Take a fresh look at your lifestyle.

దటీజ్‌ ఆర్‌వీ కర్ణన్‌

కొరోనా మహమ్మారి యావత్‌ ‌ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. స్వీయనియంత్రణే వైరస్‌ ‌కట్టడికి మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కొరోనాపై అవగాహన కల్పిస్తూ ప్రణాళిక బద్ధంగా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌ముందుకు సాగుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేస్తూ, ఇందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు.కొరోనా విపత్తు సమయంలో పేదలకు అండగా నిలుస్తున్నారు. 2020 ఏప్రిల్‌ 5‌న ఖమ్మం పట్టణంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసు నమోదైన తర్వాత అవి ఎనమిదికి చేరుకున్నాయి. కలెక్టర్‌ ‌కర్ణన్‌, ‌వీరి బృందం వెంటనే అ ప్రమత్తమై వైరస్‌ ‌కట్టడి కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పాజిటివ్‌ ‌వచ్చిన బాధితులందరినీ హైదరాబాద్‌ ‌గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరంతా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. గత నెల రోజులుగా ఒక్క పాజిటివ్‌ ‌కేసు కూడా నమోదు కాకపోవడంతో కొవిడ్‌-19 ‌వైరస్‌ను నియంత్రించిన జిల్లాగా ఖమ్మం ఘనత సాధించింది. జిల్లాలోని రెండు రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలు, 584 గ్రామాల్లో కరోనా నియంత్రణ కోసం కలెక్టర్‌ ‌కర్ణన్‌ ‌పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. మూడు ప్రభుత్వ క్వారంట్నెన్‌ ‌కేంద్రాలతోపాటు, ఐసోలేషన్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేసి 1370 పడకలను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 400 బృందాలను ఏర్పాటు చేసి వైరస్‌ ‌నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా కొవిడ్‌-19 ‌శాంపిల్‌ ‌కలెక్షన్‌ ‌యూనిట్‌ను ఖమ్మంలో ప్రారంభించారు. కల్లూరు, పెనుబల్లి, మధిర, బోనకల్లు వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌నేతృత్వంలో పోలీసు కమిషనర్‌ ‌తప్సిల్‌ ఇక్బాల్‌, ‌మున్సిపల్‌ ‌కమిషనర్‌ అనురాగ్‌ ‌జయంతి, అదనపు కలెక్టర్లు నూతి మధుసూదన్‌, ‌స్నేహలత, వైద్యాధికారి మాలతి, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్‌, ‌పారిశుధ్య సిబ్బంది విశేష కృషి చేస్తున్నారు.

గత ఏప్రిల్‌ ‌మాసంలో జిల్లాలో పాజిటివ్‌ ‌కేసులు నమోదు కావడంతో జిల్లాను ఆరెంజ్‌ ‌జోన్‌గా ప్రకటించారు. హాట్‌స్పాట్‌ ‌ప్రాంతాల్లో నాలుగు కంట్నెన్మెంట్‌ ‌జోన్‌లను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో మొబైల్‌ ‘ఏటీఎం’ సౌకర్యాన్ని కల్పించారు. అక్కడి ప్రజలకు వాహనాల ద్వారా ‘డోర్‌ ‌టు డోర్‌’ ‌నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. జిల్లాలో కరోనా వైరస్‌ ‌వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం జిల్లా యంత్రాంగం నడుచుకుంటోంది. రాష్ట్ర సరిహద్దులతోపాటు, జిల్లాలోకి ప్రవేశించే అన్ని ప్రధాన రహదారులను మూసివేశారు. అలాగే లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండడంతో కొత్త కేసుల నమోదు నిలిచిపోయింది. జిల్లాలో కరోనా మరణాలు ఒక్కటి కూడా లేదు. హోం క్వారంట్నెన్‌లో 120 మంది ఉన్నారు. ప్రస్తుతం కంట్నెన్మెంట్‌ ‌ప్రాంతాలన్ని కూడా గ్రీన్‌ ‌జోన్‌ ‌పరిధిలోకి వచ్చాయి. కొవిడ్‌-19 ‌వార్డుల్లో సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ ‌సిబ్బంది కోసం కలెక్టర్‌ ‌రక్షణ కవచాలు అందజేశారు. నిత్యం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అలాగే రెడ్‌జోన్‌లలో కరోనాయేతర వైద్యసేవలు అందిస్తున్నారు. గర్భిణులు, గుండె, క్యాన్సర్‌తోపాటు అత్యవసర చికిత్సలకు అనుమతిచ్చారు. అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. అయితే ఒంటరిగా ఉన్న వృద్ధులు ఏ అవసరమున్నా డయల్‌ 100 ‌కు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి సాయం చేస్తారని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌భరోసా కల్పిస్తున్నారు. అంతేగాక సీజనల్‌ ‌వ్యాధులపై వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 423 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆహార ఉత్పత్తుల కొనుగోల్లు జోరుగా సాగుతున్నాయి. అదే స్థాయిలో రైతుల ఖాతాల్లోకి నగదును జమచేయిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 3 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరిధాన్యం, లక్షా 30వేల మెట్రిక్‌ ‌టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేశారు. జిల్లాలో మిర్చి రైతులకు రూ.18 కోట్ల రుణాలను అందజేశారు. కోల్డ్ ‌స్టోరేజీలో రైతులు నిల్వ చేసిన పంటకు భద్రత, బీమా సౌకర్యం కల్పించారు. అలాగే స్వయం సహాయక మహిళా సంఘాలకు చేయూతనందించేందుకు జిల్లాలో 2860 మహిళా గ్రూపులకు రూ.23 కోట్ల 89 లక్షల రుణాలను కలెక్టర్‌ అం‌దించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రయోగాత్మకంగా సిరివెన్నెల మహిళా రైతు ఉత్పత్తిదారుల సమైఖ్య ద్వారా మామిడి పంటను కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించారు.

