Take a fresh look at your lifestyle.

అన్నార్తుల ఆకలి తీర్చటం పూర్వజన్మ సుకృతం

కరోనా మహామ్మారి బారిన పడకుండా కాపాడేందుకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించిన నేపథ్యంలో తన తండ్రి కీ.శే.బూసిరెడ్డి సీతారామిరెడ్డి చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌పేరుతో బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి ప్రారంభించిన 34 వ రోజు అన్నదాన కార్యక్రమం లో శుక్రవారం మధ్యాహ్నం 700 మంది అన్నార్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది.ఈ అన్నదాన కార్యక్రమానికి  భద్రాచలం వాస్తవ్యుడు, అమెరికాలో నివాసం ఉంటున్న ఇమాడాబత్తుని వంశీకృష్ణ తన తండ్రి కీ.శే.ఇమడాబత్తుని రాంప్రసాద్‌ ‌జ్ఞాపకార్ధం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసిన ఆర్ధిక సహాయం చేశారని వంశీకృష్ణ జెన్నిఫర్‌ ‌దంపతులకు డా.బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

అన్నపూర్ణ ఫంక్షన్‌ ‌హాలు నందు తాత్కాలికంగా వసతి పొందుతున్న నిరాశ్రయులకు అక్కడికి చేరుకున్న అన్నార్తులకు150 భోజనం పొట్లాలు పంపిణీ చేశారు.ఈ• కార్యక్రమంలో డా.బూసిరెడ్డి శంకర్‌ ‌రెడ్డి తో పాటుగా డా.రమేష్‌ ‌బాబు, బసప్ప రమేష్‌, ‌డా.రమణారావు, కాకరాల శ్రీనివాసశర్మ,బాచినేని రామకృష్ణ, న్యాయవాది పామరాజు తిరుమలరావు, సేవాబృంద సభ్యులు గంజి సంపత్‌, ‌వంటమాష్టరు జబర్దస్త్ ‌రమేష్‌ ‌కంచర్ల, సహాయ వంట మాస్టర్‌ ‌హైదరాబాద్‌ ఉపేందర్‌ ‌సింగ్‌, ‌కావూరి ప్రభాకర్‌, ‌యాకుబ్‌ ‌రెడ్డి, బిందు ప్రభాకర్‌, ‌రాంగోటి గిరి, కొండారెడ్డి, రమేష్‌, ‌సన్నీ, సాహిత్‌, ‌రామచందర్‌, ‌గుండే రామారావు, హసీనా, నూర్జహాన్‌, ‌షేక్‌ ‌మీరా అన్వేష్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply