Take a fresh look at your lifestyle.

బ్యాంక్‌ ‌నిర్లక్ష్యంతో హ్యాకింగ్‌కు సులువైంది

  • మహేశ్‌ ‌బ్యాంక్‌ ‌హ్యాకింగ్‌ను చేధించిన పోలీసులు
  • 2 నెలల పాటు విచారణలో నిందితుల గుర్తింపు
  • దొరకని ప్రధాన నిందితుడి ఆచూకీ
  • రెడ్‌కార్నర్‌ ‌నోటీస్‌ ‌జారీచేసి పట్టుకుంటాం
  • వివరాలు వెల్లడించిన సిపి సివి ఆనంద్‌

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : మహేష్‌ ‌బ్యాంక్‌ ‌సర్వర్‌ ‌హ్యాకింగ్‌ ‌కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. మహేష్‌ ‌బ్యాంకు నిధుల గోల్మాల్‌ ‌కేసులో కీలక పురోగతి కనిపించింది. పదిమంది నిందితులను సైబర్‌ ‌క్రైమ్‌ ‌పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను బుధవారం మధ్యాహ్నం వి•డియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు  పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ ‌వివరాలు తెలిపారు. మహేష్‌ ‌బ్యాంక్‌పై సైబర్‌ ‌దాడి చిక్కు ముడిని విప్పేందుకు పోలీసులు బ్యాచ్‌ల వారిగా విడిపోయి రంగంలోకి దిగారు. అందులో భగంగా ఢిల్లీ, బెంగళూరు, పుణె, ముంబయి సహా ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లిన సీసీఎస్‌ ‌బృందాలు నిందితులను వలపన్ని పట్టుకున్నాయి. మహేష్‌ ‌బ్యాంక్‌ ‌హ్యాకింగ్‌ ‌కేసులో 2 నెలల పాటు విచారణ చేసినట్టు సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. 100 మంది పోలీస్‌ ఆఫీసర్స్‌తో కేసు విచారణ చేశామన్నారు.

ఏ కేసుకు ఖర్చు కానీ నగదు, మహేష్‌ ‌బ్యాంక్‌ ‌కేసులో ఖర్చు అయ్యిందన్నారు. టీఏ, డీఏలతో కలిపి ఈ కేసులో 58 లక్షలు రూపాయలు ఖర్చు అయ్యిందని సీపీ తెలిపారు. హ్యాకింగ్‌ అనేది ఆందోళన కలిగించే అంశంగా చూడాలన్నారు. ఆర్‌బీఐ నిబంధనలు పాటించకుండా బ్యాక్‌ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రజల సొమ్ముతో బ్యాంక్‌లను నడుపుతున్నా కూడా నిబంధనలు పాటించక పోవడం, నిర్లక్ష్యం చేయడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్‌ ‌తెలిపారు. బ్యాంకు సర్వర్లను హ్యాక్‌ ‌చేసి నేరగాళ్లు నిధులను కొట్టేశారు. బ్యాంకు ఖాతాలతో పాటు సర్వర్‌లో చొరబడి 14 కోట్లను సైబర్‌ ‌నేరగాళ్లు కాజేశారు. నిధులు కాజేసిన ప్రధాన సూత్రధారిని నగర పోలీసులు గుర్తించారు. నైజీరియా నుంచే బ్యాంకు సర్వర్లను హక్‌ ‌చేసి డబ్బు కొట్టేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు ఇదే తరహాలో మూడు బ్యాంకుల నిధులను నేరాగాళ్లు కొట్టేశారు. అందులో..మహారాష్ట్రలో బ్యాంక్‌ ఆఫ్‌ ‌బరోడా, తెలంగాణ కోపరేటివ్‌ ‌బ్యాంకు, మహేష్‌ ‌బ్యాంక్‌ ‌నిధులను లూటీ చేశారు. మహేష్‌ ‌బ్యాంకు కేసులో ఇప్పటి వరకు 23 మందిని పోలీసులు అరెస్ట్ ‌చేశారు.

భారత్‌లో ఉండి నైజీరియన్‌కి సపోర్ట్ ‌చేసిన కీలక సూత్రధారి అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకుల దోపిడిలపై కీలక విషయాలను హైదరాబాద్‌ ‌సీపీ ఆనంద్‌ ‌వెల్లడించారు. అయితే ప్రధాన హ్యాకర్‌ ‌దేశంలో లేడు..ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. 24 మంది హ్యాకర్లను అరెస్ట్ ‌చేశాము. స్టీఫెన్‌ ఒర్జీ సెకెండ్‌ ‌లెవల్‌ ‌హ్యాకర్‌ను అరెస్ట్ ‌చేశాం. ఐపీ అడ్రెస్‌లతో ఉన్న ప్రధాన హ్యాకర్‌ను అరెస్ట్ ‌చేయాలి. రెడ్‌ ‌కార్నర్‌ ‌నోటీస్‌ ‌జారీ చేసి నిందితుడిని పట్టుకొస్తాం. ఢిల్లీలో ఉన్న ఇంట్రా సాప్ట్ అనే కంపెనీ బ్యాంక్‌లకు సాప్ట్‌వేర్‌ ఇస్తున్నారు. చాలా బ్యాంక్‌లకు వీరు సాఫ్ట్ ‌వేర్‌ అం‌దజేస్తున్నారు, కానీ సరైన సైబర్‌ ‌సెక్యూరిటీ లేకుండా అందిస్తున్నారు. ఈ కేసులో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అనేది నోటీసులు ఇచ్చి విచారణ చేస్తామన్నారు. నవంబర్‌ ‌నెలలో మహేష్‌ ‌బ్యాంక్‌ 200 ‌మంది ఉద్యోగులకు ఫిషింగ్‌ ‌మెయిల్స్ ‌హ్యాకర్‌ ‌పంపాడు. ఇద్దరు ఉద్యోగులు మెయిల్‌ ఓపెన్‌ ‌చేయగానే..హ్యాకింగ్‌కు సులువు అయింది. మహేష్‌ ‌బ్యాంక్‌ ‌సింగిల్‌ ‌నెట్వర్క్‌తో నడిపిస్తున్నారు.

బ్యాంక్‌ ‌వ్యవస్థలో ఒకే నెట్వర్క్ ‌వాడకూడదు. బ్యాంకింగ్‌ ‌వ్యవస్థకు ఫైర్‌ ‌వాల్స్ ఏర్పాటు చేసుకోవాలి..కానీ మహేష్‌ ‌బ్యాంక్‌ అలాంటిది ఏమి ఏర్పాటు చేసుకోలేదన్నారు. మహేష్‌ ‌బ్యాంక్‌ ‌సిబ్బంది నిర్లక్ష్యం వల్ల హ్యాకింగ్‌ ‌చేయడం సులువు అయింది. 7గురు ఖాతాదారులను సంప్రదించి 10శాతం కమిషన్‌కు నగదు బదిలీలు జరిగాయి. 7 అకౌంట్స్..115 అకౌంట్స్ అక్కడి నుంచి 3 వందల ఖాతాలు తెరిపించారు. ఫిషింగ్‌ ‌మెయిల్స్ ‌స్విట్జర్లాండ్‌- ‌వేరే వేరే దేశాల్లో చూపిస్తున్నాయి. ఐపి అడ్రస్‌లు కెనడా నుంచి పాట్నా- పాట్నా నుంచి యూకే అని ఫేక్‌ అ‌డ్రస్‌లు ఇచ్చారని సీవీ ఆనంద్‌ అన్నారు.

Leave a Reply