Take a fresh look at your lifestyle.

JNTU H VC కట్టా నర్సింహరెడ్డి నియామకాన్ని రద్దు చేయాలి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరసన

హైదరాబాద్ ,మే 26: రాష్ట్రంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామకాలను రాజకీయ ప్రమేయంతో అనర్హులకు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నియమించారని ఆరోపిస్తూ నిరసిస్తూ జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ ముందు ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యూనివర్సిటీలకు వైస్ ఛాన్సెలర్ లను నియమించాలని రెండేళ్ల సుదీర్ఘ కాలంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వేల మంది విద్యార్థులతో 2 సార్లు అసెంబ్లీ ముట్టడి, నిరాహార దీక్షలు, యూనివర్సిటీ కేంద్రంగా ఉద్యమాలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం,గవర్నర్ కలిసి వినతిపత్రం సమర్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఫలితంగా యూనివర్సిటీలపై ప్రభుత్వ నిరంకుశ,నిర్లక్ష్య వైఖరి వీడి ఎట్టకేలకు వైస్ ఛాన్సెలర్ ల నియమించడం శుభపరిణామం కానీ ఈ నియామాకాల్లో కొంత మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా నియామకమైన వార ఉండడాన్ని ఎబివిపి రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.. ప్రతిష్టత్మాకమైన జె ఎన్ టీ యు యూనివర్సిటీ వీసిగా నియమించబడ్డ కట్టా నర్సింహ రెడ్డి గతంలో నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ లో వీసి గా తన హయాంలో అనేక అక్రమ నియామకాలు, చేపట్టి కోట్లాది రూపాయల అవినీతి కి పాల్పడ్డారని ప్రభుత్వం వేసిన సిద్ధిఖి ఆధ్వర్యంలోని కమిటీ నిర్థారించాయన్నారు.

అనేక ఆడిట్ ఆరోపణలు ఎదుర్కొంటూ ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఇలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా అవినీతిని, అక్రమాలను ప్రోత్సహిస్తూ మళ్ళీ అదే వ్యక్తి కి వీసి బాధ్యత కట్టబెట్టడం సిగ్గుచేటు..వీసిల నియామకాల్లో ఎక్కడా యూజీసీ నిబంధనలు పాటించకుండా ఎంతో మంది నిజాయితీ ప్రతిభ కలిగిన అధ్యాపకులను విస్మరించి 70సంవత్సరాలు పై బడిన వారిని వీసి లు గా నియమించడం లో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో సమాధానం చెప్పాలి అన్నారు.గతంలో కట్టా నర్సింహ రెడ్డి చేసిన అక్రమాల ఫలితంగా విద్యార్థులు మరియు నిరుద్యోగులు ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్నారు..కావున రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకంలో జరిగిన లోపాలను పునః సమీక్షించుకోవాలని ఎబివిపి డిమాండ్ చేస్తుందిఅన్నారు.

రాష్ట్ర గవర్నర్ ఎంజీ యూనివర్సిటీ అనేక సార్లు నిర్వహించిన సమీక్షల్లో వీసీ అవినీతి అక్రమాలపై అవగాహన ఉన్నప్పటికీ ఏ మాత్రం చర్యలు లేకుండా మరోసారి వీసీగా అనుమతించారు , మరో సారి ప్రభుత్వం, గవర్నర్ వీసీ నియామకాలపై పునఃపరిశీలించి అక్రమార్కులను, నిబంధనలకు విరుద్ధంగా నియమితులైన వీసీ లను తొలగించాలని లేని పక్షంలో న్యాయ పోరాటంతో పాటు క్షేత్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చెపడ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి విభాగ్ సంఘటన కార్యదర్శి కాయం నవేంద్ర, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ వినోద్ హిందుస్థానీ,స్టేట్ టెక్నీకల్ సెల్ కన్వీనర్ తోట శ్రీనివాస్,సనీల్,గోపాల్, వగ్గు కార్తీక్, శ్యామ్ కిరణ్,చరణ్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply