Take a fresh look at your lifestyle.

‘‘అం‌తా మా యిష్టం’’!…

ఎవ్వలనైనా సూపు తిప్పియచ్చు గని సదువుకునే పోరల్లు ఇంతాంతోళ్ళు కాదాయె! ఛల్‌! ‌కానూన్‌ ‌జేత్తె మాత్రం కండ్లు మూసుకోమ్మంటె ఎట్లని మర్లవడేకాడికచ్చి యునీవర్సిటీలన్ని బగ్గుమనె! చీమలే కదా అని పుట్టలేలుబెట్టి బస్తీ మే సవాలన్న  పాముకేంఎరుకయింది. బుద్దున్నోడెవడు పుట్టలేలు బెట్టుడు లాంటి బేకార్‌ ‌పని ఇంకోపాలి జేయద్దన్న ఇగురం సమజయింది. షెరిత్ర సదివినోళ్ళెవలు సూత కాలేజ్‌ ‌పోరల్ల జోలికి పోరు. పోతేవేతైది? యవ్వారం రొచ్చురొచ్చైతది. దునియాల జరిగిన ఇప్లవాల షెరిత్రంత ఇడమరిషి షెప్పిన సారమిదె! గాళ్ళు పాదరసం లాంటోళ్ళు, కదిళ్ళిండ్లంటే లచ్చలమందిని కదిలిత్తరు.
bheetalఎజెండాల్లేని జెండాలుండయి. బయటికి కానచ్చేటియే కాదు కాన్రాకంట సూతుంటయి. కానచ్చేటియి మొకానికి ఫౌడరు బూసుకోని ఇకిలించుకుంట గోడెక్కిన బ్యానరైతది. వందల యేళ్ళసంది దాషిపెట్టిన ఏంకాకుంట ఓపిక తోనుంటయి. గద్దె నెక్కినంక ఎలుగు జూషే గీ ఎజెండాలు ఎవ్వల్లకు ఔపడయి. ఏయే జెండాకు ఎట్లాసొంటి చీకటి ఎజెండాలున్నయనే సంగతి ఆ జెండాల పోకడలు జర్రంత జెపుతయి, గావచ్చుగని, గవాటి దొండాకు పసరు సూడగలిగేటోళ్ళనే మనం బుద్దిజీవులంటానం. సర్కార్‌ ఇం‌కో పేరుతోని పిల్వబట్టె ‘‘అర్బన్‌ ‌నక్సలైట్‌’’ అని తెలిషెటట్టే ముద్రేయవట్టె!. అష్టచెమ్మాటల పాము కాయను మింగుతది గని రాజకీయాలల్ల కాయే పామును మింగి మూతి తుడుసుకుంటది. గీ ఇగురం తెల్షినోళ్ళు గాబట్టే దేశపటం మీద ముగ్గుపోషి పరివార్‌ ‌ముసుగుల పెట్టుబడోళ్ళు ఆడే అష్టచెమ్మాట ఆగం జేసుడు కతేనని జెప్పబట్టిండ్లు. సంఘ్‌ ‌పరివారోళ్ళు తెచ్చిన కానూన్లను ఖబర్దారని నిలేయబట్టిండ్లు. బయిటికి కానచ్చే మతం రంగు మాటలన్ని మందిని ఓట్లుగ మడుత బెట్టే పనిలున్నయి. అసలు సిసలు ఆటలన్ని ప్రయివేట్‌ ‌పెట్టుబడోళ్ళుగ వాళ్ళకున్న ఇంకో అవతారం సంగతి బయటపడకుంట వాళ్ళ పని వాళ్ళు జేసుకునుడే. పాతనోట్లు పాతరేషిన కాన్నించి ‘‘రాబరీ హుడ్‌’’ ‌తీర్గ సర్కార్‌ ఆస్తులు దివాలు దీయించి పెట్టుబడోళ్ళ గాబులు నింపబట్టె. ఏడ్స్ ‌రోగమచ్చి ఎండుక పొయినోని తీర్గ దేశం గుళ్ళయింది. సళ్ళుబిగి లేకుంట కార్మిక చట్టాలన్నింటికి బొందబెట్టింది. కార్మిక రంగంల ప్రయివేటోళ్ళ చేతికి తాళాలపజెప్పింది. సర్కారీ ఫోన్లు, రైళ్ళు, ఇమానాలు, బ్యాంకులు మొత్తం ప్రయివేట్‌ ‌దందాలకు అప్పజెప్పే పని ఖతం జేషింది. ఇంకా ఇజ్జత్‌ ‌పోయేపనేందంటె దేశాన్ని కాపాడే రక్షణ శాఖను సూత గిదే దందాలకు అప్పజెప్పె. బీమాశాఖ, ఆయిల్‌ ‌రంగం మొత్తం ‘‘ఖేల్‌ ‌ఖతం! దుకానం బంద్‌’’‌కాడికి తెచ్చినంక మిగిలిందేం లేదు.
