Take a fresh look at your lifestyle.

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బిజెపి

  • ధాన్యం కొనుగోళ్లపైనా చర్య తీసుకోవాలని వినతి
  • కెసిఆర్‌ ‌తీరుపై మండిపాటు
  • ఉప ఎన్నికలో గెలుపుపై ఈటలను అభినందించిన గవర్నర్‌ ‌తమిళసై

బీజేపీ బృందం మంగళవారం రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసుల వ్యవహారశైలిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్న విషయాన్ని గవర్నర్‌ ‌దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. గవర్నర్‌ను కలిసిన నేతల బృందంలో ఈటల, రఘనందనరావు, రాజసింగ్‌, ‌డీకే అరుణ, లక్ష్మణ్‌, ‌గరికపాటి, విజయరామారావు, పొంగులేటి ఉన్నారు. అనంతరం బీజేపీ నేత డీకే అరుణ వి•డియాతో మాట్లాడుతూ..వరి దాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు నల్గొండ జిల్లాలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై టిఆర్‌ఎస్‌ ‌దాడి చేసిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకే బండి సంజయ్‌పై దాడి జరిగిందని ఆరోపించారు. రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారని మండిపడ్డారు.

హుజురాబాద్‌ ఉప ఎన్నిక వోటవి• జీర్ణించుకోలేక కేసీఆర్‌ ‌బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇదే విషయంపై గవర్నర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు. కేంద్ర కొనుగోలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌మాట్లాడుతూ..40 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హావి• ఇచ్చిందని అన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందని మండిపడ్డారు. సివిల్‌ ‌సప్లై కార్పొరేషన్‌కు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి ఆపుతున్నారని అనుమానం ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బీజేపీ నేత డాక్టర్‌ ‌లక్ష్మణ్‌ ‌మాట్లాడుతూ..బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌వి•ద జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికి రాద్దాంతం చేస్తుందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేవరకు బీజేపీ పోరాడుతుందని అన్నారు.

ఉప ఎన్నికలో గెలుపుపై ఈటలను అభినందించిన గవర్నర్‌ ‌తమిళిసై
బిజెపి బృందం గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన సందర్భంగా రాజ్‌ ‌భవన్‌లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బీజేపీ నేతలతో కలిసి ఈటల రాజేందర్‌ ‌రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిచిన నేపథ్యంలో ఈటల రాజేందర్‌కు గర్నవర్‌ ‌తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఈటలను ప్రత్యేకంగా పిలిచి ఎన్నికల్లో బాగా కష్టపడి గెలిచారని భుజం తట్టి అభినందించారు.

ప్రజలకోసం పని చేయాలని సూచించారు. కాగా, గవర్నర్‌ ‌ప్రశంసలకు స్పందించిన ఈటల రాజేందర్‌.. ‌హుజూరాబాద్‌ ‌ప్రజల రుణం తీర్చుకోలేనిదని వ్యాఖ్యానించారు. నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, వారికి సేవ చేస్తానని అన్నారు.

Leave a Reply