Take a fresh look at your lifestyle.

తెలంగాణ యువతకు దీపస్తంభం మన బూర్గుల

తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం సాయుధ పోరాటంతో పాటు స్వాతంత్య్రసమరంలో కూడా ముందుండి నడిచిన బూర్గుల నరసింగరావు తుదిశ్వాస విడవడం విచారకరం. బూర్గుల నరసింగరావు సమీప బంధువులు హైదరాబాద్‌? ‌ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు (పెదనాన్న), సామాజిక కార్యకర్త రమా మేల్కోటే (సోదరి) కూడా తెలంగాణ పోరాట చరిత్రలో ముందు వరుసలో నిలిచిన వారే. బూర్గుల నరసింగరావు చిన్నతనం నుండే హొజాతీయతాభావనిధి, లౌకికవాది, సాయుధ రైతాంగ పోరాటయోధుడు, ప్రగతిశీల ఉద్యమ కామ్రేడ్‌ ‌మరియు స్వాతంత్య్ర సమరయోధుడిగా అనితరసాధ్యమైన దేశభక్తిని ప్రదర్శించారు. నిజామ్‌ ‌కాలేజీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన బూర్గుల తన ప్రత్యేక ముద్రను నిలుపుకున్నారు. షోయబుల్లా ఖాన్‌ ‌సంపాదకుడిగా ఉర్దూ పత్రిక ‘ఇమ్రోజ్‌’‌ను తన గృహం నుండే నడిపిన ధీశాలి నరసింగరావు. షోయబుల్లా ఖాన్‌ ‌హత్యతో చలించిన బూర్గుల నరసింగరావు మార్కిస్ట్‌గా మారారు. ఆల్‌ ‌హైదరాబాద్‌? ‌స్టూడెంట్స్ ‌యూనియన్‌ ‌ప్రథమ అధ్యక్షుడిగా (1947-49) ఎన్నికైన ఘనత వారిది. 1948లో రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరు చేస్తూనే, పలు కమ్యునిస్ట్ ఉద్యమానికి నాయకత్వం వహించి జైలుపాలైనారు. లక్నోలో జరిగిన సమావేశంలో ఆల్‌ ఇం‌డియా స్టూడెంట్స్ ‌ఫెడరేషన్‌ (ఏఐయస్‌యఫ్‌) ‌ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికైనారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ధైర్యంగా ముందు నిలిచిన వారిలో బూర్గుల నరసింగరావు ఒక ప్రముఖుడిగా పేరొందారు. ప్రగతిశీల కమ్యూనిష్టు ఉద్యమాలతో నరసింగరావు పాత్ర వెలకట్టలేనిది. సిపిఐ సీనియర్‌ ‌లీడర్‌గానే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటయోధుడిగా జీవితాన్ని అంకితం చేసిన బూర్గుల నరసింగరావు కొన్ని రోజుల క్రితం కొరోనా సోకడంతోహొహాస్పిటల్‌ ‌లో చేరి తన 90వ ఏట మరణించడం తెలంగాణ సామాన్య ప్రజానీకానికి తీరని లోటు. వయోభారం ఉన్నప్పటికీ లక్నోలో జరిగిన ఏఐయస్‌యఫ్‌ 75‌వ వ్యవస్థాపక ఉత్సవాలలో మాజీ అధ్యక్షుడిగా హాజరైనారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన తొలిదశ మరియు మలిదశ పోరుల్లో తనవంతు పాత్రను పోషిస్తూ, కమ్యూనిష్టు ఉద్యమ పురోగతికి శ్రమించారు.

చిరస్మరణీయ సేవలు చేసిన బూర్గుల నరసింగరావుహొహొప్రముఖ అభ్యుదయవాది, అధ్యాపకుడు, జర్నలిస్ట్, ‌రచయిత మరియు హొకమ్యూనిష్టులకు దీపస్తంభంగా వెలిగిన బూర్గుల నరసింగరావు బహుముఖ ప్రజ్ఞాశీలిగా తెలంగాణ చరిత్రలో చెరగని ముద్రలు వేశారు. వారు లేని లోటు తీర్చలేనిది, వారి త్యాగాలు మరువలేనివి. 1952 ముల్కీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నరసింగరావు 1960లో ఉన్నత విద్య నిమిత్తం ఇంగ్లాడ్‌ ‌వెళ్లారు. అనంతరం హైదరాబాద్‌?‌కు తిరిగి వచ్చి పొలిటికల్‌ ‌సైన్స్ అధ్యాపకుడిగా కొంతకాలం పని చేశారు. తుది శ్వాస విడిచే వరకు అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షడిగా నిర్విరామ సేవలు అందించారు. బూర్గుల నరసింగరావు జీవితం త్యాగాలతో, పోరాటాలతో నిండినది. ఒక ఆదర్శవంతమైన కామ్రేడ్‌గా సమసమాజ స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేసిన బూర్గుల నరసింగరావు రజాకార్లకు ‘సింహ’స్వప్నంగా మరియు సాయుధ రైతాంగ పోరులో బూర్గుల ఎదురులేని ‘బులెట్‌’‌గా దూసుకుపోయి నేటి యువతకు దిశనిర్థేశనం చేస్తున్నారు. బూర్గుల నరసింగరావు అడుగుజాడలే మనకు జాతీయ రహదారులు, వారి సిద్ధాంతాలే మనకు నిత్య ప్రేరణలు కావాలి.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
గోల్డ్ ‌మెడలిస్ట్, ‌జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత

Leave a Reply