గిట్ల లోపలి ఎజెండా ఎసోంటి ఎటమటం జేషి దేశంల గత్తర లేపిండ్లు. బయటికి కానచ్చే ఎజెండా ఓటి ముందుకు తేవాలే కాబట్టి దేశం గోడ మీద మతం బ్యానరెక్కించ్చిండ్లు. పౌరసత్వం చట్టం ముందుకు తెచ్చి జనం సూపు అటు మొగాన తిప్పిండ్లు. మూడు దేశాల నుంచి బతకచ్చిన ఆరుమతాలోళ్ళకు పౌరసత్వమిచ్చేందుకు అని జెప్పుకుంటనే అండ్ల మతం రంగు పులిమి అగ్గి రాజేషిండ్లు. జనం మర్లబడే కతైదని తెల్వందా గని దునియా మొత్తం అటు మొగాన తిరిగి సరికె పబ్లిక్‌ ‌రంగం దివాలు దీయించే ఇగురం ముచ్చట సల్లబడ్డది.ఎవ్వలనైనా సూపు తిప్పియచ్చు గని సదువుకునే పోరల్లు ఇంతాంతోళ్ళు కాదాయె! ఛల్‌! ‌కానూన్‌ ‌జేత్తె మాత్రం కండ్లు మూసుకోమ్మంటె ఎట్లని మర్లవడేకాడికచ్చి యునీవర్సిటీలన్ని బగ్గుమనె! చీమలే కదా అని పుట్టలేలుబెట్టి బస్తీ మే సవాలన్న పాముకేంఎరుకయింది. బుద్దున్నోడెవడు పుట్టలేలు బెట్టుడు లాంటి బేకార్‌ ‌పని ఇంకోపాలి జేయద్దన్న ఇగురం సమజయింది. షెరిత్ర సదివినోళ్ళెవలు సూత కాలేజ్‌ ‌పోరల్ల జోలికి పోరు. పోతేవేతైది? యవ్వారం రొచ్చురొచ్చైతది. దునియాల జరిగిన ఇప్లవాల షెరిత్రంత ఇడమరిషి షెప్పిన సారమిదె! గాళ్ళు పాదరసం లాంటోళ్ళు, కదిళ్ళిండ్లంటే లచ్చలమందిని కదిలిత్తరు. రాజ్జాంగాన్ని కాపాడుకునే పనిలుండుకుంటనే సదువుల సంగతిని సూసుకునేటోళ్ళు, వాళ్ళనెకబడ్డ ఏలికలెవ్వరు పైలంగున్న షెరిత్ర లేదు. విశ్వవిద్యాలయాలే ప్రపంచగతిని యేతోవల బోవల్నో యేలుబట్టి నడిపిచ్చే రోజులని యాది మరిషే ఏలికలకు ‘‘ఘోష్‌’’ ‌మొగులు నుంచి రాలి పడ్డ ఉరుమే ఎలుగుల మెరుపని తెలిషచ్చింది. వణికే సలిని లెక్కజేయకుంట దేశవంత ఇండియా గేటు కాడ నినాదమై ఆమె తోడుండినంకనన్న ఏలికలకు సోయి రాకుంటె యెట్ల? జామియామిలియా, జేఏన్యూల విశ్వవిద్యాలయాల కాలేజ్‌ ‌పోరల్ల రక్తం తాగే పనిలబడ్డ దాడుల మీద నోర్మెదపకుంట సర్కార్‌ ఇచ్చంత్రం చేయబట్టె!. సర్కార్‌ ‌యే కానూనన్న జేయనీ గాక అది రాజ్యాంగం లెక్కకున్నదా! లేదా! అని అర్సుకునే హక్కు ఈ దేశంల పుట్టినోళ్ళెవరికైనా బాజప్తా వుంటది.
