Take a fresh look at your lifestyle.

తిరుమలకు తగ్గిన భక్తుల రాక

బోసిపోతున్న తిరుమల గిరులు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ మే నెలలో పూర్తిగా తగ్గింది. కరోనా విజృంభణ, కర్ఫ్యూ కారణంగా భకత్‌ఉల రాక తగ్గింది. తిరుమల తిరుపతి దేవస్థానంపై కరోనా ఎఫెక్ట్ ‌బాగా కనిపిస్తోంది. గడిచిన 12 రోజుల్లో శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 12 రోజులలో కేవలం 71 వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు.

12 రోజులలో హుండీ ద్వారా 4.53 కోట్లను భక్తులు సమర్పించారు. 12 రోజులలో కేవలం 3 లక్షల లడ్డూలు మాత్రమే టీటీడీ విక్రయించింది. ఈ ఏడాది హుండీ ద్వారా రూ.1131 కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేశారు. అయితే సెకండ్‌ ‌వేవ్‌ ఎఫెక్ట్‌తో ఈ ఏడాది కూడా టీటీడీ అంచనాలు గాడి తప్పనున్నాయి.

Leave a Reply