Take a fresh look at your lifestyle.

ఆ ‌జీవోను ఉపసంహరించుకోవాలి

ఖమ్మం,మే 14 ప్రజాతంత్ర (ప్రతినిధి): పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.నెం. 203ను వెంటనే ఉపసంహరిం చుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. గురువారం స్థానిక సుందరయ్య భవనంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోతిరెడ్డిపాడుపై ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం జారీచేసిన జి.ఓ.ను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కృష్ణా బేసిన్‌ ‌నీళ్ళ వాడకంలో ఎ.పి. ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తోందన్నారు. ఏకపక్ష జి.ఓ.లు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. కృష్ణా నీటి పంపకాలపై గతంలో ఏ పరిష్కారాలు జరిగాయో, వాటి ప్రకారం ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ సి.ఎం. స్పందించకపోగా, కేంద్రమే స్పందించాల ని టి.ఆర్‌.ఎస్‌. ‌నేతలు డిమాండ్‌ ‌చేయడం వి డ్డూరంగా ఉందన్నారు. జిఓ 203ను ఉపసంహరించుకోవాలని, కేంద్రంపై కూడా ఒత్తిడి తేవాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ ‌మాట్లాడుతూ, 44 వేల క్యూసెక్కుల సామర్థ్యం వున్న పోతిరెడ్డిపాడు కాల్వల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఎ.పి. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని, దీని వల్ల ఖమ్మం జిల్లా తీవ్రంగా నష్టపో యే ప్రమాదముందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదం పెండింగ్‌లో ఉందని, బ్రిజేష్‌ ‌కుమార్‌ ‌ట్రిబ్యునల్‌ ‌తీర్పు వెల్లడించాల్సి ఉందన్నారు. ఆంధ్ర సర్కార్‌ ‌నిర్ణయం వల్ల ఖమ్మం జిల్లాలో తీవ్ర నష్టం జరుగుతుందని, నికర జలాలను కొల్లగొట్టే ప్రయత్నం వెనక్కి తీసుకోవాలన్నారు. సిపిఐ (ఎంఎల్‌-‌న్యూడెమోక్రసీ) జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతంలో పోతిరెడ్డిపాడుపై ముందుండి కొట్లాడిన కెసిఆర్‌ ‌నేడు సి.ఎం. అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లాను ఎడారిగా మార్చే ఎ.పి. నిర్ణయంపై అందరం కలిసి ఒక్కతా టిపైకి వచ్చి పోరాడవల్సిన అవసరముందన్నారు. రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నా రని, ఇరు రాష్ట్రాల సి.ఎం.లు మ్యాచ్‌ ‌ఫిక్సింగ్‌ ‌చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గతంలో ఉన్న అగ్రిమెంట్లను ఉల్లంఘించి ప్రజల ను రెచ్చగొట్టే చర్యలు సరైనవికావని, ఖమ్మం జిల్లా రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఐక్యంగా ఉద్యమం చేద్దామన్నారు. సిపిఐ ఎంఎల్‌-‌న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం) కార్యదర్శి ఎం. గిరి మాట్లాడు తూ, ఎ.పి. ప్రభుత్వంపై రాజకీయపరమైన ఒత్తిడి తెచ్చి జి.ఓ.ను రద్దు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం జారీచేసిన జి.ఓ.203ను వెంటనే ఉపసంహరించుకొనేలా తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. 4 రాష్ట్రాల సమస్య కనుక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసుకున్నామని, ట్రిబ్యునల్‌ ‌నిర్ణయం అమలు చేయకపోవడం, నికర జలాలను తరలించడం సరైంది కాదన్నారు. జిఓ 203ను వెనక్కి తీసుకొని, సమస్య పరిష్కరించు కోవాలన్నారు.ఈ రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమే ష్‌, ‌యర్రా శ్రీకాంత్‌, ‌సిపిఐ జిల్లా నాయకులు అడపా రామకోటయ్య, సిపిఐ ఎం.ఎల్‌. ‌న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఆవుల వెంకటే శ్వర్లు, తాతా సత్యనారాయణ, పోటు సత్యనారా యణ, సిపిఎం రఘునాధపాలెం మండల కార్యద ర్శి ఎస్‌. ‌నవీన్‌రెడ్డి, నర్సింగరావు, సంతోష్‌, ఎస్‌ఎఫ్‌ఐ ‌జిల్లా కార్యదర్శి బాగం హేమంత్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!