Take a fresh look at your lifestyle.

బిజెపి అధికారంలో ఉండడాన్ని జీర్ణించుకోవడం లేదు

కోమా నుంచి బయటకు రాలేకపోతున్న కాంగ్రెస్‌
‌వారి వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తూనే ఉండాలి
బిజెపి పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోడీ
కాంగ్రెస్‌ ‌పార్టీపై మరోమారు తీవ్రస్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ ఫైర్‌ అయ్యారు. బీజేపీ అధికారంలో ఉండటాన్ని కాంగ్రెస్‌ ‌జీర్ణించుకోలేకపోతుందని మోదీ అన్నారు. అసోం, బెంగాల్‌, ‌కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కాంగ్రెస్‌ ఇం‌కా కోమా నుంచి బయటకు రాలేదని విమర్శించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ‌పార్టీ కనీసం విపక్ష పాత్రను సైతం సరిగ్గా నిర్వహించలేకపోతుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఉన్న నిజమైన సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సి ఉన్నా.. విపక్షంగా కాంగ్రెస్‌ ఆ ‌పనిచేయడం లేదన్నారు. అధికారానికి తామే అర్హులమని ఇప్పటికీ కాంగ్రెస్‌ ‌పార్టీ భావిస్తుందన్నారు. ప్రజల తీర్పుని కాంగ్రెస్‌ ‌పట్టించుకోదన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ క్షీణిస్తున్నా కానీ ఇప్పటికీ బీజేపీ గురించే కాంగ్రెస్‌ ‌పార్టీ ఎక్కువ ఆందోళన చెందుతుందన్నారు. దేశంలో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుందని, వాస్తవంలో కోవిడ్‌ ‌టీకాల కొరతే లేదని మోదీ అన్నారు. కొరోనా మహమ్మారి రాజకీయ సమస్య కాదని, మానవతా సమస్య అని ప్రధాని పేర్కొన్నారు. కొరోనా సమయంలో దేశంలో ఎవరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనుల గురించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచి..కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచారం చేసే అసత్యాలను తిప్పికొట్టాలని బీజేపీ ఎంపీలకు మోదీ దిశార్దేశం చేశారు. సమాచార లోపం వల్ల విపక్షాల అసత్యాలు ప్రచారం కాకుండా చూసుకోవాలని తెలిపారు.
కోవిడ్‌పై పోరాటంలో విపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ నెల 24,25 తేదీల్లో ఉచిత రేషన్‌ ‌పంపిణీ జరగనున్న సమయంలో రేషన్‌ ‌దుకాణాల వద్దకు వెళ్లాలని బీజేపీ నేతలకు మోదీ సూచించారు. కొరోనా వ్యాప్తి మూడో దశ విషయంలో ఎంపీలంతా అప్రమత్తంగా ఉండాలని మోదీ సూచించారు. క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అవాంతరాలు లేకుండా తమతమ నియోజకవర్గాల్లో వ్యాక్సినేషన్‌ ‌కొనసాగేలా చూసుకోవాలని చెప్పారు. మరోవైపు, పార్లమెంట్‌ ఉభయ సభల్లో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు పెగాసస్‌ ‌స్నూపింగ్‌ ఆరోపణలతో పార్లమెంటులో రసాభాస సృష్టించడంపై మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన బీజేపీ ఎంపీలకు కొన్ని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు సంబంధించిన నిజాలను చెప్పడం ద్వారా ఆ అబద్ధాలను తిప్పికొట్టాలని మోదీ ఆదేశించినట్లు తెలుస్తుంది. పార్లమెంటులో మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ, ప్రజలకు చేరువ కావడంలో, సత్యాన్ని చెప్పడంలో ఏర్పడిన అంతరంలోకి ప్రతిపక్షాల అబద్ధాలు చొరబడకుండా చూడాలని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్తున్న అబద్దాలను తిప్పికొట్టేందుకు అసలు నిజాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ‌చేస్తున్న దుష్పచ్రారాన్ని ఓడించాలని కోరారు.

Leave a Reply