భీమా-కోరేగావ్ కుట్ర కేసులో ఎన్‌ఐఏ మరో ముగ్గురిని అరెస్టుచేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాగర్‌గోర్కే, రమేశ్ గైచర్, జ్యోతి జగ్‌పతిలను అరెస్టు చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. నిషేధిత మావోయిస్టు అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో 2017 మార్చిలో కబీర్‌కాలా మార్చ్ పేరిట పుణెలోని షానివర్‌వాడ ప్రాంతంలో కొన్ని సభలు నిర్వహించారు.
ఆ సందర్భంగా పలువురు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. వాటి కారణంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయని పేర్కొంటూ నమోదైన కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తున్నది. అరెస్టయిన ఈ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ కింద కేసులు నమోదుచేశారు.