Take a fresh look at your lifestyle.

రవాణా సౌకర్యం మెరుగుపర్చడమే లక్ష్యం : ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌, ‌మే 16, ప్రజాతంత్ర విలేఖరి : చింత)మానేపల్లి మండలం గూడెం ప్రాణహిత నది మీదుగా తెలంగాణ – మహారాష్ట్రలను కలుపుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గూడెం వంతెనను సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యం మెరుగుపర్చడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ధ్యేయమని అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు నియోజకవర్గమైన సిర్పూర్‌ ‌నియోజకవర్గంలోని చింతలమానపల్లి గూడెం వద్ద ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్రను కలుపుతూ వంతెనను మంజూరు చేసారన్నారు. ముఖ్యమంత్రి ఈ వంతెన నిర్మాణపు పనులను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ కాంట్రాక్టుర్లను ప్రోత్సహించడంతో ఈ వంతెన నిర్మాణ పనులు తుది దశకు చేరుకుందని తెలిపారు.

ఈ సందర్బంగా ఈ వంతెనను మంజూరు చేసి నిర్మాణానికి కృషి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చిత్ర పటానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు పాలాభిషేకం చేశారు. వంతెన నిర్మాణం పూర్తి కావడంతో ప్రజాప్రతినిధులు నాయకులు ఆనందంతో ఎమ్మెల్యే కోనేరు కోనప్పకి మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో కౌటాల, చింతలమానేపల్లి మండల ఎంపిపిలు బి.విశ్వనాథ్‌, ‌డుబ్బుల నానయ్య, డిసిఎంఎస్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌కొమురం మాంతయ్య, మండల ప్రజాప్రతినిధులు టిఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా, గూడెం ప్రాణహిత వద్ద వంతెనను మంజూరు చేయించడంతో పాటు ఎప్పటికప్పుడు వంతెన పనులను పరిశీలించి వంతెన నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఇరు మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సన్మానించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply