Take a fresh look at your lifestyle.

రాష్ట్రంలో.. దుర్మార్గమైన పాలన సాగుతోంది

  • టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి ఆగ్రహం
  • ఎక్కడికక్కడే నేతల అరెస్ట్‌తో దీక్షలకు బ్రేక్‌
  • ‌సర్కార్‌ ‌తీరుపై ఉత్తమ్‌ ‌తదితరుల ఆగ్రహం
  • అవతరణ దినోత్సవాన  కెసిఆర్‌ ‌జులుం అంటూ నేతల మండిపాటు

పెండింగ్‌ ‌ప్రాజెక్ట్‌ల వద్ద కాంగ్రెస్‌ ‌నేతలు తలపెట్టిన దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తు చర్యలో భాగంగా పలువురు కాంగ్రెస్‌ ‌నేతలను పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేసారు. హైదరాబాద్‌లో ఎంపీ కోమటిరెడ్డిని హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. అలంపూర్‌ ‌శాంతినగర్‌లో సంపత్‌ ‌కుమార్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డిని ఇప్పటికే హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్‌ ‌నేత నాగం జనార్ధన్‌రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగం బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఆ తరువాత జానర్ధన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. పెండింగ్‌ ‌ప్రాజెక్టులకు నిధుల కేటాయించాలంటూ జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్‌ ‌నేతలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కాంగ్రెస్‌ ‌నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్ట్‌లు చేస్తున్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ ‌సభ్యుడు రేవంత్‌ ‌రెడ్డిని కొడంగల్‌లో హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. హైదరాబాద్‌లో ఎంపీ కోమటిరెడ్డిని హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. అలంపూర్‌ ‌శాంతినగర్‌లో సంపత్‌కుమార్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. అలాగే ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్‌రెడ్డిని ఇప్పటికే హౌస్‌ అరెస్ట్ ‌చేశారు. అంతేకాకుండా పొన్నాల లక్ష్మయ్య ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. అంతేకాకుండా పొన్నాల లక్ష్మయ్య ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించి ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో కృష్ణానదిపై పెండింగ్‌ ‌ప్రాజెక్ట్ ‌వద్ద నిరసన కార్యక్రమాలకు, జలదీక్షలకు కాంగ్రెస్‌ ‌పార్టీ పిలుపునిచ్చింది. నీళ్లు, నిధులు, నియమకాల ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పనిచేయడం లేదని కాంగ్రెస్‌ ‌నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా నీళ్ల పేరిటి ఉద్యమాన్ని చేసినప్పటికీ అదే నీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ప్రధానంగా కృష్ణా నదిపై కట్టిన ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు విస్తీర్ణాన్ని పెంచి జలాలను తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసీఆర్‌ ‌స్పందించిన తీరు సరిగా లేదంటూ ఈరోజు పెండింగ్‌ ‌ప్రాజెక్టుల వద్ద నిరసన దీక్షలు చేయాలని నిర్ణయించింది. కాగా ఈ దీక్షలకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ దీక్షల విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం నుంచే కాంగ్రెస్‌ ‌నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌజ్‌ అరెస్ట్‌లు చేసారు. అరెస్టులను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు కాంగ్రెస్‌ ‌పార్టీ నేతలను గృహ నిర్భంధం చేయడం అప్రజస్వామికమని ఇంతకమటే దారుణం మరొకటి ఉండదన్నారు. మంగళవారం జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్‌ అరెస్టు చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై ఉత్తమ్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ పార్టీ నాయకుల ఇళ్ల ముందు నుంచి పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని డిమాండ్‌ ‌చేశారు. శాంతియుతంగా తాము చేసుకునే కార్యక్రమాలను అడ్డుకోకూడదని ఉత్తమ్‌ అన్నారు. మాట్లాడితే అరెస్టులు చేయడం పాశవిక పాలనకు పరాకాష్ట అని, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకుంది అని ప్రశ్నించారు. ఆవిర్భావ దినోత్సవం రోజు హక్కులు కాలరాస్తే ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఒక నియంత, అసమర్థత పాలన సాగుతోందని విమర్శించారు. ••ష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నేతల హౌస్‌ అరెస్ట్‌లను కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖండించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) దగ్గర దీక్షా కార్యక్రమం రద్దు చేసుకొని సందర్శనకు మాత్రమే వెళదామని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు ఇళ్ల ముందు నేతలను అరెస్ట్ ‌చేయడం దారుణమన్నారు. కేసీఆర్‌ ‌నియంత పోకడలకు ఈ అరెస్ట్‌లు నిదర్శనమన్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున కాంగ్రెస్‌ ‌పార్టీ జలదీక్షకు సిద్దమైన విషయం తెలిసిందే.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!