Take a fresh look at your lifestyle.

వ్యవసాయ ప్రణాళికను త్వరితగతిన రూపొందించాలి

ఖమ్మం,మే 25 ప్రజాతంత్ర (ప్రతినిధి): గ్రామ వ్యవసాయ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఖమ్మం నగరం టీటీడీసీ భవన్‌ ‌లో నిర్వహించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం 2020 సాగు ప్రణాళిక మరియు నియంత్రిత వ్యవసాయ సాగు విధానం జరిగిన అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ, మార్కెటింగ్‌, ఎన్‌ఎస్పి, ఇరిగేషన్‌, ‌సివిల్‌ ‌సప్లైస్‌ అధికారులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి పువ్వాడ హాజరై మాట్లాడారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంటల విధానంను అధికారులు అమలు జరపాలన్నారు. గ్రామాలలోని రైతుల వద్దకు వెళ్లాలని ప్రతి రోజు ప్రతి విస్తరణాధికారి రైతులను కలవాలని, నూతన సాగు విధానంపై అవగాహన కల్పించి, వానాకాలంలో లాభసాటి, అధిక దిగుబడి, డిమాండ్‌ ఉన్న పంటలను పండించే విధంగా ప్రోత్సహించాలన్నారు. సప్లై డిమాండ్‌ ‌మధ్య సమన్వ యం చేయాలని, మార్కెట్‌ ‌డిమాండ్‌ ‌కి అనుగుణంగా రైతులు వంటలు పండించే విధంగా వారికి తగు సూచనలు చేయాలన్నారు. అదేవిధంగా కూరగాయలు సాగును ప్రోత్సహించాలని తెలిపారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న నూతన పంట సాగు విధానం అమలు చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధుల పై ఉందని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేందుకే ముఖ్యమంత్రి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సన్నరకం వరి సాగుకు ప్రధమ ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

కంది ,పత్తి పంటల విస్తీర్ణం పెంచి రైతుకు లాభం చేకూరేలా చూడాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్ని ఎకరాల్లో ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలనే దానిపై నివేదిక తయారు చేయల న్నారు. ఖమ్మం జిల్లాలో వరి-2,30,000 ఎకరాలు, రెడ్‌ ‌గ్రామ-10,000 ఎకరాలు, గ్రీన్‌ ‌గ్రామ(పెసర) 22,000 ఎకరాలు, బ్లాక్‌ ‌గ్రామ-320 ఎకరాలు, వేరుశెనగ-850 ఎకరాలు, మిర్చి-51,150, జొన్నలు-100 ఎకరాలు మొత్తం 3,14,420 ఎకరాలలో సాగు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారని వివరించారు. అందుకు సరిపడు విత్తన లభ్యత కోసం అధికారులు తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సంబంధిత క్లస్టర్లలో గ్రామాలకు వెళ్లి రైతులు వేసే పంటలు, వేయాల్సిన వాటిపై సమాచారం తీసుకుని, జిల్లా వ్యవసాయ కార్డు ప్రణాళిక ప్రకారం సాగు వివరాలను జిల్లా వ్యవసాయ శాఖకు నివేదిస్తారు. ఒక్కో క్లస్టర్‌లో 5 వేల ఎకరాలు ఉన్నాయని పేర్కొన్నారు. వ్యవసాయంకు ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్‌, ‌రూ.5 వేల రైతుబంధు, ఎరువులు, సాగునీటి వసతి, విత్తనాలు అందిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఒకప్పుడు పండిన పంట తినడానికి సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు పంట దిగుబడులను నిల్వ చేసుకోవడానికి గోదాములు సరిపోవడం లేని పరిస్థితులు నేడు వచ్చా యని అన్నారు. అందుకు ప్రభుత్వ సరిపడు గోదాముల నిర్మించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ కార్యక్ర మాలను ప్రవేశపెట్టారని చెప్పారు. వాన కాలంలో జిల్లాలో మొక్కజొన్న సాగు చేయొద్దని, వాన కాలంలో మొక్కజొన్న పంట దిగుబడి తగ్గి ఖర్చులు అధికం కావడంతో రైతుకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేందుకే ముఖ్యమంత్రి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సన్నరకం వరి సాగుకు ప్రధమ ప్రాధాన్య మివ్వాలని సూచించారు. కంది ,పత్తి పంటల విస్తీర్ణం పెంచి రైతుకు లాభం చేకూరేలా చూడాలన్నారు.

రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేస్తున్న నూతన పంట సాగు విధానం అమలు చేయాల్సిన గురుతర బాధ్యత అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధుల పై ఉందని అన్నారు. జిల్లాలో 3,18,000 మెట్రిక్‌ ‌టన్నుల వరికి గాను రూ. 354 కోట్లు, 1,48,886 మెట్రిక్‌ ‌టన్నుల మొక్కజొన్నలకు గాను రూ.80 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించి ప్రభుత్వం ధాన్యం సేకరించడం జరిగిందన్నారు. రికార్డ్ ‌స్థాయిలో సేకరించడం జరిగిందని అందుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ‌మార్కుఫెడ్‌ ‌డిఎంలను శాలువా కప్పి సత్కరించారు. జిల్లాలో పంటల సాగు విషయమై దశ-దిశ నిర్దేశించుకుని క్షేత్ర స్థాయిలో రైతులతో అమలు చేయాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితి ప్రతినిదులు, వ్యవసాయ అధికారులు ఆయా గ్రామ, మండల స్థాయి ప్రతినిధులదే అని అన్నారు. జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలకు కేటాయించిన స్థలం అనుకూలంగా ఉన్నది లేనిది వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎంపీపీ పరిశీలించాలని, త్వరితగతిన నిర్మాణాలు జరిగేలా దృష్టి సారించాలని సూచించారు. నాలుగు మాసాలలో గా రైతు వేదికల నిర్మాణాలు జరగాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జడ్పీ చైర్మన్‌ ‌లింగాల కమలరాజ్‌ , ‌జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ , ‌విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌ ‌కొండబాల కోటేశ్వరరావు, జిల్లా రైతు బంధు కన్వీనర్‌ ‌నల్లమల వెంకటేశ్వర రావు , ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్‌ , ‌కందాల ఉపేందర్‌ ‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ ‌కురాకుల నాగభూషణం, మార్కుఫెడ్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ ‌రాజశేఖర్‌లు ఉన్నారు

Leave a Reply