bheetalఇప్పుడు సర్కార్‌ ‌చేసిన చట్టాలు రాజ్యాంగంల జెప్పిన దానికి వుల్టా వున్నది, ప్రజలను మతం పేరుతోని ఇడదీసుడెక్కడిదని దేశమంత రోడ్డెక్కినా సూత సర్కార్‌ ‌చెవుమీద పేను బార్తలేదాయే! ప్రశ్నించేటోళ్ళందరికి ‘‘అర్బన్‌ ‌నక్సలైటని’’ ముద్రేషి జేలుకు తోలబట్టె!’’సారూ! యేందిది’’? అని ఉత్తరం ముక్క రాసుడు సూత నేరమయిందియ్యాల! గీ మద్దెన ఎలచ్చన్లల్ల గాచారం బాగలేక నాలుగైద్దిక్కుల యవ్వారం బెడిషికొట్టిందన్న భయం కడుపుల జొచ్చి గీతీర్గ గాయ్‌ ‌గాయ్‌ ‌జేత్తాండ్లని కొందరనబట్టె. ఢిల్లీల ఫైటింగ్‌ ‌జోరు యేంజేత్తదో జూడాలె మరి! అసంతృప్తితోని మర్లవడితె సంఘ పరివారం ఎప్పటి సందో నేర్సుకున్న విద్దెలను బయటికి తీషి జూపెడ్తాండె! ఏకంగ ముసుగులేసుకోని రాత్రిపూట కాలేజి పోరల్లను మస్త్ అర్సుకున్నరు. ఎవలో కాదు, గా ముసుగులు మాయేనుల్లా! జర్రంత కమశిక్షణ లేనట్టనిపిత్తె మేమే గట్టిగ అర్సుకున్నం, మళ్ళ మళ్ళ సూత అర్సుకుంటం ! అని పేసఱ బుక్కుల జెప్పినంక అంత బరువాత బాగోతమే ఆయె! అయినా సూత సర్కార్‌ ఎవ్వలిమీద కేసు బెట్టాల్నో మాగనే సోంచాయించింది. ఇయ్యర మయ్యర దెబ్బలు తిని కాళ్ళు జేతులిరిగిన కాలేజ్‌ ‌పోరల్ల ఆధ్యెక్షురాలు ఘోష్‌ ‌మీద వున్నయి లేనియి కేసులన్ని బెట్టి ‘‘నాయం’’ జేషె! అనుమానాల్లేకుంట పౌరసత్వపు బిల్లు బిల్కుల్‌ అమలుకచ్చిందని తారీఖును సూత పేపర్లకిచ్చె! అయ్యా! ఈ దేశం పౌరున్ని! అని ఏ కాయితం సూపకుంట లచ్చల మంది మిగులుతె గిట్ల గవాళ్ళందిరిని ఏషేందుకు ఏంతగనం జేలుఖాన్లు గట్టియాల్నో ! నాజీల కాలంల గిట్నే వుండేదట! గట్లాసొంటి క్యాంపులు కట్టిచ్చే పని మీదున్నది సర్కార్‌. ‌
సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా గద్దెనెక్కినోళ్ళు వాళ్ళ వాళ్ళ ఎజెండాలు అమలు సంగతి జూసుకుంటె జనం అసంతృప్తులు, అభిప్రాయాలకు విలువ లేదన్నట్టేనా!? పబ్లిక్‌ ‌రంగాన్ని దివాలదీయించి, ప్రయివేట్‌ ‌దోపిడి పెంచెటోళ్ళెట్ల దేశభక్తులయితరో జెప్పాలె! గీ ప్రశ్నలకు జవాబులు జెప్పకుంటె నిన్ను ఇడిషిపెట్టి మళ్ళ చెట్టెక్కుతనని బెదిరిచ్చే భేతాళ్‌ ‌తోని’’ ఇను భేతాళ్‌! ‌బలం, బలుగం బాగుంటె యేం జేషినా ఎదురుతిరుగెటోళ్ళుండరు! వుంటె గనుక ముసుగేసుకున్న దేశభక్తులు వాళ్ళ పని వాళ్ళు కానిత్తరు. పబ్లిక్‌ ‌రంగం బాగుపడితె జనం లాభపడ్తది, ప్రయివేట్‌ ‌రంగం బాగపడితె మనం లాభ పడ్తం! ‘‘గీయింత తిరకాసు లేకుంట అష్ట చెమ్మాట అడుతాండ్లా ఏలికలు!’’ అని చెప్పుకుంట, చెప్పుకుంట ఎప్పటి లాగనే…నడ్వబట్టిండు…నడ్వబట్టిండు.
Tags: bhetal, antha naa istam, vikramarkudu

Leave A Reply

Your email address will not be published.