గ్రామాల్లో ఉపాధిహమీ పనులను కలెక్టర్‌ ‌వేగవంతం చేయడంతో లక్షా 35వేల మంది కూలీ పనులకు వెళ్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేదప్రజలకు చేయూతగా నిలుస్తున్నది. లాక్‌డౌన్‌ను ఎంతో కట్టుదిట్టంగా అమలు చేస్తున్న ప్రభుత్వం, గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకోవాలనే ఉద్ధేశంతో ఉపాధి పనులను ముమ్మరం చేసి పేదలకు ఊరట నిస్తున్నది. కొత్తగా జాబ్‌ ‌కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకున్న వారికి సైతం కలెక్టర్‌ ‌కర్ణన్‌ ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాల్లో 4 లక్షల తెల్ల రేషన్‌కార్డు దారులందరికీ రూ. 1500 నగదు, 12 కిలోల బియ్యాన్ని అందజేశారు. అలాగే కార్డు లేని వారికి కూడా నిత్యావసరాలు పంపిణీ చేశారు. కొవిడ్‌-19 ‌సంక్షోభంతో సంబందం లేకుండా పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పూర్తి చేయిస్తున్నారు. అలాగే వానాకాలంలో పంట సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులను సిద్ధం చేశారు. ముఖ్యంగా 44 వేల 807 మంది వలస కూలీలకు ఆపన్న హస్తం అందించి మానవత్వం చాటుకుంటున్నారు. బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి స్వస్థలాలకు చేరుకుంటున్న వారిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచుతూ వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. సొంతూళ్లకు వస్తున్న వలస కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహారం లభించక అష్టకష్టాలు పడుతున్న వలస కూలీలకు కడుపు నిండా తిండి పెట్టేందుకు మేమున్నామంటూ కలెక్టర్‌ అం‌డగా నిలుస్తున్నారు. వలస కార్మికులు వందల సంఖ్యలో వస్తుండడంతో గ్రామాల్లోనే కరోనా క్వారంట్నెన్‌ ‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని రెండు వారాల పాటు, హోం క్వారంట్నెన్‌లో ఉంచుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని నేరుగా ఆస్పత్రులకు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తున్నారు. లక్షణాలు లేని వారిని హోంక్వారంట్నెన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇంట్లో స్థలం లేని వారిని గ్రామాల్లోని కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలో ఉంచాలని కలెక్టర్‌ ‌కర్ణన్‌ ‌నిర్ణయించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ ‌పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలంతా భయాందోళనలో ఉన్నారు. కరోనా దరిచేరకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితులో ఉన్నారు. ఇలాంటి సమయంలో భౌతిక దూరం పాటించడమే శ్రీరామరక్ష అంటున్నారు కలెక్టర్‌. ‌మునుపెన్నడూ కనీవినీ ఎరుగని సంక్షోభం యావత్‌ ‌ప్రపంచ ప్రజానీకానికి కరోనా వైరస్‌ ‌రూపంలో దాపురించింది. ఈ వైరస్‌ ‌వ్యాప్తి చెంది ప్రాణాలు కోల్పొకుండా ఉండాలంటే స్వీయనియంత్రణ ఎంతో అవసరమంటారు కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!