Take a fresh look at your lifestyle.

ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బిజెపి

  • నమ్ముకుంటే నట్టేట మునుగుతారు
  • బొట్టుబిళ్లలకు ఆశపడితే అసలుకే ఎసరు
  • దళితబందుపై దుష్ప్రచారాలు నమ్మొద్దు
  • హుజూరాబాద్‌ ‌ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు

దేశంలో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే పార్టీ బీజేపీ అని రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు అన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు పెరిగిన గ్యాస్‌ ‌ధర గుర్తు చేసుకోవాలని ప్రజలకు హరీష్‌రావు విజ్ఞప్తి చేసారు. లక్షా30వేల ఉద్యోగాలను సీఎం కేసీఆర్‌ ఇచ్చారని హరీష్‌రావు తెలిపారు. గడియారాలు, బొట్టుబిల్లలు ఇచ్చారని బీజేపీకి ఓటు వేస్తే ఆగమవుతారని ఓటర్లను హరీష్‌రావు హెచ్చరించారు.  ’దళితులెవరూ ఆందోళన చెందొద్దు.. తప్పుడు మాటలు నమ్మొద్దు.. అర్హులందరికీ దళితబంధు అందుతుందని  హరీశ్‌రావు ప్రకటించారు. ప్రభుత్వం నగదు వెనక్కి తీసుకుం టుందని కొన్ని వి•డియా చానళ్లు చేస్తున్న దుష్పచ్రారాన్ని మంత్రి కొట్టిపారేశారు. రేషన్‌కార్డు ఉండి 65 ఏండ్లలోపు వారందరికీ రూ.10 లక్షలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.

పైలట్‌ ‌ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్‌లో మిగిలిన వారి ఖాతాల్లో మరో మూడు రోజుల్లో నగదు జమ చేస్తామని హావి• ఇచ్చారు. ఈ దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. దళితబంధు పథకం కింద వచ్చే రూ.10లక్షలతో నాలుగు వేర్వేరు యూనిట్లు స్థాపించుకోవచ్చని సూచించారు. దళితుల ఖాతాల్లో పడిన డబ్బులు ప్రభుత్వం వెనక్కి తీసుకోదని,ఈ డబ్బును స్వయం ఉపాధి కోసం వినియోగించు కోవాలని సూచించారు. యూని ట్లు ఏర్పాటు చేసుకునే వరకు ఖాతాలో ఉండే నగదుకు వడ్డీ చెల్లిస్తామ న్నారు. హుజూరాబాద్‌ ‌నియోజకవర్గ పరిధిలోని బ్యాంకుల్లో హెల్ప్ ‌డెస్క్‌లు ప్రారంభించి లబ్దిదారులకు తగిన సలహాలు, సూచనలు అందించాలని బ్యాంకర్లను కోరారు.

డబ్బులు జమైన లబ్దిదారులకు రెండు రోజుల్లో మెస్సేజ్‌లు పంపించాలని ఆదేశించారు. నెల 23న హుజూరాబాద్‌ ‌నియోజకవర్గంలోని అన్ని మండలాల లబ్దిదారులతో విడతల వారీగా టెలికాన్ఫరెన్స్ ‌నిర్వహిస్తామని, ఇందులో తనతోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ‌కరీంనగర్‌, ‌హనుమకొండ కలెక్టర్లు, క్లస్టర్‌ అధికారులు పాల్గొంటారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పథకం అమలులో లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులున్నా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Leave a Reply