Take a fresh look at your lifestyle.

‌ప్రమాదం ఇంకా పొంచి ఉంది ..!

కొరోనా  థర్డ్‌వేవ్‌ ‌భయాలు ఇంకా తొలగకముందే ఫోర్త్‌వేవ్‌ ‌భయాలు మరింతగా భయాందోళనలను కలిగించేవిగా ఉన్నాయి. గత వారం పదిరోజుల్లో కేసులు పెరుగుతున్న తీరు మరోమారు ఆందోళనకరంగా ఉంది. ముందు జాగ్రత్తలే మందు అని నిఫులు, వైద్యారోగ్య శాఖ హెచ్చరికలు చేస్తున్నా..ప్రజల నిర్లక్ష్యం తోడు కావడంతో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కొరోనా  కేసుల సంఖ్య దేశంలో 13వేలు దాటింది. కొత్తగా నమోదవుతున్న వేరియంట్‌ ఏదన్నది ఇంకా చెప్పలేక పోయినా..కొరోనా  మహమ్మారి పీడ ఇంకా విరగడ కాలేదన్నది మాత్రం సత్యం. మనమెంత అజాగ్రత్తగా ఉంటే అంత స్పీడుగా ఇది వ్యాప్తి చెందగలదని ఇప్పటికే అనుభవంలోకి వచ్చింది. దీని తీవ్రత కూడా ఎక్కువే ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొరోనా  పీడ పోయిందని అందరూ మాస్కులు తీసేసి ఆహ్లాదంగా విహరిస్తున్న వేళ మళ్లీ ఆ మహామ్మారి కోరలు చాస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో అనేక ప్రాంతాల్లో మళ్లీ వ్యాప్తి చెందుతోంది. దేశంలో ప్రతి రోజు గడిచేకొద్దీ దాదాపు 3000 నుంచి 4000 కొత్త కేసులు భయంకరంగా విస్తరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనేకదేశాల్లో కొరోనా  వైరస్‌ ‌రూపాంతరం చెంది మరింత శక్తివంతంగా మారి వేరియంట్లుగా విరుచుకుపడుతోంది. వైరస్‌లు ఎల్లప్పుడూ రోగనిరోధక శక్తి నుండి తప్పించుకోవడానికి కొత్త రకాలుగా మారుతుంటాయి. కొత్త రకం వైరస్‌లుగా మారి దాడి చేస్తుంటాయి. ఓమిక్రాన్‌ ‌గా మారిన తర్వాత కొరోనా  మరిన్న ఉప-వైరస్‌ ‌రకాలుగా మారింది. డెల్టా వంటి ఇతర రూపాంతరాలు అందించిన దానికంటే ఒమిక్రాన్‌  ‌తీవ్రత తక్కువగా ఉంది. ఎర్గో రీఇన్ఫెక్షన్‌ ‌విషయంలో ఇది సర్వసాధారణంగా మారింది.

ప్రస్తుతం వ్యాక్సిన్లు వేయడంతో దేశం మొత్తం కొరోనా  నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ప్రతిరోధకాలను కలిగి ఉండటం వల్ల ఒక వ్యక్తికి వ్యాధి సోకదని అర్థం కాదు. ఇప్పటికి మొదటి రెండవ,మూడవ వేవ్‌ ‌లను దేశం ఎదుర్కొంది. మూడో వేవ్‌ ‌పెద్దగా ప్రభావం చూపలేదు. అదేవిధంగా తదుపరి వేవ్‌ ‌మనల్ని తాకుతుందని భావిస్తున్నారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఈ వర్షకాలం సీజన్‌ ‌లోనే అది విజృంభించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే మూడు వేవ్‌ ‌ల నుండి అనుభవించిన బాధలను పరిగణనలోకి తీసుకుంటే కేవలం నాలుగోవేవ్‌ ‌విస్తరణ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.ఇంతలో రోజువారీ కోవిడ్‌ -19 ‌కేసులు అకస్మాత్తుగా పెరగడం వల్ల తెలంగాణ ఆరోగ్య శాఖ ఫేస్‌ ‌మాస్క్.. ‌భౌతిక దూర నిబంధనలను తిరిగి విధించింది.

తెలంగాణలో ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ ‌ధరించాలి. ఫేస్మాస్క్లు కోవిడ్‌-19‌కి వ్యతిరేకంగా రక్షణలో మొదటి నిరోధకాలుగా ఉన్నాయి. హాస్పిటల్‌ ‌లో చేరే కొరోనా వైరస్‌ ‌రోగుల సంఖ్య ఇంకా తక్కువగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని అధికారులు హా ఇచ్చారు. అయితే ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలని మరియు అన్ని భద్రతా నిబంధనలను పాటించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇకపోతే ఏ వేరియంట్‌ అయినా జాగ్రత్తలు తీసుకుంటే దరిచేరదని కూడా సూచిస్తు న్నారు. ఈ క్రమంలో మనమంతా జాగ్రత్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఇకపోతే ప్రజలు ఎవరికి వారు అప్రమత్తంగా ఉండడం జీవితంలో అలవాటు చేసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతికి దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కో వడం దైనిందిన జీవితంలో భాగం కావాలని హెచ్చరిస్తున్నారు.

