వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కసాయి తండ్రి

January 11, 2020

Crime
ఐదేళ్ల కూతుర్ని గొంతునులిమి చంపిన తండ్రి, ఎల్‌బీ నగర్‌లో దారుణ ఘటన

ప్రజాతంత్ర, హైదరాబాద్‌: ‌హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఐదేళ్ల వయసున్న కన్న కూతుర్ని ఓ కసాయి తండ్రి గొంతునులిమి చంపేశాడు. ఎల్‌బీ నగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలోని బాలాజీ నగర్‌లో శనివారం ఈ దారుణం జరిగింది. బాలాజీ నగర్‌లో దుర్గారావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే దుర్గారావు మద్యానికి బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ చేసేవాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కూడా మద్యం మత్తులో ఇంటికొచ్చాడు. అనంతరం ఇంట్లో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన దుర్గారావు తన ఐదేళ్ల కూతురు యామిని (5)ని గొంతునులిమి పక్కలో పడేశాడు.

చిన్నారి తల్లి వచ్చి గమనించగా విగతజీవిగా పడిఉంది. దీంతో చిన్నారిని ఒడిలో ఉంచుకుని తల్లి రోదిస్తూ చుట్టుపక్కల వారి దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు తన కుమార్తెను ఎందుకు చంపాడన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు మాత్రం మద్యం మత్తులో కూతుర్ని చంపి ఉంటాడని భావిస్తున్నారు. దర్గారావు తరచూ తాగివచ్చి గొడవ చేస్తుంటాడు, పలుసార్లు స్థానికులు మందలించిన వినిపించుకోలేదని భార్య పోలీసులు తెలిపింది.