Take a fresh look at your lifestyle.

బిజెపి విమర్శలతో ఒరిగేదే లేదు

విజయవాడ/హైదరాబాద్‌: బిజెపి  నేతలు ఉభయ తెలుగు రాష్టరాల్లో  చురుకైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రయత్నించడంలో భాగంగా కొంచెం గట్టిగినే వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఈ పరా•-టీకి రెండు రాస్ట్రాల్లోనూ ప్రజలు గట్టివాతలనే పెట్టారు. ఈ క్రమంలో కేంద్రంతో కొట్లాడి రాష్ట్రాలకు మేలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. కేవలం విమర్శలకు పరిమితం కావడం ప్రజలు కూడా జీరిణించుకోవడం లేదని గుర్తించడం లేదు. దీనికితోడు ఇక్కడి నేతలు కేంద్రంలో గట్టగా మాట్లాడే సత్తా ఉన్నవారు కాదు. ఇటీవలి ఉప ఎన్నిక ఫలితంతో పాటు, మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో  తెలంగాణలో బిజెపికి పెద్ద భవిష్యత్తు లేదన్న ప్రగాఢ విశ్వాసంలో  ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉన్నారు. ఆ పార్టీతో లేదా కాంగ్రెస్‌తో తనకు ఎలాంటి భయం లేదన్న ధీమాలో ఉన్నారు. అందుకే వారు లేవనెత్తే అంశాలను కొట్టి పారేస్తున్నారు. అంశం ఏదైనా వారికి విమర్శించడానికి సబ్జెక్ట్ ‌లేదన్న ధోరణిలో టిఆర్‌ఎస్‌ ‌నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. పంటల కొనుగోళ్లు, పోతిరెడ్డిపాడు, నియంత్రిత పంటల విధానంలో కాంగ్రెస్‌ ,‌బిజెలను టిఆర్‌ఎస్‌ ‌నేతలు చులకన చేసి మాట్లాడుతున్నారు. ఇకపోతే  కరోనా పరిస్థితి మొదలైనప్పటినుంచి కెసిఆర్‌ ‌తగిన ఆర్థిక సహాయం కోసం కేంద్రాన్ని అభ్యర్థిస్తూ వచ్చారు.

గతేడాది రుణసేకరణ పరిమితిని పెంచేందుకు షరతులు పెట్టడంపై కెసిఆర్‌కు మంటపుట్టింది. అందుకే దిక్కుమాలిన ప్యాకేజీ అంటూ విమర్శలకు దిగారు. ఎపిలో జగన్‌ ‌మాత్రం అలాంటిదే చేయలేదు. మరోమారు కేంద్రాన్ని సూటిగా విమర్శించడానికి ఆయన సాహసించే పరిస్థితిలో లేరు.  మొత్తంగా కేంద్రంతో సఖ్యతతో ఉన్నా లాభం లేదన్న విషయం కెసిఆర్‌కు,జగన్‌లకు ఎప్పుడో అవగతమయ్యిందని గుర్తించాలి.  దేశంలో అమలవుతున్న జాతీయ టీకా విధానం రాష్ట్రాల్లో సరిగా అమలు  కావడం లేదు. కరోనా టీకాల విషయంలో ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితి కల్పించారు. టీకాలకు వివిధ రేట్లు నిర్ణయించడం ,ఓట్ల వేటలోభాగంగా సంక్షేమం పేరు చెప్పి వేలాదికోట్ల రూపాయలు తగలేస్తున్న ప్రభుత్వాలకు ప్రజల ప్రాణాలు కాపాడటంకంటే మించిన సంక్షేమం ఉండదని తెలియడం లేదు.

టీకాల సరఫరా, విక్రయంపై కేంద్ర ప్రభుత్వాల పెత్తనం కారణంగా రాష్ట్రాలకు అధికారం లేకుండాపోయింది. దీంతో రాష్ట్రాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇక్కడి ఈ సమస్యలను బిజెపి  నేతలు కేంద్రానికి వివరించే ధైర్యం చేయడం లేదు. విదేశీ టీకాలను సకాలంలో అనుమతించడం లేదు.  స్వదేశీ తయారీదారులకు ఉత్పత్తి పెంచడానికి ఆర్థిక సహాయం కూడా చేయడం లేదు. ప్దదెనిమిదేళ్లు నిండిన వారికి కూడా మే 1వ తేదీ నుంచి టీకాలు ఇస్తామని ప్రకటించిన కేందప్రభుత్వం ఇప్పుడు ముఖం చాటేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కొరతతో తమ బాధ్యత నుంచి తప్పుకొంటున్నాయి. ప్రైవేటు ఆస్పత్రులు సొంతంగా టీకాలు కొనుగోలు చేసుకోవచ్చని ప్రకటించిన కేందప్రభుత్వం అక్కడ కూడా మెలికపెట్టింది.

ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి టీకా వేయించుకోవాలనుకున్న వారు కూడా కోవిన్‌లో తమ పేరు రిజిస్టర్‌ ‌చేయించుకోవాలన్న నిబంధన పెట్టారు. కరోనా బారిన పడుతున్నవారు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం లేక ప్రైవేటు ఆస్పత్రులలో చేరి లక్షలకొద్దీ బిల్లులు చెల్లిస్తున్నారు. ఒక్కొక్కరు కనీసం రెండు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ చెల్లించాల్సిన పరిస్థితి. అయినా ప్రాణాలతో బతికి బయటపడతారన్న గ్యారంటీ లేదు. ఈ పరిస్తితుల్లో బిజెపి నేతలు విమర్శలకు పరిమితం అయ్యారు. ఇది కూడా ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకతను పెంచుతోంది.

Leave a Reply