Take a fresh look at your lifestyle.

బ్యాంకు చట్టూ పడిగాపులు కాస్తున్నా ఫలితంలేదు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ ‌డౌన్‌ ‌కొనసాగించి ఉ న్నా.. కఠినమైన ఆదేశాలను జారీ చేసిన ఆయా సంస్థలు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురికాక తప్పడంలేదు మంగళవారం చర్ల లో గల యూనియన్‌ ‌బ్యాంక్‌ ఎదుట జనం బారులు తీరిన వైనం ఇది. బ్యాంక్‌ ‌ఖాతాదారులకు షెల్టర్‌ ‌చూడవలసిన బ్యాంకు సిబ్బంది వీరిని గాలికి వదిలేశారు. ఒకరికి ఒకరు సామాజిక దూరం పాటించి, మా స్కూలు ధరించవలసి ఉన్నా…ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు సిబ్బంది సిగ్నల్స్ ‌లేవు అనే కారణంతో గంటల తరబడి లైన్లో నిలబడవలసి వస్తుంది. అనారోగ్యంతో ఉన్న వారి పరిస్థితి అయో… మయంలో ఉన్నారు. కొందరు కండ్లు తిరిగి క్రింద పడ్డ వారు లేకపోలేదు.

లింగాపురం గ్రామానికి చెందిన బట్ట గౌరమ్మ (60) వృద్ధురాలి బాధ అంతా ఇంతా కాదు. ఆమెకు పక్షవాతం వచ్చి సంవత్సరం అయింది .ఆమె కూర్చోలేక నిలబడలేక పోతున్నా..బ్యాంక్‌ ‌చుట్టూ వారం నుండి ప్రదక్షణ చేస్తున్నా…నాకు డబ్బులు పడ్డా యో ..లేదో కూడా తెలియక పాయె అన్ని ఆవేదన్న వ్యక్తం చేస్తున్నది.సంబంధిత అధికారులు వెంటనే ఖాతాదారులకు అన్ని వసతులను కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply