Take a fresh look at your lifestyle.

గొర్రెకుంట 9 మంది హత్య కేసులో.. హంతకుడు సంజయ్‌కి ఉరిశిక్ష

వరంగల్‌ ‌జిల్లా కోర్టు సంచలన తీర్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్‌ ‌గొర్రెకుంట తొమ్మిది మంది హత్య కేసులో జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందుతుడు సంజయ్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌కు ఉరిశిక్ష విధిస్తూ వరంగల్‌ అదనపు సెషన్స్ ‌కోర్టు న్యాయమూర్తి జయ్‌కుమార్‌ ‌తీర్పు ప్రకటించారు. గత మే 21న తొమ్మిది మందికి ఆహారంలో విషం కలిపి సజీవంగానే సంజయ్‌ ‌బావిలో పడేశాడు.

తెల్లారి వరుసగా 9 మంది మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.  25 రోజుల్లోనే చార్జీషీట్‌ ‌దాఖలు చేశారు. 57మంది మంది వాంగ్మూలం నమోదు చేశారు. ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు తొమ్మిది మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంతకుముందు తెలంగాణలో సంచలనం సృష్టించిన తొమ్మిది మంది హత్య కేసులో నిందితుడిపై నేరం రుజువైంది. అతడు నేరస్థుడని కోర్టు నిర్దారించింది.

Leave a Reply