Take a fresh look at your lifestyle.

తెలంగాణను అభివృద్ది చేయడమే లక్ష్యం

  • ఎవరూ ఊహించని అభివృద్దిని సాధించాం
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మండిపాటు
  • అవసరమైతే ఉద్యమంలో పాల్గొంటాం
  • ఎమ్మెల్సీ ఎన్నికల సభలో మంత్రి కెటిఆర్‌ ‌పునరుద్ఘాటన

హైదరాబాద్‌,‌మార్చి10: టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఓట్ల కోసం, సీట్ల కోసం పని చేయదని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏపని చేసినా చిత్తశుద్ధితో చేస్తుందని ఆయన తేల్చిచెప్పారు. ఈ క్రమంలోనే నిరంతర విద్యుత్‌, ‌నీటి సౌకర్యాలతో సహా అనేక కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టామని అన్నారు. బిజెపి నేతల తీరుపై మండిపడుతూ..విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికారు. అవసరమైతే ఉద్యమంలో పాల్గొంటామని అన్నారు. రికగ్నైజ్డ్ ‌స్కూల్స్ ‌మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ‌హైదరాబాద్‌ ఆధ్వర్యంలో కరస్పాండెన్స్, ‌టీచర్ల సమావేశం జలవిహార్‌లో జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, ‌తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌సబితా ఇంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. కరోనా లాక్‌డౌన్‌ ‌లాంటి రోజులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. అన్ని బంద్‌ ‌చేసుకుని ఇంట్లోనే ఉండి ఇబ్బందుల పాలవుతామని అసలే ఊహించలేదు. గతేడాది మార్చిలో రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రవేశపెట్టాం.

ఒక లక్షా 80 వేల కోట్లు ప్రవేశపెట్టాం. బడ్జెట్‌ ‌పెట్టిన నాలుగు రోజులకే కరోనాతో సభను అర్దాంతరంగా ముగించుకున్నాం. కరోనా ఉపద్రవం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి దెబ్బతగిలింది. కరోనా వల్ల రాష్ట్రానికి రూ. 52 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. హెలికాప్టర్‌ ‌మనీ ద్వారా రాష్ట్రాలను ఆదుకోవాలని సీఎం కసీఆర్‌ ‌సూచించినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మనం కలలో కూడా ఊహించని ఉత్పాతం కరోనా రూపంలో వచ్చిందన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు కొందరు దుష్పచ్రారం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ఆరున్నరేండ్ల కాలంలో ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాం. విద్యుత్‌ ‌సమస్యలను అధిగమించాం. మంచి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని తెలిపారు. ఒక సంస్కారవంతమైన ప్రభుత్వం కాబట్టే అంగన్‌వాడీ పిల్లలకు బాలామృతం పెడుతున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు పోయే పిల్లలకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం కడుపునిండా పెడుతున్నాం. గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

- Advertisement -

ఓవర్సీస్‌ ‌స్కాలర్‌షిప్‌ ‌ద్వారా రాష్ట్ర విద్యార్థులకు విదేశాల్లో విద్యను అందిస్తుందని తెలిపారు. ఆరేళ్లలో లక్షా 32 వేల ఉద్యోగాలు ఇచ్చా మన్నారు. త్వరలోనే మరో 50 వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ ‌హయాంలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఉద్యోగాల భర్తీ విషయంలో శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ప్రతిపక్షాలు మాట మార్చాయని కేటీఆర్‌ అన్నారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కార మవుతాయని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతుగా పబ్లిక్‌ ‌గార్డెన్స్‌లో ఇవాళ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు. రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తున్నదని వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడిన అనంతరం 1,33,001 ఉద్యోగాలు ఇచ్చామని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.ఇకపోతే విశాఖ ఉద్యమంపై కెటిఆర్‌ ‌కీలక ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేశారన్నారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉందన్నారు. వీలైతే వైజాగ్‌ ‌వెళ్లి ఉద్యమంలో పాల్గొనేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు. తమ అందరి మద్దతు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ చేస్తున్న ఉద్యమానికి ఉంటుందని.. పోరాటంలో కలిసి ఉంటామని కేటీఆర్‌ ‌వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ ప్రజానీకం తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తున్నారు. అసలు ఈ ప్రకటన వచ్చీ రాగానే ప్రజలు తమ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి కేటీఆర్‌ ‌ప్రకటన మరింత బలాన్నిచ్చిన్టటైంది. బీజేపీపై మరోసారి మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ అయ్యారు. వాణీదేవి ప్రశ్నించే గొంతు కాదు.. పరిష్కరించే గొంతు అవుతారని తెలిపారు. తెలంగాణ వస్తే.. కరెంట్‌ ఉం‌డదు అన్నారు.. చీకటి రోజులే అన్నారు..

తెలంగాణ వచ్చాక రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించాలని పేర్కొన్నారు. నిరంతర విద్యుత్‌, ఇం‌టింటికి నల్లా నీళ్లు ఇస్తున్నామని.. 65 ఏళ్లలో కాని పనులు.. 6 ఏళ్లలో చేసి చూపించామని గుర్తుచేశారు. పెట్టుబడులే రావు అన్న తెలంగాణకి వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఉత్తమ్‌ ‌కుమార్‌.. ‌రోజూ మాపై ఆరోపణలు చేస్తుంటారని… మిరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో లెక్కలు చూపాలని సవాల్‌ ‌విసిరారు. సిలిండర్‌, ‌పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరిగితే ఇదే మోడీ… మన్మోహన్‌ ‌సింగ్‌ ‌పై దుమ్మెత్తి పోశారని…మరి ఇప్పుడు ధరలు రెట్టింపు అయ్యాయని, ఇప్పుడు ఎవరిని అనాలని చురకలు అంటించారు. ఏమైనా అంటే… దేశం కోసం ధర్మం కోసం అంటారని.. పొద్దున లేస్తే… మతం కులం అంటారని ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌. ‌విశాఖ హక్కు…ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేశారని… విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉందన్నారు. వీలైతే… వైజాగ్‌ ‌వెళ్లి ఉద్యమంలో పాల్గొంటామని.. పోరాటంలో కలిసి ఉంటామని హామి ఇచ్చారు.

Leave a Reply