Take a fresh look at your lifestyle.

భదాద్రిలో బంద్‌ ‌సంపూర్ణం

రైతు ఏడ్చిన రాజ్యం నిలవదు – రైతు ఉద్యమంతో బిజెపి పతనం ప్రారంభం
భద్రాచలం,మార్చి 26 (ప్రజాతంత్ర ప్రతినిధి) : రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతి రేకించాలని, కేంద్రం తీసు కొచ్చిన విద్యుత్‌ ‌సవరణ చట్టం రద్దు చేయాలని, పెంచిన డీజిల్‌ ‌పెట్రోల్‌ ‌వంటగ్యాస్‌ ‌ధరలు తగ్గిం చాలని కోరుతూ  దేశవ్యాప్తం గా వామపక్ష పార్టీలు, అఖిలపక్ష పార్టీలు తలపెట్టిన భారత్‌ ‌బంద్‌ ‌భద్రాచలం పట్టణంలో సంపూ ర్ణంగా విజయవంతమైంది.. తెల్ల వారుజాము నుండి అఖిలపక్ష పార్టీల నాయకులు ఆర్‌ ‌టి సి బస్సులు వెళ్లనీయకుండా బస్టాండ్‌ ‌ముందు బైఠాయించడం జరిగింది. పట్టణ వ్యాప్తంగా వ్యాపార వర్గం స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బందుకు తమ మద్దతు ప్రకటిం చారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ ‌సెంటర్లో జరిగిన సభలో మాజీ ఎంపీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్‌ ‌మిడియం బాబూరావు మాట్లాడుతూ గత 120 రోజులుగా రైతులు చేస్తున్న పోరాటం ఉధృతం చేస్తూ రైతు సంఘాలు ఇచ్చిన ‘‘భారత్‌ ‌బంద్‌’’ ‌పిలుపు దేశవ్యాప్తంగా విజయవం తంగా సాగుతుందని అన్నారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దుచేయాలని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, సంయుక్త కిషన్‌ ‌మోర్చా నేతృత్వంలో నేడు దేశ వ్యాప్తంగా భారత్‌ ‌బంద్‌ ‌జరుగుతున్నదని అన్నారు. నిర్బం ధాలు ద్వారా రైతు ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నిర్బంధాల తో రైతు ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. రైతు కన్నీరు పెట్టిన రాజ్యం ఏనాడు నిలబడలేదని రైతు ఉద్యమంతోనే బిజేపి పతనం ప్రారంభమైందని ఆయన అన్నారు. కార్పొరేట్‌ ‌శక్తులకు అనుకూలంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా అమ్మేం దుకు సిద్ధ పడిందని, పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌వంటగ్యాస్‌ ‌పెంచడం వల్ల నిత్యవ సర వస్తువులు ఆకాశాన్నం టుతున్నా యని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ బంద్‌ ‌కార్య ్రకమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుఎ.జె. రమేష్‌, ‌సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్‌, ‌సిపిఐ ఎంఎల్‌ ‌న్యూ •మోక్రసీ జిల్లా నాయకులు కెచ్చల కల్పన తెలుగుదేశం పార్టీ  రాష్ట్ర నాయకులు ఎస్కే అజీమ్‌, ‌కాంగ్రెస్‌ ‌పార్టీ పట్టణ అధ్యక్షులు సరెళ్ళ. నరేష్‌, ‌సిపిఎం సిపిఐ పట్టణ కార్యదర్శులు  గడ్డం స్వామి, ఆకోజు సునీల్‌ ‌కుమార్‌, ‌జిల్లా కమిటీ సభ్యులు ఎం బి నరసారెడ్డి, టి. వెంకటేశ్వరరావు, వామపక్ష పార్టీ పట్టణ నాయకులు బి వెంకట రెడ్డి, బండారు శరత్‌ ‌బాబు, బల్ల సాయికుమార్‌, ‌డి సీతా లక్ష్మి, సున్నం గంగా, ఎం నాగరాజు, ఎస్‌ ‌డి ఫిరోజ్‌, ‌విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

బూర్గంపాడులో :  మండల పరిధిలోని సారపాక గ్రామంలో  అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్‌ ‌బంద్‌ ‌ను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి పినపాక నియోజకవర్గ ఇన్చార్జి సాయిబాబు మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మరియు పెరిగిన  పెట్రోల్‌ ,‌డీజిల్‌ ,‌గ్యాస్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో బందును నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమంలో   మండల నాయ కులు శ్రీను, న్యూడెమోక్రసీ ఎమ్మెల్‌ ‌సిపిఐ పేరాల శ్రీను, సిపిఎం నాయకులు   వెంకటేశ్వరరావు ,కాంగ్రెస్‌ ‌మండల నాయకులు పుల పెళ్లి సుధాకర్‌ ‌రెడ్డి, కె రవి, టిడిపి మండల అధ్యక్షుడు తాళ్లూరి జగదీష్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

మణుగూరు: రైతు సంఘాలు చేపట్టిన భారత్‌ ‌బంద్‌కు మణుగూరు సింగరేణి ఏరియాలోని అఖిలపక్ష కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఎస్‌డి.నాసర్‌పాషా తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ…  కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి ప్రభుత్వం ఒక్క రైతులనే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కూడా నాశనం చేసే దిశగా చట్టాలను రూపొందిస్తుందని మండిపడ్డారు. అనేక  ్రపభుత్వ రంగ పరిశ్రమలను ప్రవేటీకరించడమే కాకుండా విశాఖ స్టీల్‌ ‌కూడా కార్పొరేట్‌ ‌శక్తులకు దారాదత్తం చేసేందకు చాలా దూకుడుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ‌కార్మికులు రంగయ్య, నరసింహారావు, సమ్మయ్య, భీమయ్య, ఉపేంద్ర, సీత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply