Take a fresh look at your lifestyle.

కేంద్రం మీద చేస్తున్న ఆరోపణలు నిరాధారం..

కేంద్ర జలవనరుల శాఖామంత్రి షెకావత్‌

‘‌కెసిఆర్‌ ‌బాధ్యతా రహితంగా కేంద్రం మీద ఆరోపణలు చేస్తున్నారు..ఇటీవల కేసీఆర్‌ ‌పలు ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్‌ల్లో నీటి పంపకాలపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాత్రకి సంబంధించి పలు అంశాలను లేవనెత్తి మాట్లాడుతున్నప్పుడు నా పేరును ఉటంకిస్తూ మాట్లాడారు. అంందుకే నా వైపు నుంచి కూడా నేను క్లారిటీ ఇవ్వటానికి ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాను’ అని కేంద్ర జలవనరుల శాఖామంత్రి షెకావత్‌ ‌గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ ప్రెస్‌ ‌కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని నిజాలు దేశానికి తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘సీఎం కేసీఆర్‌ ‌ట్రిబ్యునల్‌ ‌ద్వారా జరిగే  నీటి పంపకాలకు సంబంధించి పలు ఆరోపణలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం వలెనే మొత్తం సమస్య ఉన్నట్టు చిత్రించారు. ట్రిబ్యునల్‌ ఏర్పాటుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ స్టాండ్‌ ఏం‌టో మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే కేంద్రం వల్లనే ట్రిబ్యునల్‌ ఏర్పాటు జాప్యం జరిగినట్టు కేసీర్‌ ‌మాట్లాడుతున్నారు. నిజాలు ఈ విధంగా ఉన్నాయి..2015లో రెండు రాష్ట్రాలు ఏర్పడిన ఒక సంవత్సరం తర్వాత, సెక్షన్‌ 3 ఇం‌టర్‌ ‌స్టేట్‌ ‌రివర్‌ ‌డిస్ప్యూట్‌ ఆక్ట్ 1956 ‌ప్రకారం స్వయంగా కేసీఆర్‌ అపెక్స్ ‌కోర్టు సుప్రీమ్‌ ‌కోర్టుకు పోయి కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు కోసం అప్పీల్‌ ‌చేశారు. అప్పటి నుంచి ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు చేసే పరిస్థితి లేదు. ఈ విషయంలో  కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌మీటింగు జరిపించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల సభ్యులు సమావేశం కావటం అనేది జరగాల్సి ఉండగా..ఆ సమావేశం చాలా కాలం జరగలేదు.

ప్రధాని మోడీ చొరవ చూపి సమస్యను పరిష్కరించమని ఆదేశిస్తే సదరు సమావేశం కేంద్ర జల వనరుల మంత్రాలయం ఆధ్వర్యంలో నా చేతికి ఈ మంత్రాలయం వొచ్చిన తర్వాత అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌మీటింగు నిర్వహించేలా చర్యలు చేపట్టాం. ఆ మేరకు 6 అక్టోబర్‌ 2020 ‌నాడు సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఈ  సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కొత్త ట్రిబ్యునల్‌ను  ఏర్పాటు గురించి ప్రస్తావించినప్పుడు, వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేయగలిగేది ఏమీ లేదని నేనే స్వయంగా కేసీఆర్‌కు తెలిపాను. అప్పుడు అంటే 6 అక్టోబర్‌ 2020‌న ఈ సమావేశంలో 2015లో వేసిన కోర్టు కేసును ఉపసంహరించుకునేందుకు రేపే అపెక్స్ ‌కోర్టులో అప్లికేషన్‌ ‌పెడతామని కేసీఆర్‌ ‌స్వయంగా చెప్పారు.  తీరా  8 నెలల తర్వాత ఎపెక్స్ ‌కోర్టుకు కెసిఆర్‌ అప్లికేషన్‌ ‌పంపించారు. దీని  మీద ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం తన అభ్యంతరాలను తెలుపుతూ ఒక అప్లికేషన్‌ ‌ఫైల్‌ ‌చేసింది.

