Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ఆస్తులు సృష్టిస్తే బిజెపి అమ్ముకుంటోంది

  • బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌రెండూ తోడు దొంగలు
  • మండిపడ్డ కాంగ్రెస్‌ ‌చేతలు భట్టి, విహెచ్‌
‌బీజేపీ, టీఆర్‌ఎస్‌ ‌రెండు తోడు దొంగలేనని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఆస్తులు సృష్టిస్తే.. బీజేపీ ప్రభుత్వం వాటిని అమ్మేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలు రాకపోగా.. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని మండిపడ్డారు. తెలంగాణ తెచ్చుకున్నదే కొలువుల కోసం.. లక్ష 92 వేల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం భర్తీ చేయడం లేదన్నారు. నిరుద్యోగ భృతి విధి విధానాలు కూడా రూపొందించలేదని చెప్పారు. రెండు ప్రభుత్వాల నిర్వాకం వల్ల దేశం, రాష్ట్రంలో యువత నైరాశ్యంలోకి వెళుతోందని ధ్వజమెత్తారు. ఇదే సరైన సమయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌కు యువత బుద్ధి చెప్పాలని భట్టివిక్రమార్క పేర్కొన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ ‌పరం చేస్తున్నారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత వీహెచ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఆయన వి•డియాతో మాట్లాడుతూ..  ప్రభుత్వరంగ సంస్థలను, యూనివర్సిటీలను ప్రైవేట్‌పరం చేస్తే రిజర్వేషన్లు ఎలా? ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని వీహెచ్‌ ‌ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ దేశాన్ని కార్పొరేట్‌ ‌శక్తులకు అమ్ముకుంటున్నారని వీహెచ్‌ ‌ధ్వజమెత్తారు. ఇదిలావుంటే రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రాలను కచ్చితంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాలలో డిమాండ్‌ ‌చేశారు. కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం రోజుకో విధమైన ప్రకటన చేస్తూ రైతులను ఆందోళనకు గురిస్తోందన్నారు. సెంటర్లను నిర్వహించడమే కాకుండా రైతులకు స్పష్టమైన హావి• ఇవ్వాలన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. పైకి కేంద్రంపై విమర్శలు చేస్తూ రాష్ట్రంలో కొత్త వ్యవసాయ చట్టాల అమలుకు అడుగులు వేస్తుండడాన్ని అందరూ గమనిస్తున్నారని చెప్పారు.

Leave a Reply