- శ్రీలంక విద్యుత్ కాంట్రాక్టుల్లో అవినీతిపై దృష్టి మరల్చడానికే ‘అగ్నిపథ్’
- ప్రధాని మోడీ తీరుపై మరోమారు మంత్రి కెటిఆర్, టిఆర్ఎస్ విమర్శ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : శ్రీలంక పవన విద్యుత్ కాంట్రాక్టుల్లో మోదీ, అదానీ అవినీతి బంధంపై దేశం దృష్టిని మరల్చడానికే అగ్నిపథ్ స్కీమ్‌ను ప్రకటించారా అని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. అగ్నిపథ్ స్కీమ్‌ను సమర్థిస్తున్న కేంద్ర మంత్రులపై కూడా కేటీఆర్ మండిపడ్డారు. అగ్నిపథ్ పథకం యువతకు డ్రైవర్లు, ఎలక్టీష్రియన్లు, బార్బర్లు, వాషర్‌మెన్‌గా ఉపాధి కల్పించడంలో సహాయపడుతుందని చెప్పడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. అగ్నివీర్లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తామని మరో కేంద్ర మంత్రి చెప్పడాన్ని కూడా కేటీఆర్ తన ట్వీట్లో ప్రశ్నించారు. మోదీని అర్థం చేసుకోలేదని వి•రు యువతను నిందిస్తున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక యువత ఆశల్లో నీళ్లు చల్లే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన వి•డియాతో మాట్లాడారు. దేశ సైనికులను బలహీన పరిచే విధంగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారని, దీన్ని దేశవ్యాప్తంగా సైనికులు, యువత వ్యతిరేకిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కేవలం నాలుగు సంవత్సరాలే పని చేయించుకొని ఆ తర్వాత పదవీ విరమణ ఇవ్వడం సరైంది కాదన్నారు. దేశ రక్షణ విభాగం ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు. అలాంటి పథకాన్ని ప్రధాని మోదీ తీసుకురావడం దురదృష్టకరమన్నారు. భేషజాలకు పోకుండా ఈ పథకంలో కొన్ని మార్పులు చేసి యువత కు ఉపయోగపడే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 40 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేంద్రానికి అప్పగించిందని ఆ భూములను కేంద్రం అమ్మేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు.
రాష్ట్ర భూములను అమ్మే హక్కు కేంద్రానికి లేదని చెప్పారు. మోదీ తీసుకు వొచ్చే పథకాలు ప్రజా వ్యతిరేకంగా ఉంటున్నాయని, గతంలో వ్యవసాయ చట్టాల తీసుకొచ్చి వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు యువతకు నష్టం చేకూర్చే విధంగా అగ్నిపథ్ పథకం తీసుకోవడం సరికాదన్నారు. రాహుల్ గాంధీపై కేంద్రం ఈడీ కేసులు పెట్టినా కాంగ్రెస్ నాయకత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు. కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం లో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. మిర్యాలగూడ వి•దుగా వెళ్లే నారాయణాద్రి, నర్సాపూర్, విశాఖ, చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను మిర్యాలగూడలో నిలుపుదల చేసేందుకు ఉన్నత అధికారులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. మీడియా సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర కోటేశ్వరరావు, చీమల మల్లయ్య యాదవ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, బాసాని గిరి, ఇలియాజ్, షోయబ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.