Take a fresh look at your lifestyle.

నూతన శకానికి నాంది తథ్యం

అప్పుడు వాళ్ళు
ఇప్పుడు వీళ్ళు
ఎప్పుడైనా ఎన్నికల్లో
అవినీతి విషయాలను
రాజకీయ సినిమాలు సేయడం
నాయక డైరెక్టర్లకు కొత్తకాదు.
పోలీసులకు కొత్త పాత్రలు ఇవ్వడం,
మీడియాను  మీడియెటరునూ సేయడం
కార్యకర్తను ఉసిగొల్పుడు
ఇనకుంటే  ఇరికిచ్చుడు
సూసే కండ్లపై నిఘా పెట్టుడు
ఇండ్లల్లనే బందించుడు
కర్రలనూ,కుర్చిలనూ పూలుగా విసురుకొనుడు
కార్యకర్తల కొట్లాటల్లో కొందర్ని మభ్యపెట్టుడు
తిట్ల దండకాలు  రాజకీయ సదరంగంలో
శరా మామూలే….

గిప్పూడూ సీన్‌ ‌మారింది
అందరూ మనోళ్లే
అంతా మనదే అనుకునే నియంతకు
ఓటమి భయం నీడల వెంటాడంగా
పరువూ కాస్త ఫలితాల నదిలో మునుగుతుందని
రైతుల  గుణపాఠం నెమరేసుకుంటూ
దుబ్బాకలో ‘‘దుబ్బ’’ బుక్కుడు కాయమని
తెల్సి ..
పైసలిస్తున్నరని
ఓట్లు కొంటున్నరని
తమరు వేసిన
పంపిణీ తొవ్వను మర్శిండ్రు కాబోలు….

దొంగల్ని పట్టాల్సిన భటులు
దొంగలా మారి
అధికారానికి అండగా ఉంటే
ప్రజాస్వామ్య తెరకు చిల్లులు పెడుతుంటే
నోట్లబ్యాగునూ సాటు ,సాటుగా దాస్తే
ఖాకీ పరువు పత్రికలో’’ కావు ‘‘కావు’’ అని అరిస్తే
సూసే లోకంకి  ఏమార్థమైతదో…
పాపం ….రక్షించే బాబులు
ఇరికించాలని కెమెరా ఉచ్చుకు దొరకడం.
ఇంకొందరు ఇండ్లల్ల చిల్లిగవ్వ
లేవనడం, రైడింగులు జరక్కపోవడం.
హాస్యాస్పదం…సిగ్గుచేటు…

పతాకం నింగిలో రెపరెపలాడక
అవనతం అవుతుందా?
సిగ్గిడిసి మైకుల మొత్తుకునుడు
హామీల జల్లు కురిపించి నమ్మజూపుడు..
అజ్ఞానపు గొర్రెలు వత్తాసుగా ఉన్నంతకాలం
కసాయి ముర్కులు రాజ్యాలు ఎలాడం..
అందులో మనం
మౌనంగా కాలం వెల్లదీయడం
సిగ్గుచేటు…..

ఓటుకు నోటు కాదు మనకు కావల్సింది
బతుకులు బాగుపడి
బాంచెన్‌ ‌బతుకులు పోవాలె
తిండి,బట్ట,గృహం నెరవేర్చాలి
మనిషిని మనిషిగా మార్చే
రాజకీయం రావాలి , కావాలి…
అలాంటి వారిని ఎన్నుకునే
వారసత్వాన్ని ఓటరు
పునికిపుచుకున్న నాడు.
నూతన శకానికి నాంది తథ్యం…

నాగరాజు (మద్దెల)
6301993211.
దుబ్బాక ఎలక్షన్లలో పోలీసుల పనితీరు చూసి స్పందనతో రాసిన కవిత…. 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply