Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో ఘడీల పాలనను బిజెపి అంతం చేస్తుంది

  • 2023లో తెలంగాణలో అధికారమే లక్ష్యం
  • పార్టీ అవిర్భావ వేడుకల్లో బండి సంజయ్‌
  • ‌నిరుద్యోగులను కెసిఆర్‌ ‌విస్మరించారు: కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

అధికారం కోసం బీజేపీ ఎప్పుడు పని చేయలేదని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. పేద ప్రజల కోసం, దేశం కోసం బీజేపీ అధికారంలోకి రావాలని అనుకుందన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బండి సంజయ్‌ ‌జండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..అనేక మంది కార్యకర్తల త్యాగాల ఫలితమే బీజేపీ ఈ రోజు ఈ స్థాయికి చేరడానికి కారణమని… 2 స్థానాల నుండి 303 స్థానాల వరకు ఎదిగిందని పేర్కొన్నారు. అటల్‌ ‌బిహారి వాజ్‌ ‌పేయ్‌ ఒక్క వోటుతో అధికారాన్ని వదులుకున్నారని గుర్తు చేశారు. అనేక సంక్షేమ పథకాలను..కేంద్రం ప్రవేశ పెడుతుందని పేర్కొన్నారు.

బీజేపీ లేని పార్టీని దేశ ప్రజలు ఉహించుకోవడం కష్టమని.. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ను ఎదుర్కునే పార్టీ బీజేపీయేనని స్పష్టం చేశారు. గడీల పాలనను అంతం చేసే పార్టీ బీజేపీ అని..2023లో బీజేపీని తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని బండి సంజయ్‌ ‌పిలుపుచ్చారు. ఛత్తీస్‌ ‌ఘడ్‌ ‌లో బీజేపీ పార్టీ అధికారంలోకి వొస్తే ఉగ్రవాదం, తీవ్ర వాదాన్ని అణిచివేస్తుందని..అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే ఏం జరిగిందో చూసామన్నారు. కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా కెసిఆర్‌ ‌పాలన సాగుతుందన్నారు.

ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగాలు రావన్న దుర్దశలో రాష్ట్ర ఉందన్నారు. నిరుద్యోగ యువత నిరాశా నిస్పృహల్లో ఆత్మహత్యలకు పాల్పడుతుందన్నారు. కలసికట్టుగా నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దారుణ కాండను తీవ్రంగా ఖండించారు. ఉద్యోగాల కోసం పోలీసులుగా మారిన వారిని పొట్టన పెట్టుకోవడం దారుణమన్నారు. దీంతో ఎందరో అమయాకుల కుటుంబాలు అనాథలుగా మారాయన్నారు. వివేక్‌, ‌చితంల రామచంద్రారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply