Take a fresh look at your lifestyle.

ప్రజలపై మోయలేని పన్నుల భారం

ఎపిలో కొనసాగుతున్న ఆందోళనలు
18,19,20 తేదీల్లో దీక్షలు, 24 న సంతకాలు సేకరణ
విజయనగరం,జూలై 17 : చెత్త, ఆస్థి విలువ ఆధారంగా ప్రజలపై వేస్తున్న పన్నులు భారాలను రద్దు చేయాలని కోరుతూ ఈనెల 18,19,20 తేదీల్లో దీక్షలు, 24 న సంతకాలు సేకరణ కార్యక్రమాలు చేపడుతున్నామని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు తెలిపారు. శనివారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ఆచరిస్తూ ప్రజలపై పన్నులు భారాలను మోపుతున్నా రన్నారు. చెత్తకు పన్ను వేయడం దేశంలో ఎక్కడా లేదని మన రాష్ట్రంలో విధిస్తున్నారన్నారు. ఎన్నికలు ముందు సంక్షేమ పాలన అందిస్తామని చెప్పిన జగన్మోహన్‌ ‌రెడ్డి నగర ప్రజలపై పన్నులు భారాలు మోపడం అన్యాయమన్నారు.

మరో వైపు విజయనగరంలో చెత్త పన్నుకు సంబంధించి కౌన్సిల్‌ ఆమోదం తెలపలేదని అయిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 తేదీ నుంచి నెలకు ప్రతి ఇంటికి 60 రూపాయిలు వసూలు చేసేందుకు సిద్ధమైందన్నారు. కౌన్సిల్‌ ఆమోదం లేకుండా రాజ్యాంగంలోని 73,74 రాజ్యాంగం కల్పించిన స్థానిక సంస్థలు హక్కులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కాలువ పన్ను, మారుగుదొడ్లుకు పన్నులు వేయడం సరికాదన్నారు. ఇప్పటికే పెట్రోల్‌, ‌డీజిల్‌, ఆయిల్‌, ‌నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలు నడ్డివిరిచారు.

ఇది కాదు అన్నట్లు పన్నులు భారాలు వేయడం అన్యాయమన్నారు. వెంటనే పన్నులు భారాలు తగ్గించకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పన్నులు భారాలకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో నగరంలో ఉన్న ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో సంఘం నాయకులు పి.రమణమ్మ, బి.రమణ, డి.సన్నిబాబులు పాల్గొన్నారు.

Leave a Reply