అటుపైన కోర్టు వ్యవహారం నడచి 6 అక్టోబర్‌ 2021 ‌నాడు ఆ కేసు క్లోజ్‌ అయ్యింది. అంటే సరిగ్గా  నెలా నాలుగు రోజుల క్రితం ఆ కేసు క్లోజ్‌ అయ్యింది. అంటే కరెక్టుగా నెల క్రితం మాత్రమే కేంద్ర ప్రభుత్వ పాత్ర అన్నది ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయటంలో మొదలయ్యింది. ఈ నేపథ్యంలో కెసిఆర్‌ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను..ఏడు సంవత్సరాల నుంచి కొత్త ట్రిబ్యునల్‌ ‌గురించి తెలంగాణ ప్రభుత్వం అడుగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేసీఆర్‌ ఎలా ఆరోపిస్తారని. అది కూడా నా పేరు చెబుతా ఎలా ఆరోపణలు చేస్తారు. ఇంత ఆలస్యం కావటానికి కారణం ఇరు రాష్ట్రాలు ముఖ్యముగా కోర్టుకు పోయి కేసులు వేయటం.  దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వాన్ని, జల శక్తి మంత్రాలయాన్ని ఎలా బాధ్యులుగా చేస్తారు. స్వయంగా ప్రధానమంత్రి ఈ విషయంలో ఇంట్రెస్ట్ ‌తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని నాకు చెబితే ఆ రోజు అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమస్యలు పరిష్కరించడానికి ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు పరిష్కరించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది.

కొత్తగా ఏర్పాటు చేసిన బోర్డు మీద పలు వ్యాఖ్యలు కెసిఆర్‌ ‌చేశారు. దురదృష్టవశాత్తు ఏర్పాటు చేసిన బోర్డుల నోటిఫికేషన్స్ ఇవ్వటం ఇంతవరకు సాధ్యపడలేదు. కెఆర్‌యంబి మరియు జిఆర్‌యంబి బోర్డులు ఆంధప్రదేశ్‌ ‌బై ఫర్‌ ‌కేషన్‌ ‌చట్టం ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. వీటి నోటిఫికేషన్స్ ‌జారీ చేయకపోవడం వలన ఇవి రెండూ పనిచేయటం పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ సమస్య మీద ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఎప్పటికప్పుడు చర్చలు చేసి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న కేసీఆర్‌ ఈవిధంగా మాట్లాడటం కేంద్రం ఒక డ్రామా చేస్తుంది అనటం బాధ్యతరాహిత్యం. బోర్డు ఏర్పాటు  సంబంధించి విభజన చట్టం మేరకు ఇరు రాష్ట్రాలు సమస్య పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను ఇరు రాష్ట్రాలను కోరుతున్నారు. తగిన విధంగా నీటి పంపకం, అతిగా నీరు వాడేసుకోవటం, అక్రమంగా నీరు తీసుకోవటం, ఇలా  రెండు నదులకు సంబంధించిన అంశాలను ఇరు రాష్ట్రాలు శాంతియుతంగా, బాధ్యతాయుతంగా పరిష్కరించుకోవాలని  కోరుతున్నాను.

విభజన చట్టంలో ఉన్న ప్రధానమైన అంశాలు ప్రాజెక్టులను, వాటి మెయింటెనెన్స్ ‌బోర్డు అప్పజెప్పాలని  వుంది. ప్రాజెక్టుల డిపిఆర్‌ ‌రిపోర్టులను కూడా సబ్మిట్‌ ‌చేయవలసి ఉంటుంది. సెంట్రల్‌ ‌వాటర్‌ ‌బోర్డ్ ‌కమిషన్‌ ‌ద్వారా బోర్డులకు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా నీటి ఆలోకేషన్‌ ‌చేయడం ఇరు రాష్ట్రాలకి  చేయటం సాధ్యపడుతుంది. బోర్డుల  అప్రైజల్‌ ‌సాంక్షన్‌ ‌చేయటానికి ప్రాథమిక వనరులు విభజన చట్టం ప్రకారం నిధులు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. పని చేయడానికి మానవ వనరుల ఏర్పాటు ఆఫీసుల ఏర్పాటు ఇరు రాష్ట్రాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం న్యాయ శాఖ మంత్రాలయంతో కూడా ఈ విషయం పైన టచ్‌లో ఉన్నాము. వీలున్నంత త్వరగా కొత్త ట్రిబునల్‌ ఏర్పాటు చేయటం లేదా పాత ట్రిబునల్‌ ‌కొనసాగిస్తూ పని సత్వరమే మొదలు పెట్టడం అన్న దానిపైన నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో జాప్యం జరగకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రయత్నం చేస్తుంది. కొత్త బోర్డు ఏర్పాటులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నీటి పంపకాల అంశం మాత్రమే ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నది.ఈ విషయంలో మాకు పని చేసే లాగా అవకాశం ఇచ్చిన వెంటనే మేము పని స్టార్ట్ ‌చేసాం’ అని కేంద్ర జలశక్తి మంత్రి షాకవత్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు డీపీఆర్‌ల రూపంలో పంపించిన డాక్యుమెంట్లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. వాటిని డిపిఆర్‌లు అని చెప్పలేము.

Leave a Reply