Take a fresh look at your lifestyle.

బీజేపీ ప్రభుత్వం.. దుర్మార్గంగా వ్యవహరిస్తోంది

దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా కూటమి
డిసెంబర్‌ ‌రెండో వారంలో ప్రాంతీయ పార్టీల నేతలతో సమావేశం
గ్రేటర్‌ ఎన్నికలు లక్ష్యంగా యుద్ధం
దుబ్బాక ఫలితాన్ని మైండ్‌లోంచి తీసేయండి
గ్రేటర్‌లో సర్వేలన్నీ మనకే అనుకూలం
టీఆర్‌ఎస్‌ ఎం‌పీలు, ఎమ్మెల్యేల సమావేశంలో కెసిఆర్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయిలో ఉద్యమించనున్నట్లు  సీఎం కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. డిసెంబర్‌ ‌రెండో వారంలో దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలతో కలసి జాతీయ స్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరిపాలన విషయంలో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు దేశవ్యాప్తంగా బిజెపి పతనానికి నాంది పలికేలా త్వరలో• •••దరాబాద్‌ ‌నుంచే  కార్యాచరణకు దిగనున్నట్లు ప్రకటించారు.  జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ‌పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీఆర్‌ఎస్‌ ‌భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సె•ఎం మాట్లాడుతూ. డిసెంబర్‌ ‌రెండో మాసంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్‌లోనే సమావేశం నిర్వహిస్తామనీ, బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరినీ ఈ సమావేశానికి ఆహ్వనిస్తామన్నారు. మమతా బెనర్జీ, కుమార స్వామి, అఖిలేష్‌ ‌యాదవ్‌, ‌స్టాలిన్‌తో పాటు మరికొన్ని పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు. తాను ఫైటర్‌ని అని, దేనికి భయపడబోనని, బీజేపీపై యుద్ధమే చేస్తానన్నారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 110 ‌సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సర్వేలన్నీ తమకు అనుకూలంగా ఉన్నాయని, అభ్యర్థులు, కార్యకర్తలు గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. బీజేపీ విమర్శలను గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు. దుబ్బాక ఫలితాన్ని మరచిపోవాలని అన్నారు.

బుధవారమే జీహెచ్‌ఎం‌సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ఎవరూ కంగారు పడొద్దని, అభ్యర్థుల్లో మార్పులు, చేర్పులు ఉంటాయన్నారు. అందరికి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్‌ ‌హా ఇచ్చారు. కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు సూచించారు. వరద సాయానికి బ్రేక్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. బీజేపీనే వరద సాయాన్ని నిలిపేలా చేసిందని ఆరోపించారు. అమ్మ పెట్టదు..అడుక్కోనివ్వదు అన్నట్లు బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయింతో జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ మధ్య విమర్శల పర్వం మరింత పదునెక్కనుంది. దేశంలో బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో  ఎవరికి ఏ డివిజన్‌లో బాధ్యతలు అప్పగిస్తే..ఆ డివిజన్‌లో ఆయా బాధ్యులు గట్టిగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వంపై, పార్టీపై బీజేపీ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టాలని బాధ్యులకు కేసీఆర్‌ ‌సూచించారు. ఈ సందర్భంలో కాంగ్రెస్‌ను అసలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఎల్‌ఐసీ, రైల్వే లాంటి సంస్థల్లో పనిచేస్తోన్న ఉద్యోగులను కలుపుకొని వెళ్లాలని నేతలకు మార్గనిర్దేశనం చేశారు. సమావేశంలో పార్టీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. 16 పేజీలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేసింది.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివే…రూ.1900 కోట్లతో మరో 280 కీ.. మేర మిషన్‌ ‌భగీరథ పైప్‌లైన్‌ ‌వేయాలని నిర్ణయించారు. కొత్తగా 4 ఆడిటోరియాల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిలో అన్ని గ్రంథాలయాల ఆధునీకరణ చేస్తమాన్నారు. హైదరాబాద్‌లో ఆధునిక స్టేడియాలు, క్రీడా వసతుల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. రూ.130 కోట్లతో 200 ఆదర్శ సకృత మార్కెట్ల ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో నగరమంతా ఉచిత వైఫై సదుపాయం అందుబాటులోకి తెస్తామన్నారు. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ..హుస్సెన్‌సాగర్‌ ‌శుద్ధికి ప్రణాళిక చేపడతామని అన్నారు.

Leave a Reply