తన పోలికలతో లేదన్న అనుమానంతో ఈ ఘాతుకం
అనంతపురం,అక్టోబర్ 22 : కల్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల పసికందును చెరువులో పడేశాడు కసాయి తండ్రి. చిన్నారి తన పోలికలతో లేదని ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం భార్యతో భర్త మల్లికార్జున్ ఘర్షణ దిగాడు. గురువారం సాయంత్రం బిడ్డను ఎత్తుకెళ్లి భర్త మల్లికార్జున్ చిన్నారిని హత్య చేశాడు. వివరాల్లోకి వెళ్తే…నర్సాపురం గ్రామానికి చెందిన చిట్టెమ్మకు ఐదుకల్లు గ్రామానికి చెందిన మల్లికార్జున్‌తో సంవత్సరం క్రితం వివాహం జరిగింది.
చిన్నారి తన పోలికలతో లేదంటూ ఆగ్రహాంతో..పసికందును భర్త మల్లికార్జున్ చెరువులో పడేశాడు. భార్యపై అనుమానంతోనే చిన్నారిని కడతేర్చారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.