతే గజ్వేల్‌ ‌కు ఒక రేటు, దుబ్బాక, మహబూబ్‌ ‌నగర్‌, ‌కరీంనగర్‌ ‌కు ఒక రేటు ఇస్తారంటూ మండిపడ్డారు. సొంత గ్రామంలో ఒక విధానం, పక్క గ్రామంలో మరో విధానం అవలంభించే మీరు, మాకు నీతులు చెబుతారా? అన్నారు.

Leave a Reply