ఎందుకంటే ఫస్ట్,‌సెకండ్‌, ‌వేవ్‌లో ప్రజల నిర్లక్ష్యమే కొంపముంచింది. అదృష్టమున్న వారు బతికి బట్ట కట్టారు. లేనివారు దిక్కులేని చావు చచ్చారు. నిజానికి సెకండ్‌వేవ్‌లో కరోనా వ్యాప్తి కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కొరోనా రెండో దశలో ఆక్సిజన్‌, ఇతర వైద్య సదుపాయాల కొరత కారణంగానే దాదాపు 90 శాతం మరణాలు సంభవిం చాయని, వైరస్‌ ‌మూడో దశ వ్యాప్తికి సంబంధించి వైద్య నిపుణుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో..మోడీ సర్కార్‌ ఈసారైనా అప్రమత్తంగా ఉండాలని, అన్నివిధాలుగా ముందస్తు సిద్ధంగా ఉండాలని సూచించారు. కొరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో పాటు దేశంలో కొరోనాను నియంత్రిం చేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించాలి. ఇప్పటి వరకు చేసిన తప్పులను నాలుగోదశపై సన్నద్ధత సమయంలోనైనా సరిచేసుకుంటే మంచిది. ఫస్ట్, ‌సెకండ్‌ ‌వేవ్‌లతో పోల్చుకుంటే ఇప్పుడే డేంజర్‌ ‌బెల్స్ ‌మోగకున్నా..

దేశంలో కొరోనా విజృంభణ ఆందోళనకరంగా తయారయ్యింది. కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎవరికి కొరోనా సోకుతుందో అన్న ఆందోళన మళ్లీ కలుగుతోంది. అనేకమంది ప్రముఖు లకు కొరోనా సోకడం వారు,హాస్పిటల్‌ ‌ల్లో చేరడంతో సామాన్యులు తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఇటీవల సోనియా, ప్రియాంక,కేంద్రమంత్రి స్మ•తి ఇరానీతో పాటు క్రికెటర్లకు కూడా కరోనా సోకింది. అలాగే మహారాష్ట్ర సిఎం ఉద్దవ్‌ ‌థాకరే, ఆ రాష్ట్ర గవర్నర్‌ ‌కూడా కొరోనా బారిన పడ్డారు. దీనికి సరైన మందులు లేకపోవడంతో ఎప్పుడెలా ఉంటుందో అన్న భయం వెన్నాడు తోంది. కొరోనా వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వారికి సైతం మళ్లీమళ్లీ వస్తోంది.  తాజాగా వెలువడ్డ నిరోధక మందుల పరీక్షలు జరిపి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలి.

అప్పుడే కొరోనా నివారణకు అవకాశం ఏర్పడ గలదు. ప్రజాప్రతినిధులు కొరోనా బారిన పడడం వారు ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌ల్లో చేరడంతో ప్రభుత్వ దవాఖాన ల పై ప్రజల్లో విశ్వాసం లేకుండా పోతోంది. ఇక దేశంలో పని ప్రదేశాల్లో రక్షణ లేకుండా పోయింది. కొరోనా వైరస్‌ ‌మరింత పేట్రేగుతున్నదని గత కొన్ని రోజులుగా వెలువడుతున్న గణాంకాలు చెబుతు న్నాయి. థర్డ్ ‌వేవ్‌లో కొత్తగా బయటపడే కేసుల సంఖ్య అపారంగా పెరగడమే కాదు…మరణాల రేటు కూడా అంతే మొత్తంలో పెరుగుదల కనిపించింది. అయితే ప్రజల అప్రమత్తే కావచ్చు…ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలే కావచ్చు కొరోనా కేసులు ప్రస్తుతతానికి అయినతే తక్కువే నమోదు అవుతున్నాయి.

ఈ క్రమంలో ఫోర్త్‌వేవ్‌ ఉం‌టుందని ముందునుంచే హెచ్చరిస్తున్నారు. గత నాలుగైదు నెలలుగా కొరోనా వైరస్‌ ‌తీవ్రత తగ్గిన కారణంగా ఆలయాలు తెరుచుకోవడంతో పలుప్రాంతాల్లో ప్రజలు గుంపులుగా బయలుదేరుతున్నారు. పెళ్లిళ్లు, పండగలు, జాతరలు అన్నీ ఇప్పుడు సాధారణంగా సాగుతున్నాయి.  మొత్తంగా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే  కొరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉందని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. టెస్టుల సంఖ్య పెరగడం వల్ల ఫలితాలు గతంలో కన్నా త్వరగా బయటకు వస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే వైద్యపరంగా మనం ఎంతో పురోగతిని సాధించాం. నిరంతరాయంగా పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి, వారిని వేరు చేయడం ఒక్కటే ఈ మహమ్మారిని అరికట్టడాని కున్న ఏకైక మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదట్లోనే చెప్పింది.

కానీ మన దేశంలో కొరోనా పరీక్షలు విస్తృతంగా సాగటం లేదు.పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలు, వేడుకలు వంటివాటికి దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నా అది అమలు కావడం లేదు. పిల్లలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళనలు ఉన్నందున కేంద్ర,రాష్టాల్రు మరింత అప్రమత్తంగా ప్రజలను తరచూ హెచ్చరిస్తూ ఉండాల్సిందే. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ ‌తీసుకుని, జాగ్రత్తగా ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply