Take a fresh look at your lifestyle.

ఆ తప్పు పునరావృతం కాకూడదు

“‌ప్రజల మరియు దేశ ఆర్థిక స్థితి గతులను పరిగణలోనికి తీసుకుంటే లాక్‌డౌన్‌న్ను తప్పించడం మార్గంగా ఉన్నప్పటికి, అన్‌లాక్‌ ‌చేసిన తరువాత కూడా ప్రజలలో, వ్యాపార ప్రదేశాలలో కనబడే నిర్లక్ష్య ధోరణిపై ప్రభుత్వ యంత్రాంగాలు ఉక్కు పాదం మోపాలి. మరియు కొంత కాలం భౌతిక దూరం, మాస్క్, ‌నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. కొన్ని రోజులు అవసరమైతే వ్యాపార సంస్థలను రోజు విడిచి రోజు పూర్తి పని గంటలు నడుపుకునేలా అవకాశం ఇచ్చి ఆ తదుపరి పరిస్థితులను బటి్ట ఆంక్షలు ఎత్తి వేయాలి. ప్రస్తుతంకేసులు తగ్గుతున్నాయంటే, అది కేవలం ప్రజల కదలికలను నియంత్రించడం మూలానే సాధ్యమైందే తప్ప వైరస్బలహీనపడి కాదని గుర్తుంచుకోవాలి.”

కొరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అన్‌లాక్‌ ‌వైపు వెళ్లేందుకు పలు రాష్ట్రాలు దృష్టి పెట్టాయి. అయితే సరిగ్గా ఇలాంటి పరిస్థితి మనం ఈ సంవత్సరం ఆరంభంలో చూశాము. అప్పుడు కూడా కేసులు తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు తీసివేయడంతో ప్రజలు సాధారణ జీవన విధానం వైపు వెళ్లడం, వ్యాపార సంస్థలు , మార్కెట్‌ ‌ప్రదేశాలు, హోటల్స్, ‌సినిమా థియేటర్స్ ఇతర జన సంచార ప్రదేశాలలో పూర్తి నిర్లక్ష్య ధోరణితో ప్రజలు మరియు వ్యాపార సంస్థలు వ్యవహరించడంతో కోవిడ్‌ ‌కేసులు ఒక్కసారిగా మార్చి, ఏప్రిల్‌ ‌నేలలలో ఉదృతం కావడం, భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది.

ఇప్పుడు అమలులో ఉన్న లాక్‌డౌన్‌ ఆం‌క్షల వల్ల వైస్‌సులుసును తెంచడానికి వీలైంది, దానితో కేసులు దిగి వచ్చాయి. ఇప్పుడు మళ్ళి ఒక్కసారిగా లాక్‌డౌన్‌ను బలహీన పరిస్తే వందలలో నమోదవుతున్న కేసులువేలు, లక్షలలోకి వెళ్ళడానికి ఎంతో సమయం పట్టదని మనం గ్రహించాలి. ప్రజల మరియు దేశ ఆర్థిక స్థితి గతులను పరిగణలోనికి తీసుకుంటే లాక్‌డౌన్‌న్ను తప్పించడం మార్గంగా ఉన్నప్పటికి, అన్‌లాక్‌ ‌చేసిన తరువాత కూడా ప్రజలలో, వ్యాపార ప్రదేశాలలో కనబడే నిర్లక్ష్య ధోరణిపై ప్రభుత్వ యంత్రాంగాలు ఉక్కు పాదం మోపాలి. మరియు కొంత కాలం భౌతిక దూరం, మాస్క్, ‌నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. కొన్ని రోజులు అవసరమైతే వ్యాపార సంస్థలను రోజు విడిచి రోజు పూర్తి పని గంటలు నడుపుకునేలా అవకాశం ఇచ్చి ఆ తదుపరి పరిస్థితులను బటి్ట ఆంక్షలు ఎత్తి వేయాలి.

ప్రస్తుతంకేసులు తగ్గుతున్నాయంటే, అది కేవలం ప్రజల కదలికలను నియంత్రించడం మూలానే సాధ్యమైందే తప్ప వైరస్బలహీనపడి కాదని గుర్తుంచుకోవాలి. మరో వైపు థర్డ్ ‌వేవ్‌ అక్టోబర్లో ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి థర్డ్‌వేవ్‌ ‌పిల్లలపైనే ప్రభావం ఉంటుందని, సెప్టెంబర్‌, అక్టోబర్లో వస్తుందని ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కాని, కొలమానాలు కాని లేనందున ఇప్పటి నుంచే కోవిడ్‌ ‌కేసులు మళ్ళి పెరగకుండా అవసరమైన ముందస్తు ప్రణాళికలను రూపొందించాలి, వైరస్‌ ‌రూపాంతరం చెంది మళ్ళీ థర్డ్‌వేవ్‌ ‌రూపంలో రాక ముందే అవసరమైన వైద్య సదుపాయాలను సమకూర్చడం, వాక్సినేషన్‌ ‌వీలైనంత ఎక్కువ జనాభాకు సమకూర్చడం చేయాలి . అప్పుడే మనం భద్రంగా ఉన్నట్టు లేకపోతే లాక్‌ – అన్‌లాక్‌ ‌ప్రక్రియ కొనసాగుతూనేఉండడం, ప్రజలలో ఆరోగ్య మరియు ఆర్థిక సంక్షోభం తలెత్తడం నిరంతరం జరుగుతుంది.

dr-md
డాక్టర్‌ ఎం‌డి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌అం‌డ్‌ ‌ఫైనాన్స్
9492791387

Leave a Reply