Take a fresh look at your lifestyle.

పూజల పేరుతో మోసం మహిళతో సహా ఒకరి అరెస్టు

arrest of a man, including a woman, in the name of worship
23లక్షల నగదుతో పాటు 147 గ్రాముల ఆభరణాలు స్వాధీనం

పూజలతో ఆరోగ్యాలను బాగుచేస్తానని నమ్మించి దంపతులను నిర్భందించి బంగారు ఆభరణాలను, డబ్బును దోపిడి చేసిన కిలాడీ మహిళతో పాటు మరొక నిందితుడిని గురువారం సిసిఎస్‌, ‌సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కమిషనరేట్‌లో వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌రవీందర్‌ ‌నిందితుల వివరాలను వెల్లడించారు. అర్బన్‌ ‌జిల్లా కమలాపూర్‌ ‌మండలం వంగర గ్రామానికి చెందిన కొలిపాల పద్మ, జయశంకర్‌ ‌భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన తులసెగారి రాజబాబులు వృత్తిరిత్యా పనిమనిషిగా జీవనం సాగిస్తూ ఆదాయం సరిపోక ఇంటి యజమానినే నమ్మించి డబ్బు, నగలను కాజేశారని తెలిపారు. జులైవాడలో ముంజా వెంకటస్వామి తన భార్య అన్నపూర్ణతో కలిసి నివసిస్తున్నారని వీరి కుమారుడు విదేశాల్లో, కుమార్తె బెంగళూర్‌లో నివసముంటున్నారని వారివద్ద పద్మ, రాజబాబులు నమ్మకంగా పనిచేస్తూనే పూజలతోటి రోగాలు మాయం వచ్చునని యజమానులను నమ్మబలికారు. మనుమడికి అనారోగ్యం కావడంతో నిందితులు బాధితులను నమ్మబలికి లక్షల రూపాయలు వసూలు చేయడమే గాకుండా బంగారు ఆభరణాలు కూడా కాజేశారని తెలిపారు. ఇంటియజమాని వెంకటస్వామికి గుండెనొప్పి రావడంతో 25లక్షలు ఖర్చవుతుందని, డబ్బుల కోసం బలవంతంగా వారిని ఇంటిలోనే నిర్భందించి 10లక్షల రూపాయలను తీసుకోవడమే గాకుండా 15లక్షలు అప్పు ఇచ్చినట్లు బాధితుల నుండి ప్రామిసరీ నోట్లపై బినామీ పేరుతో సంతకాలు చేయించుకున్నారని, అంతేగాకుండా డబ్బు చెల్లించకుంటే ఇంటిని జప్తు చేస్తామంటూ దస్తావేజులపై సంతకాలు చేయించుకోవడంతో పాటు బ్యాంక్‌ ‌చెక్కులను బలవంతంగా తీసుకున్నారని అంతేగాకుండా 15లక్షలకు వడ్డీ పేరుతో 120 గ్రాముల బంగారు ఆభరణాలను దోపిడీ చేశారని తెలిపారు.

అంతేగాకుండా నిందితుడు జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఈ నెల 6న బాధితుల ఇంటికి వచ్చి విదేశాల్లో ఉంటున్న మీ కుమారునికి ప్రాణగండం ఉందని 2కోట్లు ఇస్తే దేవతా పూజలు చేసి ప్రాణగండం తప్పిస్తామని లేనట్లయితే మీ కుమారుడు మరణిస్తాడని బెదిరించారని తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో సుబేదారి, సిసిఎస్‌ ‌పోలీసలు రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇద్దరు నిందితులను పట్టుకొని వారి నుండి 23లక్షల 69వేల రూపాయల నగదు, 6లక్షల విలువగల 147 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనభర్చిన ఈస్ట్‌జోన్‌ ‌డిసిపి కెఆర్‌.‌నాగరాజు, క్రైం ఏసిపి బాబురావు, సిసిఎస్‌, ‌సుబేదారి ఇన్స్‌పెక్టర్లు రమేష్‌కుమార్‌, అజయ్‌, ఎస్సై బివిఎస్‌.‌రావు, ఎఎస్‌ఐ ‌శివకుమార్‌, ‌పర్విన్‌, ‌హెడ్‌కానిస్టేబుళ్ళు అహ్మద్‌పాషా, దామోదర్‌, ‌జంపయ్య, కానిస్టేబుళ్ళు రాజశేఖర్‌, ‌సౌభాగ్య, సంధ్యారాణిలను వరంగల్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ అభినందించారు.

Tags: arrest of a man, including a woman, in the name of worship

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply