Take a fresh look at your lifestyle.

ప్రారంభం

“తెలుగునేల మీద నా జీవితం, ఈ ప్రాంతంలో జరిగిన సమరశీల, వామపక్ష ఉద్యమాల పట్ల నా ప్రతిస్పందనలు, న్యాయవాదిగా ఈ సమాజం నా నుంచి కోరిన సేవలు, ఉద్యమజీవుల హక్కులను పరిరక్షించేందుకు నేను చేసిన న్యాయపోరాటాలు, ఈ రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎక్కడ ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరిగినా నేనక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన న్యాయపోరాటం సాగించాలని బాధితులు ప్రత్యేకంగానూ, సమాజం సాధారణంగానూ వ్యక్తం చేసిన ఆశలు-ఇవన్నీ నా వ్యక్తిత్వంలో భాగం. నా జీవితంలో విడదీయరాని భాగం. నా జీవితంలోని ఆ భాగాన్ని సమీక్షించుకోవడం, పునరావలోకనం చేయడం అవసరం. అంటే నా జీవిత కథ నేను ఏ సామాజిక పరిణామాలకు స్పందించానో ఆ సామాజిక పరిణామాల వివరణగా ఉండాలి. ఆ సామాజిక చరిత్రలో నేనెట్లా భాగమయ్యానో, పాలుపంచుకుంటూనే ఆ చరిత్రను నేనెట్లా చూశానో వివరించడానికే నా ఈ జీవిత కథ..”

డెబ్బై ఆరు సంవత్సరాల జీవితంలో, అర్ధ శతాబ్దానికి పైబడిన న్యాయవాద వృత్తిలో, నేనెన్నో అనుభవాలు గడించాను. చిరస్మరణీయమైన జ్ఞాపకాలు, సమాజం గురించీ, మానవ సంబంధాల గురించీ, ఉద్యమాల గురించీ చెప్పదగిన విశేషాలు అనేకం ఉన్నాయి. కాని నా ఈ జీవిత కథను ఆత్మకథగా రాయాలని నేననుకోవడం లేదు. అనుభవించిన జీవితం గురించి రాసుకోవడం ఒక అలసట గొలిపే పక్రియ. ఒక వ్యక్తిని రూపొందించిన ఘటనల గురించి ఆ వ్యక్తే గుర్తు తెచ్చుకోవడం కష్టసాధ్యమైన ప్రయత్నం. అందువల్ల నా జీవిత చరిత్ర వ్యక్తిగా నా సొంత గొడవగా ఉండగూడదని నా ఉద్దేశ్యం. నేనొక వ్యక్తిగా, పౌరహక్కుల ఉద్యమ కార్యకర్తగా, న్యాయవాదిగా, ప్రజాస్వామిక వాదిగా తయారు కావడంలో నా చుట్టూ జరిగిన అనేకానేక ఘటనల ప్రభావం ఉంది. అనేకమందితో నా సంబంధాల వల్ల, నా సంభాషణల వల్ల, ఆదాన ప్రదానాల వల్ల నా వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది.

తెలుగునేల మీద నా జీవితం, ఈ ప్రాంతంలో జరిగిన సమరశీల, వామపక్ష ఉద్యమాల పట్ల నా ప్రతిస్పందనలు, న్యాయవాదిగా ఈ సమాజం నా నుంచి కోరిన సేవలు, ఉద్యమజీవుల హక్కులను పరిరక్షించేందుకు నేను చేసిన న్యాయపోరాటాలు, ఈ రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఎక్కడ ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన జరిగినా నేనక్కడికి వెళ్ళి బాధితుల పక్షాన న్యాయపోరాటం సాగించాలని బాధితులు ప్రత్యేకంగానూ, సమాజం సాధారణంగానూ వ్యక్తం చేసిన ఆశలు-ఇవన్నీ నా వ్యక్తిత్వంలో భాగం. నా జీవితంలో విడదీయరాని భాగం. నా జీవితంలోని ఆ భాగాన్ని సమీక్షించుకోవడం, పునరావలోకనం చేయడం అవసరం. అంటే నా జీవిత కథ నేను ఏ సామాజిక పరిణామాలకు స్పందించానో ఆ సామాజిక పరిణామాల వివరణగా ఉండాలి. ఆ సామాజిక చరిత్రలో నేనెట్లా భాగమయ్యానో, పాలుపంచుకుంటూనే ఆ చరిత్రను నేనెట్లా చూశానో వివరించడానికే నా ఈ జీవిత కథ. అయితే న్యాయవాద వృత్తిలోకీ, పౌరహక్కుల ఉద్యమంలోకీ నేను ఎలా ప్రవేశించానో వివరించడానికి నేపథ్యంగానైనా నా జీవితంలోని తొలిరోజుల గురించి చెప్పడం అవసరం.

మా పూర్వీకులు తమిళులు. ఎన్నో శతాబ్దాల కింద నెల్లూరు చేరి అక్కడే స్థిరపడిన కుటుంబం మాది. మా నాన్న డా।। కె.జి.అయ్యంగార్‌ ‌సికిందరాబాద్‌లోని కింగ్‌ ఎడ్వర్డ్ ‌మెమోరియల్‌ (‌ప్రస్తుత గాంధీ) ఆస్పత్రిలో నేత్ర వైద్యుడిగా పని చేస్తుండేవాడు. అప్పుడు మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది గాని మా నాన్న రెండో పెళ్ళి చేసుకోవడంతో అప్పుడే హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో కమ్యూనిస్టుల మీద తీవ్రమైన అణచివేత చర్యలు మొదలయ్యాయి. వసంత వైపు బంధువు, హైదరాబాదు రాష్ట్రంలో ప్రఖ్యాత కార్మిక నాయకుడు ఎఎస్‌కె అయ్యంగార్‌ ‌నిర్బంధాన్ని తప్పించుకోవడానికి అజ్ఞాతంలోకి వెళ్ళ వలసి వచ్చింది. ఆయన మద్రాసు వచ్చి తలదాచుకోవలసి వచ్చింది. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉండిన ఆ రోజుల్లో అయ్యంగార్‌కు మా రాజప్ప ఆశ్రయం ఇచ్చాడు. క్రికెట్‌ ఆటగాడిగా రాజప్పకు చాలా పరపతి ఉండేది. ఆ పరపతి వల్ల కావచ్చు అయ్యంగార్‌ అజ్ఞాత జీవితం సజావుగానే గడిచింది. అయ్యంగార్‌ ‌నాకు ఎన్నో పుస్తకాలు పరిచయం చేశాడు. ఆయన చెప్పగా మారిస్‌ ‌డాబ్‌ ‘‌డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ‌కాపిటలిజమ్‌’, ‌శేషాద్రి చెప్పగా టిఎ జాక్సన్‌ ఫిలాసఫీ పుస్తకాలు చదివాను. తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల జాబితా ఉండేది.

Leave a Reply